ఖైదీలకు అవగాహన కల్పిస్తున్న న్యాయమూర్తి జయరాజ్
ఒక్కసారి ఆలోచించండి..
Published Sun, Oct 2 2016 11:12 PM | Last Updated on Sat, Aug 11 2018 8:48 PM
– ప్రతి ఖైదీలోనూ సత్ప్రవర్తన రావాలి
– మీపై కుటుంబాలు ఆధారపడ్డాయని గుర్తించుకోండి
– ఖైదీల సంక్షేమ దినోత్సవంలో ఏడీజే ఎస్.ఎస్.ఎస్ జయరాజ్
మదనపల్లె టౌన్ : ‘నేరం చేసి జైలుకు వచ్చామని కుంగి పోకండి. ఒక్కసారి ఆలోచించండి.. మీపై కుటుంబాలు ఆధార పడ్డాయని గుర్తించుకోండి. ప్రతి ఖైదీ మార్పు కోసం ప్రయత్నించాలి’ అని మదనపల్లె మండల న్యాయసేవా అధికార సంస్థ చైర్మన్, రెండవ అదనపు జిల్లా జడ్జి ఎస్.ఎస్.ఎస్ జయరాజ్ తెలిపారు. స్థానిక స్పెషల్ సబ్‌జైలులో ఆదివారం గాంధీ జయంతి సందర్భంగా ఖైదీల సంక్షేమ దినోత్సవం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జైలుకు వచ్చినంత మాత్రాన అందరూ నేరస్తులే అని అనుకోవద్దన్నారు. కొన్ని అనివార్య కారణాలతోనో, తెలిసో తెలియకో తప్పులుచేస్తుంటారని పేర్కొన్నారు. జైళ్లకు వచ్చిన వారిలో 90 శాతం మంది పచ్చాత్తాప్పడి మార్పును కోరుతున్నారని తెలిపారు. ఎక్కువ కాలం జైల్లోనే ఉండి బెయిలు పొందలేని వారికి బెయిలు మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కారన్యక్రమంలో జైలు సూపరింటెండెంట్ వేణుగోపాల్ రెడ్డి, వార్డుర్లు, కోర్టు సిబ్బంది నాగమణి, మహిత, న్యాయవాదులు పాల్గొన్నారు.
Advertisement