sureshkumar
-
నేడు ఎస్జీఎఫ్ జట్ల ఎంపికలు
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లా స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సోమవారం స్టేడియంలో అండర్–14, అండర్–17 హ్యాండ్‌బాల్, బాస్కెట్‌బాల్, యోగా జిల్లా జట్ల ఎంపికలు నిర్వహించనున్నట్లు ఎస్జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి సురేశ్‌కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. క్రీడాకారులు ఉదయం 10 గంటలకు స్టేడియంలో రిపోర్ట్ చేయాలని కోరారు. 27న వాలీబాల్, సాఫ్ట్‌బాల్ ఎంపికలు.. ఈనెల 27న కల్వకుర్తి జెడ్పీహెచ్ఎస్లో అండర్–17 వాలీబాల్, ఆలంపూర్ మండలం బుక్కాపూర్లో అండర్–17 సాఫ్ట్‌బాల్ జిల్లా జట్లను ఎంపికచేయనున్నట్లు సురేశ్‌కుమార్ తెలిపారు. క్రీడాకారులు ఆధార్‌కార్డు, భోనపైడ్తో ఎంపికల్లో పాల్గొనాలని కోరారు. -
20న అండర్–14 వాలీబాల్ క్రీడాకారుల ఎంపిక
మహబూబ్‌నగర్ క్రీడలు: నారాయణపేటలోని మినీ స్టేడియంలో ఈనెల 17న నిర్వహించాల్సిన అండర్–14 స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ వాలీబాల్ బాల, బాలికల జట్ల ఎంపికలు వర్షాల కారణంగా 20న నిర్వహించనున్నట్లు ఎస్జీఎఫ్ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి సురేష్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. క్రీడాకారులు ఉదయం 9 గంటలకు స్టేడియంలో రిపోర్ట్ చేయాలని, మిగతా వివరాలకు రమణ సెల్ నెం : 9985250389 ను సంప్రదించాలని ఆయన కోరారు. -
అసిఫ్నహర్ కాల్వ పరిశీలన
శాలిగౌరారం : నార్కట్‌పల్లి మండలం అక్కెనపల్లి చెరువు నుంచి శాలిగౌరారం మండలంలోని ఐదు గ్రామాల చెరువులను నింపే అసిఫ్నహర్ కాల్వను రాష్ట్ర నీటిపారుదల శాఖ చీప్ ఇంజనీర్ సురేశ్‌కుమార్ శనివారం పరిశీలించారు. కాల్వతో పాటు ఆయా గ్రామాల్లోని చెరువులు, వాటి కింద సాగు విస్తీర్ణం, కాల్వ నిర్మాణానికి కావాల్సిన భూమి తదితర విషయాలను సంబంధిత జిల్లా అధికారులను అడిగి తెలుసుకున్నారు. అసిఫ్నహర్ కాల్వ ద్వారా నార్కట్‌పల్లి మండలం అక్కెనపల్లి, నక్కలపల్లిపాటు శాలిగౌరారం మండలంలోని భైరవునిబండ, తక్కెళ్లపహాడ్, ఆకారం, వల్లాల, పెర్కకొండారం గ్రామాల పరిధిలోని చెరువులను నింపవచ్చన్నారు. ఆయా చెరువుల కింద సుమారు 3 వేల ఎకరాలు సాగులోకి రానుందని తెలిపారు. ఆయనవెంట నీటి పారుదలశాఖ ఎస్ఈ ధర్మానాయక్, ఈఈ సుందర్నాయక్, డీఈఈ లింగయ్య, ఏఈ చంద్రశేఖర్, సింగిల్‌విండో చైర్మన్ లోకసాని రంగారెడ్డి, నాయకులు అయితగోని వెంకన్న, భూపతి వెంకన్న, ఈదులకంటి యాదయ్య, పులిగిళ్ళ శంకరయ్య తదితరులు ఉన్నారు.