ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నిధులు లేవు
Published Fri, Dec 23 2016 10:30 PM | Last Updated on Tue, Jun 4 2019 5:58 PM
గంగవరం :
ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గాల అభివృద్ధికి ఎమ్మెల్యేలకు ప్రభుత్వం నిధులు కేటాయించలేకపోయిందని వైఎస్సార్ సీపీ రంపచోడవరం నియోజకవర్గ కన్వీనర్, పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్ (బాబు) విమర్శించారు. శుక్రవారం సాయంత్రం నెల్లిపూడిలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో అనంతబాబు, రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేసేం దుకు గ్రామ కమిటీలను పటిష్టం చేస్తున్నామన్నారు. మం డలంలో పార్టీ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేస్తూ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లేందుకు కార్యాచరణ చేస్తున్నామన్నారు. తొమ్మిది మంది సభ్యుల తో మండల సమన్వయ కమిటి, గ్రామ ఇ¯ŒSచార్జీలను ని యమించామని తెలిపారు. పార్టీ అభివృద్ధికి కష్టించి పని చేసే కార్యకర్తలకు తగిన గుర్తింపు ఉంటుందని, కార్యకర్తలు పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. పార్టీ మం డల కన్వీనర్ అమృత అప్పలరాజు, జిల్లా నాయకులు రామతులసి, ఏడుకొండలు, కల్లం సూర్యప్రభాకర్, ఎంపీటీసి సభ్యులు ఆదిలక్ష్మీ, కుంజం లక్ష్మీ, మండల నాయకులు రమణయ్య, బాబి, మాగంటి శ్రీను, బేబిరాణి, గంగాదేవి, సర్పంచ్‌లు అక్కమ్మ, పార్వతి పాల్గొన్నారు.
Advertisement