no founds
-
అంతంత మాత్రమేనా?
డెల్టా ఆధునికీకరణ ఈ ఏడాదీ అనుమానమే అరకొరగా నిధులు విదిల్చిన సర్కారు కుదించుకుపోయిన క్లోజర్ గడువు అమలాపురం : గోదావరి డెల్టా ఆధునికీకరణ పనులు ఈ ఏడాది జరిగేది కూడా అంతంత మాత్రమేనని రైతులు భావిస్తున్నారు. నిధుల కేటాయింపులో భారీగా కోత పెట్ట డం.. కాలువల మూసివేత సమయం (క్లోజర్) కుదించుకుపోవడం రైతులు అనుమానాలను నిజం చేస్తున్నాయి. గోదావరి డెల్టా ఆధునికీకరణ పనులు 2008లో ఆరంభమయ్యాయి. రూ.1,760 కోట్లతో చేపట్టిన పనులు నాలుగేళ్లలో అంటే 2012–13 ఆర్థిక సంవత్సరానికి పూర్తి చేయాల్సి ఉంది. చాలా ప్యాకేజీలకు టెండర్లు ఖరారు కాకపోవడం.. టెండర్లు ఖరారైన చోట కాంట్రా క్టర్లు మట్టి పనులు చేసి చేతులు దులుపుకోవడంతో పనులు ఆశించిన స్థాయిలో పూర్తి కాలేదు. ఇప్పటి వరకు కేవలం రూ.400 కోట్ల పనులు మించికాలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం నియమించిన ఎక్స్పర్ట్ కమిటీ కొన్ని పనులు తొలగించాలి్సందిగా నివేదిక ఇవ్వగా అందుకు ప్రభుత్వం అంగీకరించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు అయిన పనులు... తొలగించిన పనులు పూర్తి కాగా, ఇంకా రూ.689 కోట్ల విలువైన పనులు జరగాల్సి ఉందని అంచనా. ఈ ఏడాది క్లోజర్ సమయంలో కనీసం రూ.170 కోట్ల విలువైన 373 పనులు చేయాలని అధికారులు ప్రతిపాదనలు పంపారు. దెబ్బతిన్న లాకులు, స్లూయిజ్‌లు, డైరెక్ట్ పైప్‌ల షటర్ల స్థానంలో కొత్తవాటిని ఏర్పాటు చేయడం, మరమ్మతులు చేయడంతోపాటు రిటైనింగ్ వాల్ నిర్మాణాలు, వంతెన నిర్మాణ పనులున్నాయి. అయితే ప్రభుత్వం బడ్జెట్లో కేవలం రూ.83.50 కోట్లు కేటాయించి చేతులు దులుపుకోవడం గమనార్హం. ఈ నిధులు సైతం రెండు జిల్లాల పరిధిలో డెల్టా ఆధునికీకరణకు కేటాయించారు. అంటే మనకు దీనిలో సగం మాత్రమే నిధులు రానున్నాయన్న మాట. గత ఏడాది రూ.325 కోట్లు ఆధునికీకరణ పనులకు ప్రతిపాదనలు పంపితే ప్రభుత్వం రూ.85 కోట్లు మాత్రమే బడ్జెట్లో కేటాయించింది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఇరిగేష¯ŒS అధికారులు ఈసారి పనులను కుదించి పంపినా ఫలితం లేకుండా పోయింది. ప్రభుత్వం యధావిధిగా అరకొర నిధులు కేటాయించి చేతులు దులుపుకుంది. కుదించుకుపోయిన గడువు క్లోజర్ గడువు ఈ ఏడాది కుదించుకుపోయింది. ఏప్రిల్ 15న కాలువలు మూసి జూ¯ŒS 15న తెరవడం ద్వారా 60 రోజుల క్లోజర్ గడువు అధికారులకు ఉండేది. కాని ఈ ఏడాది జూ¯ŒS ఒకటి నాటికి డెల్టాలో ముందస్తు సాగుకు నీరిస్తామని అధికారులు ప్రకటించిన నేపథ్యంలో క్లోజర్ గడువు కేవలం 45 రోజులు మాత్రమే దక్కింది. ఉన్న సమయమే తక్కువ అనుకుంటే ఇప్పటికీ కొన్నిచోట్ల పనులు ఆరంభం కాకపోవడం గమనార్హం. మధ్యడెల్టా పరిధిలో ఆత్రేయపురం మండలం లొల్ల– ముక్తేశ్వరం బ్రాంచ్ కెనాల్ పరిధిలో వాడపాలెం వెంకన్న ఆలయానికి వెళ్లేందుకు వీలుగా రూ.1.90 కోట్లతో చేపట్టిన వంతెన నిర్మాణ పనులు మాత్రమే కొంత వేగంగా సాగుతున్నాయి. మిగిలిన పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉన్నాయి. దీంతో ఈ ఏడాది కూడా ఆధునికీకరణ పనులు అటకెక్కినట్టేనని రైతులు అభిప్రాయపడుతున్నారు. -
ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నిధులు లేవు
గంగవరం : ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గాల అభివృద్ధికి ఎమ్మెల్యేలకు ప్రభుత్వం నిధులు కేటాయించలేకపోయిందని వైఎస్సార్ సీపీ రంపచోడవరం నియోజకవర్గ కన్వీనర్, పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్ (బాబు) విమర్శించారు. శుక్రవారం సాయంత్రం నెల్లిపూడిలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో అనంతబాబు, రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేసేం దుకు గ్రామ కమిటీలను పటిష్టం చేస్తున్నామన్నారు. మం డలంలో పార్టీ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేస్తూ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లేందుకు కార్యాచరణ చేస్తున్నామన్నారు. తొమ్మిది మంది సభ్యుల తో మండల సమన్వయ కమిటి, గ్రామ ఇ¯ŒSచార్జీలను ని యమించామని తెలిపారు. పార్టీ అభివృద్ధికి కష్టించి పని చేసే కార్యకర్తలకు తగిన గుర్తింపు ఉంటుందని, కార్యకర్తలు పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. పార్టీ మం డల కన్వీనర్ అమృత అప్పలరాజు, జిల్లా నాయకులు రామతులసి, ఏడుకొండలు, కల్లం సూర్యప్రభాకర్, ఎంపీటీసి సభ్యులు ఆదిలక్ష్మీ, కుంజం లక్ష్మీ, మండల నాయకులు రమణయ్య, బాబి, మాగంటి శ్రీను, బేబిరాణి, గంగాదేవి, సర్పంచ్‌లు అక్కమ్మ, పార్వతి పాల్గొన్నారు. -
ప్లాన్ తప్ప పనుల్లేవు
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల మంజూరులో జాప్యం పక్కదారి పడుతున్న కోట్ల రూపాయలు అర్హులకు అందని పథకాలు అందని ద్రాక్షగా దళిత, గిరిజన సంక్షేమం ‘మాటలు మధురం.. చేతలు చేదు’ అన్నట్టుంది రాష్ట్ర ప్రభుత్వం తీరు. దళిత, గిరిజన సంక్షేమానికి రూ.వేల కోట్లు ఖర్చు పెడుతున్నామంటూ పాలకులు చేస్తున్న ప్రకటనలకు క్షేత్రస్థాయిలో పరిస్థితులకు ఏ మాత్రం పొంతన లేదనటానికి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ పథకం అమలు తీరే సాక్ష్యం. ఎస్సీ, ఎస్టీల కోసం ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయిస్తున్నా అందులో మెజారిటీ నిధులు పక్కదారి పడుతున్నాయి. కొన్ని పనులు ప్రారంభించినా వాటి పురోగతి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. సబ్ ప్లాన్నిధులను ప్రభుత్వం దారి మళ్లించి, ఇతరత్రా వినియోగిస్తోందని, అందిన మేరకు ప్రయోజనమైనా అర్హులకు కాక అధికార పార్టీ వారి అనుయాయులకే దక్కుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాక్షి, రాజమహేంద్రవరం : కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం 2013లో ఎస్సీ, ఎస్టీల కోసం ఉప ప్రణాళిక పేరిట ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించడం ప్రారంభించిది. అదే విధానాన్ని చంద్రబాబు ప్రభుత్వం కొనసాగిస్తోంది. జిల్లాలో ఈ ఏడాది సబ్‌ప్లాన్ నిధులతో ప్రారంభించిన పనులు ముందుకు సాగడం లేదు. సబ్‌ప్లాన్‌లో భాగంగా ఈ ఏడాది జిల్లాలో రూ.5.70 కోట్లతో 76 సామాజిక భవనాలు నిర్మించ తలపెట్టారు. వీటిలో 50 శాతంపైగా భవన నిర్మాణాలు వివిధ దశల్లో ఆగిపోయాయి. దళితులు 40 శాతం కన్న ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పంచాయతీరాజ్ శాఖ ఆ««దl్వర్యంలో రోడ్ల నిర్మాణానికి 140 పనులను గుర్తించి, రూ.40 కోట్లు కేటాయించారు. గిరిజన ఉప ప్రణాళిక కింద 19 పనులు గుర్తించగా రూ.19.26 కోట్లు కేటాయించగా ఈ పనుల్లో ఎలాంటి పురోగతీ లేదు. స్వయం ఉపాధి రుణాల ఊసేదీ.. గత ఆర్థిక సంవత్సరం(2015–16)లో ఎస్సీ, ఎస్టీలకు స్వయం ఉపాధి కల్పనకు రూ.112.11 కోట్లతో రుణ ప్రణాళికను రూపాందించారు. ఈ నిధుల ద్వారా 8,473 మందికి లబ్ధి చేకూర్చాలన్నది లక్ష్యం. 2,594 మందికి బ్యాంకుల ద్వారా రూ.36.45 కోట్ల రుణాలు మంజూరు చేస్తున్నట్లు ఉత్తర్వులు ఇచ్చారు. కానీ ఇప్పటి వరకూ కేవలం 127 మందికే రుణాలు మంజూరు కావడం దళితుల సంక్షేమంపై సర్కారు చిత్తశుద్ధిని తెలియజేస్తుంది. బ్యాంకులతో సంబంధం లేకుండా లబ్ధిదారులకు నేరుగా రుణాలందజేసే ఎ¯ŒSఎస్ఎఫ్డీసీ పథకంలో 316 మందికి రూ.5.66 కోట్లు ఇవ్వాల్సి ఉండగా 90 మందికి రూ.1.98 కోట్లు, ఎ¯ŒSఎస్కేఎఫ్డీసీ పథకంలో 109 మందికి రూ.1.66 కోట్లు ఇవ్వాల్సి ఉండగా 90 మందికి రూ. 29.5 లక్షలు మంజూరు చేశారు. కానీ నేటి వరకూ ఒక్క రూపాయి కూడా లబ్ధిదారులకు అందకపోవడం గమనార్హం. గతేడాది దరఖాస్తులకు దిక్కులేదు.. మళ్లీ కొత్తవి.. గత ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ కార్పొరేష¯ŒS ద్వారా ఇచ్చిన సబ్సిడీ రుణాల లబ్ధిదారుల దరఖాస్తులు ఇప్పటికీ వందల సంఖ్యలో గ్రౌండింగ్ దశలోనే ఉన్నాయి. కొందరికి రుణం మంజూరు చేసినా వారు బ్యాంకులు, కార్పొరేష¯ŒS కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఫలితం లేదు. గతేడాది దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు ఇప్పటి వరకూ రుణాలివ్వకపోగా ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగా అర్హుల నుంచి కార్పొరేష¯ŒS దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం మరో నాలుగు నెలల్లో ముగియనుండగా లబ్ధిదారుల ఎంపిక, రుణాల మంజూరు ఎప్పటికి పూర్తవుతాయన్న ప్రశ్నకు పాలకులే సమాధానం చెప్పాలి. స్త్రీనిధి పథకం కింద 3,622 మంది దళిత మహిళలకు రూ. 14 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఇప్పటి వరకు సగం మందికి కూడా నిధులు అందివ్వలేదు. అధికారపార్టీ నేతల సిఫార్సులు ఉన్న వారికే ఈ పథకం ఫలాలు అందుతున్నాయని, నిజమైన అర్హులకు ఇవ్వడంలేదన్న ఆరోపణలున్నాయి. నిధులు మళ్లించినందుకా ‘బాబు’కు సన్మానం? ఎస్సీ, ఎస్టీ సబ్ఫ్లా¯ŒS నిధులను వారికే కేటాయించాలి. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు వాటిని వెలుగోడు, తోటపల్లి ప్రాజెక్టులకు మళ్ళించారు. ఎస్సీ,ఎస్టీలకు అన్యాయం చేసిన చంద్రబాబుకు ఏ ముఖం పెట్టుకుని కారెం శివాజీ సన్మానం చేస్తున్నారు? సబ్‌ప్లా¯ŒS నిధులపై మళ్లింపుపై సమాధానం చెప్పాకే ముఖ్యమంత్రి సన్మానం చేయించుకోవాలి. – పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఎమ్మెల్సీ