
పీఏబీఆర్‌లోకి తుంగభద్ర నీరు
కూడేరు: కూడేరు మండల పరిధిలోని పెన్నహోబిళం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లోకి శనివారం తుంగభద్ర డ్యాం నుంచి హెచ్చెల్సీ కెనాల్ ద్వారా నీరు చేరినట్లు డ్యాం డీఈ పక్కీరప్ప తెలిపారు. ప్రస్తుతం డ్యాంలోకి 60 క్యూసెక్కుల నీరు చేరుతున్నట్లు ఆయన తెలిపారు. పీఏబీఆర్ డ్యాంలో శనివారం నాటికి 1.37 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు తెలిపారు. డ్యాం నుంచి అనంత, సత్యసాయి, శ్రీరామిరెడ్డి తాగునీటి ప్రాజెక్టులకు రోజుకు సుమారు 60–70 క్యూసెక్కుల వరకు నీరు వెళుతున్నట్లు వివరించారు. డ్యాంలోకి త్వరలోనే పూర్తి స్థాయిలో నీరు వచ్చే అవకాశాలు ఉన్నట్లు డీఈ విలేకరులకు తెలిపారు.