నోళ్లు తెరుచుకున్న బోర్లు..
గ్రామాల్లో వేసిన బోరుబావులు నోరు తెరుచుకున్నాయి. ప్రమాదాలు జరిగితే గానీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. మండలంలోని పోతుగల్‌తాండా, హైతాబాద్, చందనవెళ్లి, దేవునిగడ్డ, బోడంపహాడ్, మన్‌మర్రి, అంతారం, సర్దార్‌నగర్, కక్కులూర్, కేశారం, నాందార్‌ఖాన్‌పేట్, మల్లారెడ్డిగూడ, సీతారాంపూర్ తదితర గ్రామాల్లో బోర్లు వేసినా నీరు సరిగా రాకపోవడంతో అలాగే వదిలేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి మండలంలోని ఆయా గ్రామాల్లో నీరులేక వృథాగా పడి ఉన్న బోరుబావులను పూడ్చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. - షాబాద్