అనంతపురం సెంట్రల్ : నగరంలో రాయల్‌నగర్ సమీపంలోని హెచ్చెల్సీ కాలువలో ఓ వృద్ధురాలు శవమై తేలింది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికి తీశారు. మృతురాలు సీపీఐ జిల్లా సహాయకార్యదర్శి నారాయణస్వామి తల్లి శివమ్మ(65)గా గుర్తించారు. శివమ్మకు కొంతకాలంగా మానసిక పరిస్థితి బాగోలోదు. దీంతో కుటుంబసభ్యులు ఎప్పుడూ ఆమెను పర్యవేక్షిస్తూ ఉండేవారు.
కానీ 19వ తేదీ మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు నగరమంతా గాలించారు. శనివారం సాయంత్రం మూడవపట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అయితే ఆదివారం మధ్యాహ్నానికి హెచ్చెల్సీలో శవమై కనిపించడంతో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ప్రమాదవశాత్తు కాలువలో పడిందా.. లేక ఆత్మహత్యకు పాల్పడిందా అనే వివరాలు తెలియాల్సి ఉంది. నాల్గవ పట్టణ సీఐ శివశంకర్, ఎస్‌ఐ శ్రీరామ్‌లు చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకున్నారు.
హెచ్చెల్సీలో వృద్ధురాలి మృతదేహం
Published Sun, Jan 22 2017 11:35 PM | Last Updated on Tue, Sep 5 2017 1:51 AM
Advertisement
Advertisement