గార్లదిన్నె : హెచ్చెల్సీ కాలువలో గల్లంతైన రాము (16) మృతి చెందాడు. గురువారం గ్రామస్తులు యువకుడి మృతదేహాన్ని వెలికి తీశారు. మండల పరిధిలోని పెనకచెర్ల డ్యాంకు చెందిన చాకలి లక్ష్మీదేవి, నరసింహుల ఏకైక కుమారుడు రాము బుధవారం దుస్తులు ఉతకడానికి వెళ్లి ప్రమాదవశాత్తు కాలువలో గల్లంతైన విషయం తెలిసిందే. బుధవారం రాత్రి వరకు గ్రామస్తులు, పోలీసులు గాలించినా యువకుడి ఆచూకీ తెలియరాలేదు.
గురువారం మధ్యాహ్న సమయంలో నీటి ప్రవాహంలో కొట్టుకు పోతు ఉండటాన్ని గ్రామస్తులు గమనించి సస్పెన్సన్ బ్రిడ్జి వద్ద గ్రామస్తులు మృతదేహాన్ని బయటికి తీశారు. రాము మృతదేహం వద్ద తల్లిదండ్రులతో పాటు బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
గల్లంతైన బాలుడి మృతి
Published Fri, Oct 7 2016 1:23 AM | Last Updated on Mon, Sep 4 2017 4:25 PM
Advertisement
Advertisement