pabr
-
పీఏబీఆర్‌లోకి తుంగభద్ర నీరు
కూడేరు: కూడేరు మండల పరిధిలోని పెన్నహోబిళం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లోకి శనివారం తుంగభద్ర డ్యాం నుంచి హెచ్చెల్సీ కెనాల్ ద్వారా నీరు చేరినట్లు డ్యాం డీఈ పక్కీరప్ప తెలిపారు. ప్రస్తుతం డ్యాంలోకి 60 క్యూసెక్కుల నీరు చేరుతున్నట్లు ఆయన తెలిపారు. పీఏబీఆర్ డ్యాంలో శనివారం నాటికి 1.37 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు తెలిపారు. డ్యాం నుంచి అనంత, సత్యసాయి, శ్రీరామిరెడ్డి తాగునీటి ప్రాజెక్టులకు రోజుకు సుమారు 60–70 క్యూసెక్కుల వరకు నీరు వెళుతున్నట్లు వివరించారు. డ్యాంలోకి త్వరలోనే పూర్తి స్థాయిలో నీరు వచ్చే అవకాశాలు ఉన్నట్లు డీఈ విలేకరులకు తెలిపారు. -
గల్లంతైన డిగ్రీ విద్యార్థి మృతి
కూడేరు (ఉరవకొండ) : కూడేరు మండలం పెన్నహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్)లో గల్లంతైన డిగ్రీ విద్యార్థి మూడో రోజు శవమై తేలాడు. తమ కుమారుడు ప్రాణాలతో తిరిగి వస్తాడని ఎదురుచూసిన తల్లిదండ్రులకు నిరాశే ఎదురైంది. విగతజీవుడైన తనయుడిని చూసి బోరున విలపించారు. వివరాలిలా ఉన్నాయి. అనంతపురానికి చెందిన చంద్రశేఖర్, వసుంధర దంపతుల తనయుడు చక్రపాణి (20) స్నేహితులతో సరదాగా గడిపేందుకు బుధవారం పీఏబీఆర్‌కు వచ్చారు. ఇద్దరు స్నేహితులతో కలిసి అతను తెప్పలో ఎక్కి విహారానికి బయల్దేరారు. కాస్త దూరం వెళ్లగానే అదుపుతప్పి తెప్ప బోల్తాపడింది. ఇద్దరు స్నేహితులు గట్టుకు చేరుకోగా.. చక్రపాణి నీటమునిగాడు. సీఐ శివనారాయణ స్వామి, ఎస్ఐ రాజు, హెడ్‌కానిస్టేబుల్ దస్తగిరి, సిబ్బంది అనిల్, దుర్గాప్రసాద్, ప్రభు, కరీం, ఫైరింజన్ సిబ్బంది ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఫలితం దక్కలేదు. శుక్రవారం ఉదయం చ్రక్రపాణి శవమై తేలాడు. కన్నకొడుకు కోసం వేయికళ్లతో ఎదురుచూసిన తల్లిదండ్రులకు చివరకు గర్భశోకమే మిగిలింది. మృతదేహంపై పడి బోరున విలపించారు. ‘బుజ్జి కన్నా.. అప్పుడే నీకు నిండు నూరేళ్లు నిండాయా’ అంటూ విలపించారు. స్నేహితులపై ఫిర్యాదు తమ కుమారుడిని స్నేహితులే నీటిలోకి తోసేశారని అనుమానం వ్యక్తం చేస్తూ చక్రపాణి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం అనంతపురం సర్వజన ఆస్పత్రికి తరలించారు. -
పర్యవేక్షణ లోపమే
- ఆనాడే స్పందించి ఉంటే ముప్పు తప్పేది - 8 నెలల కిందటే పీఏబీఆర్‌లో పనిచేయని విద్యుత్ మోటార్ - ప్రత్యామ్నాయ మోటార్ సైతం 3 రోజులుగా మొరాయింపు - 834 గ్రామాలకు ఆగిన ‘శ్రీరామరెడ్డి’ తాగునీటి సరఫరా అధికారులు, పాలకుల నిర్లక్ష్యంపై మండిపడుతున్న ప్రజలు అనంతపురం సిటీ : శ్రీరామరెడ్డి తాగునీటి పథకం నిర్వహణపై అధికారుల్లో చిత్తశుద్ధి లోపించింది. జిల్లాలో వందలాది గ్రామాలకు నీటిని అందించే ఈ పథకం పట్ల నిర్లక్ష్యం చేశారు. ఫలితంగా తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడి ప్రజలు దాహార్తితో అల్లాడుతున్నారు. పెన్నహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్) నుంచి శ్రీరామరెడ్డి పథకం ద్వారా 834 గ్రామాలకు, హిందూపురం, కళ్యాణదుర్గం, మడకశిర మునిసిపాలిటీలకు తాగునీరు ఇస్తున్నారు. ఎనిమిది నెలల క్రితమే పీఏబీఆర్‌లో విద్యుత్ మోటార్ చెడిపోయింది. ప్రత్యామ్నాయ మోటార్‌తో నీటిని పంపింగ్ చేస్తూ వచ్చారు. అయితే.. చెడిపోయిన మోటారును రిపేరీ చేయించలేదు. మూడు రోజుల కిందట ‘ప్రత్యామ్నాయ’ మోటారు కూడా చెడిపోయి.. నీటి సరఫరాకు బ్రేక్ పడింది. గ్రామాలు దాహంతో అల్లాడుతున్నాయి. నీటి సమస్య తీవ్రరూపం దాల్చడంతో అధికారులు నిద్రమత్తు నుంచి తేరుకున్నారు. హడావుడిగా దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. మోటారు మరమ్మతుకు రంగంలోకి దిగారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు చాలాసార్లు పీఏబీఆర్‌ను సందర్శించినప్పటికీ అక్కడి సమస్యలను గుర్తించడంలో విఫలమయ్యారు. ఇప్పుడు ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నిలదీసేసరికి చలనం వచ్చింది. యావత్ జిల్లా యంత్రాంగం శనివారం అర్ధరాత్రి దాకా పీఏబీఆర్ వద్దే తిష్టవేసింది. అయితే..ఆదివారం రాత్రికి గానీ మరమ్మతు పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు. మూలనపడ్డ మొదటి మోటార్ రిపేరీ కోసం పది రోజుల కిందటే రూ.20లక్షల నిధులు మంజూరయ్యాయి. వాటిని వినియోగించి మోటారును సరిచేసి ఉంటే.. నేడు నీటి సరఫరాకు ఆటంకం కలిగేది కాదు. అధికారుల నిర్లక్ష్యం, పాలకుల చిత్తశుద్ధిలోపం వల్లే ఇంతటి సమస్యకు దారి తీసిందని ప్రజలు మండిపడుతున్నారు. పంప్‌హౌస్‌లో మెకానిక్, ఎలక్ట్రీషియన్‌ను అందుబాటులో ఉంచి, ఎప్పటికప్పుడు మోటార్లను పర్యవేక్షిస్తే బాగుంటుందని సూచిస్తున్నారు. -
94 లక్షల యూనిట్ల విద్యుత్ తయారీ
కూడేరు : మండల పరిధిలోని పెన్నహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్ )లోని ఏపీ జె¯ŒSకో విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో ఆదివారం నాటికి 94 లక్షల యూనిట్ల విద్యుత్‌ను తయారు చేసినట్లు ఏపీ జెన్ కో డీఈ రఫి అహ్మద్ తెలిపారు. విద్యుత్ ఉత్పత్తిని సుమారు మూడు నెలల క్రితం ప్రారంభించామన్నారు. ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తికి డ్యాం నుంచి సుమారు 700 క్యూసెక్కుల నీరు సరఫరా అవుతోందన్నారు. ఒక రోజుకు 75 వేల యూనిట్ల విద్యుత్ తయారు అవుతోందన్నారు. గతంలో కోటి 80 లక్షల యూనిట్ల విద్యుత్‌ను తయారు చేయడం జరిగిందన్నారు. ఇప్పుడు కూడా అంత కంటే ఎక్కువనే విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇక్కడ ఉత్పత్తి అయిన విద్యుత్‌ను అనంతపురం నుంచి కళ్యాణదుర్గం వెళ్ళే లై¯ŒSకు కలపడం జరుగుతుందన్నారు. -
పీఏబీఆర్ కుడి కాలువకు నీరు విడుదల
కూడేరు : కూడేరు మండల పరిధిలోని పెన్నహోబిâýæం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్ డ్యాం) నుంచి ధర్మవరం కుడికాలువకు మంగâýæవారం నీటిని విడుదల చేశారు. మంత్రి పరిటాల సునీత, ఎమ్మెల్సీ కేశవ్‌లు ముఖ్య అతిథులుగా హాజరై స్విచ్ ఆ¯ŒS చేసి నీటిని విడుదల చేశారు. అనంతరం వారు డ్యాంలో ప్రస్తుతం నీటి మట్టం ఎంత ఉంది ? ఇ¯ŒSప్లో, ఔట్ ప్లో, కుడికాలువకు ఎన్ని క్యూసెక్కులు నీటిని సరఫరా చేస్తారు తదితర అంశాలపై ఎస్ఈ శేషగిరిరావును అడిగి తెలుసుకున్నారు. డ్యాంలో 3.5 టీఎంసీల నీరు నిలువ ఉందని, జీడిపల్లి జలాశయం నుంచి 800 క్యూసెక్కుల నీరు డ్యాంలోకి వస్తోందని ఎస్ఈ వివరించారు. జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ తయారీకి, 3 తాగునీటి ప్రాజుక్టులకు సుమారు 800 క్యూసెక్కుల నీటిని సరఫరా చేయడం జరుగుతోందన్నారు. కుడికాలువకు 2.5 టీఎంసీల నీటిని కేటాయించడం జరిగిందని చెప్పారు. కుడి కాలువ ద్వారా నీటి విడుదల సందర్భంగా కాలువకు 200 క్యూసెక్కుల నీటిని వదిలి, బుధవారం ఉదయం నుంచి 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తామని ఆయన తెలిపారు. మొదటి విడతలో కుడికాలువకు ఇరువైపులా పక్కనే ఉన్న చెరువులకు నీటిని నింపేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఈ లెక్కన 39 చెరువులకు నీటిని నింపుతామన్నారు. అనంతరం మంత్రి, ఎమ్మెల్సీ మాట్లాడుతు కాలువకు నీటిని విడుదల చేసి చెరువులకు నీరందించడం ద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. -
పీఏబీఆర్‌లో జల విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం
► ఏపీ జెన్కో డీఈ రఫి అహమ్మద్ వెల్లడి కూడేరు: మండల పరిధిలోని పెన్నహోబిళం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్ డ్యాం)లోని ఏపీ జెన్కో విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో జల విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించినట్లు ఏపీ జెన్ కో డీఈ రఫి అహమ్మద్, డ్యాం డీఈ పక్కీరప్పలు సోమవారం తెలిపారు. విద్యుత్ ఉత్పత్తికి డ్యాం నుంచి 800 క్యూసెక్కుల నీరు సరఫరా అవుతోందన్నారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో రెండు టరై్బన్లు ఉన్నాయి. అందులో ఒక దానిలో మాత్రమే ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించినట్లు జెన్కో డీఈ తెలిపారు. గంటకు 4000 యూనిట్ల విద్యుత్‌ను తయారీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇక్కడ ఉత్పత్తి అయిన విద్యుత్‌ను అనంతపురం నుంచి కళ్యాణదుర్గం వెళ్ళే లైన్‌కు కలుపుతామన్నారు. డీఈ పక్కీరప్ప మాట్లాడుతూ డ్యాంలోకి హెచ్చెల్సీ ద్వారా 850 క్యూసెక్కులు నీరు వస్తోందన్నారు. అందులో నుంచి విద్యుత్ ఉత్పత్తికి 800 క్యూసెక్కులు, మూడు తాగునీటి ప్రాజెక్టులకు 50 క్యూసెక్కుల వరకు నీటిని సరఫరా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం డ్యాంలో నీటి మట్టం 2.334 టీఎంసీల నీరు నిల్వ ఉందని వివరించారు.