జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం
పీఏబీఆర్‌లో జల విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం
Published Tue, Aug 9 2016 12:38 AM | Last Updated on Mon, Sep 4 2017 8:25 AM
► ఏపీ జెన్‌కో డీఈ రఫి అహమ్మద్ వెల్లడి
కూడేరు:
మండల పరిధిలోని పెన్నహోబిళం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్ డ్యాం)లోని ఏపీ జెన్‌కో విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో జల విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించినట్లు ఏపీ జెన్ కో డీఈ రఫి అహమ్మద్, డ్యాం డీఈ పక్కీరప్పలు సోమవారం తెలిపారు. విద్యుత్ ఉత్పత్తికి డ్యాం నుంచి 800 క్యూసెక్కుల నీరు సరఫరా అవుతోందన్నారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో రెండు టరై్బన్లు ఉన్నాయి.
అందులో ఒక దానిలో మాత్రమే ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించినట్లు జెన్‌కో డీఈ తెలిపారు. గంటకు 4000 యూనిట్ల విద్యుత్‌ను తయారీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇక్కడ ఉత్పత్తి అయిన విద్యుత్‌ను అనంతపురం నుంచి కళ్యాణదుర్గం వెళ్ళే లైన్‌కు కలుపుతామన్నారు. డీఈ పక్కీరప్ప మాట్లాడుతూ డ్యాంలోకి హెచ్చెల్సీ ద్వారా 850 క్యూసెక్కులు నీరు వస్తోందన్నారు.
అందులో నుంచి విద్యుత్ ఉత్పత్తికి 800 క్యూసెక్కులు, మూడు తాగునీటి ప్రాజెక్టులకు 50 క్యూసెక్కుల వరకు నీటిని సరఫరా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం డ్యాంలో నీటి మట్టం 2.334 టీఎంసీల నీరు నిల్వ ఉందని వివరించారు.
Advertisement
Advertisement