ప్లాన్‌ తప్ప పనుల్లేవు | only plan ..no founds | Sakshi
Sakshi News home page

ప్లాన్‌ తప్ప పనుల్లేవు

Published Fri, Nov 18 2016 11:25 PM | Last Updated on Mon, Sep 4 2017 8:27 PM

only plan ..no founds

  • ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధుల మంజూరులో జాప్యం
  • పక్కదారి పడుతున్న కోట్ల రూపాయలు
  • అర్హులకు అందని పథకాలు
  • అందని ద్రాక్షగా దళిత, గిరిజన సంక్షేమం
  •  
    ‘మాటలు మధురం.. చేతలు చేదు’ అన్నట్టుంది రాష్ట్ర ప్రభుత్వం తీరు. దళిత, గిరిజన సంక్షేమానికి రూ.వేల కోట్లు ఖర్చు పెడుతున్నామంటూ పాలకులు చేస్తున్న ప్రకటనలకు క్షేత్రస్థాయిలో పరిస్థితులకు ఏ మాత్రం పొంతన లేదనటానికి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ పథకం అమలు తీరే సాక్ష్యం. ఎస్సీ, ఎస్టీల కోసం ప్రత్యేకంగా బడ్జెట్‌ కేటాయిస్తున్నా అందులో మెజారిటీ నిధులు పక్కదారి పడుతున్నాయి. కొన్ని పనులు ప్రారంభించినా వాటి పురోగతి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. సబ్‌ ప్లాన్‌నిధులను ప్రభుత్వం దారి మళ్లించి, ఇతరత్రా వినియోగిస్తోందని, అందిన మేరకు ప్రయోజనమైనా అర్హులకు కాక అధికార పార్టీ వారి అనుయాయులకే దక్కుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
     
    సాక్షి, రాజమహేంద్రవరం :
    కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం 2013లో ఎస్సీ, ఎస్టీల కోసం ఉప ప్రణాళిక పేరిట ప్రత్యేకంగా బడ్జెట్‌ కేటాయించడం ప్రారంభించిది. అదే విధానాన్ని చంద్రబాబు ప్రభుత్వం కొనసాగిస్తోంది. జిల్లాలో ఈ ఏడాది సబ్‌ప్లాన్‌ నిధులతో ప్రారంభించిన పనులు ముందుకు సాగడం లేదు. సబ్‌ప్లాన్‌లో భాగంగా ఈ ఏడాది జిల్లాలో రూ.5.70 కోట్లతో 76 సామాజిక భవనాలు నిర్మించ తలపెట్టారు. వీటిలో 50 శాతంపైగా భవన నిర్మాణాలు వివిధ దశల్లో ఆగిపోయాయి. దళితులు 40 శాతం కన్న ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పంచాయతీరాజ్‌ శాఖ ఆ««దl్వర్యంలో రోడ్ల నిర్మాణానికి  140 పనులను గుర్తించి, రూ.40 కోట్లు కేటాయించారు. గిరిజన ఉప ప్రణాళిక కింద 19 పనులు గుర్తించగా రూ.19.26 కోట్లు కేటాయించగా ఈ పనుల్లో ఎలాంటి పురోగతీ లేదు.
    స్వయం ఉపాధి రుణాల ఊసేదీ..
    గత ఆర్థిక సంవత్సరం(2015–16)లో ఎస్సీ, ఎస్టీలకు స్వయం ఉపాధి కల్పనకు రూ.112.11 కోట్లతో రుణ ప్రణాళికను రూపాందించారు. ఈ నిధుల ద్వారా 8,473 మందికి లబ్ధి చేకూర్చాలన్నది లక్ష్యం.  2,594 మందికి బ్యాంకుల ద్వారా రూ.36.45 కోట్ల రుణాలు మంజూరు చేస్తున్నట్లు ఉత్తర్వులు ఇచ్చారు. కానీ ఇప్పటి వరకూ కేవలం 127 మందికే రుణాలు మంజూరు కావడం దళితుల సంక్షేమంపై సర్కారు చిత్తశుద్ధిని తెలియజేస్తుంది. బ్యాంకులతో సంబంధం లేకుండా లబ్ధిదారులకు నేరుగా రుణాలందజేసే ఎ¯ŒSఎస్‌ఎఫ్‌డీసీ పథకంలో 316 మందికి రూ.5.66 కోట్లు ఇవ్వాల్సి ఉండగా 90 మందికి రూ.1.98 కోట్లు, ఎ¯ŒSఎస్‌కేఎఫ్‌డీసీ పథకంలో 109 మందికి రూ.1.66 కోట్లు ఇవ్వాల్సి ఉండగా 90 మందికి రూ. 29.5 లక్షలు మంజూరు చేశారు. కానీ నేటి వరకూ ఒక్క రూపాయి కూడా లబ్ధిదారులకు అందకపోవడం గమనార్హం.
    గతేడాది దరఖాస్తులకు దిక్కులేదు.. మళ్లీ కొత్తవి..
    గత ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ కార్పొరేష¯ŒS ద్వారా ఇచ్చిన సబ్సిడీ రుణాల లబ్ధిదారుల దరఖాస్తులు ఇప్పటికీ వందల సంఖ్యలో గ్రౌండింగ్‌ దశలోనే ఉన్నాయి. కొందరికి రుణం మంజూరు చేసినా వారు  బ్యాంకులు, కార్పొరేష¯ŒS కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఫలితం లేదు. గతేడాది దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు ఇప్పటి వరకూ రుణాలివ్వకపోగా ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగా అర్హుల నుంచి కార్పొరేష¯ŒS దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం మరో నాలుగు నెలల్లో ముగియనుండగా లబ్ధిదారుల ఎంపిక, రుణాల మంజూరు ఎప్పటికి పూర్తవుతాయన్న ప్రశ్నకు పాలకులే సమాధానం చెప్పాలి. స్త్రీనిధి పథకం కింద 3,622 మంది దళిత మహిళలకు రూ. 14 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఇప్పటి వరకు సగం మందికి కూడా నిధులు అందివ్వలేదు. అధికారపార్టీ నేతల సిఫార్సులు ఉన్న వారికే ఈ పథకం ఫలాలు అందుతున్నాయని, నిజమైన అర్హులకు ఇవ్వడంలేదన్న ఆరోపణలున్నాయి.
     
    నిధులు మళ్లించినందుకా ‘బాబు’కు సన్మానం?
    ఎస్సీ, ఎస్టీ సబ్‌ఫ్లా¯ŒS నిధులను వారికే కేటాయించాలి. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు వాటిని వెలుగోడు, తోటపల్లి ప్రాజెక్టులకు మళ్ళించారు. ఎస్సీ,ఎస్టీలకు అన్యాయం చేసిన చంద్రబాబుకు ఏ ముఖం పెట్టుకుని కారెం శివాజీ సన్మానం చేస్తున్నారు? సబ్‌ప్లా¯ŒS నిధులపై మళ్లింపుపై సమాధానం చెప్పాకే ముఖ్యమంత్రి  సన్మానం చేయించుకోవాలి.
     – పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఎమ్మెల్సీ  
     

Advertisement
Advertisement