Opposition MLAs
-
అలాంటివాళ్లు సభకు రావడం దురదృష్టకరం: ఏపీ స్పీకర్
సాక్షి, అమరావతి: పోడియంపైకి వచ్చి విపక్ష ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా ప్రవర్తించడం బాధాకరమని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. అలాంటివాళ్లు సభకు రావడం దురదృష్టకరమన్నారు. అరాచకం సృష్టించేవాళ్లను చూస్తే బాధగా ఉందన్నారు. ఇలాంటి ఆగడాలను ఎక్కడో ఒక చోట అరికట్టాలని స్పీకర్ అన్నారు. సభ సమష్టి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. టీడీపీ సభ్యుల తీరుపై చర్యలకు ప్రివిలేజ్ కమిటీకి సిఫారసు చేస్తున్నా. అరాచకం చేసిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని స్పీకర్ అన్నారు. చదవండి: కరవు, బాబు ఇద్దరూ కవలలు: సీఎం జగన్ దౌర్జన్యం సరికాదు: అంబటి రాంబాబు ప్రతిపక్షాలు ప్రజాస్వామ్య పద్దతిలో నిరసన తెలపాలని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. టీడీపీ సభ్యులు దౌర్జన్యంగా ప్రవర్తించారన్నారు. నచ్చని అంశాలపై నిరసన తెలుపొచ్చు కానీ దౌర్జన్యం చేయడం సరికాదన్నారు. ఏ ఒక్కరోజూ సభ సజావుగా జరిగేందుకు టీడీపీ సభ్యులు సహకరించలేదని అంబటి రాంబాబు మండిపడ్డారు. అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేల రభస.. కాగా, అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు నానా రభస సృష్టించారు. పేపర్లు చించి స్పీకర్‌పైకి విసిరి కొట్టిన అనుచితంగా ప్రవర్తించారు. స్పీకర్ చైర్ వద్దకు వచ్చి దురుసుగా ప్రవర్తించారు. అసెంబ్లీ వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా టీడీపీ సభ్యుల తీరు మారలేదు. సభకు పదే పదే ఆటంకం కలిగించడంతో టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. -
President Election 2022: బీజేపీ ఆకర్ష్!
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికలో సొంత బలంతోనే తమ అభ్యర్థిని గెలిపించుకొనేందుకు అధికార బీజేపీ ఆకర్ష్ మంత్రాన్ని జపిస్తోంది. ఎలక్టోరల్ కాలేజీలో ఓట్ల శాతాన్ని పెంచుకునేలా పలు రాష్ట్రాల్లో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకునే పనిలో పడింది. బిహార్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్‌లో వారికి గాలం వేసిన బీజేపీ, తాజాగా గోవా, హరియాణా, రాజస్తాన్‌పైనా కన్నేసింది. బలం పెంచుకునే ఎత్తుగడలు రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో బీజేపీకి 48.9 శాతం ఓట్లున్నాయి. ఇంకో 11,990 ఓట్లు కావాలి. ఇందుకోసం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో విపక్ష ఎమెల్యేలకు గాలమేస్తోంది. బిహార్‌లో వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ(వీఐపీ) పార్టీ ముగ్గురు ఎమ్మెల్యేలూ, హిమాచల్‌లోనూ ఇద్దరు ఇండిపెండెంట్లు ఇప్పటికే బీజేపీలో చేరిపోయారు. మధ్యప్రదేశ్‌లో ఇద్దరు ఎస్పీ, బీఎస్పీ ఎమ్మెల్యేలతో పాటు మరో స్వతంత్ర ఎమ్మెల్యే కాషాయ కండువా కప్పుకున్నారు. మధ్యప్రదేశ్‌లో ఒకరిద్దరు ఎంపీలను కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. గోవాలో 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఏకంగా 10 మంది బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం సాగుతోంది. హరియాణాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణోయ్, రాజస్తాన్‌లో అధికార కాంగ్రెస్‌కు చెందిన మంత్రి రాజేంద్రసింగ్, మరో ఇద్దరు ఎమ్మెల్యేలు, ముగ్గురు బీఎస్పీ ఎమ్మెల్యేలు, ఇద్దరు బీటీపీ ఎమ్మెల్యేలు బీజేపీ చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఉద్ధవ్ థాకరేకు రాజ్‌నాథ్ ఫోన్ మరోవైపు, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మహారాష్ట్ర సీఎం, శివసేన పార్టీ అధినేత ఉద్ధవ్ థాకరేతో ఫోన్లో మాట్లాడారు. రాష్ట్రపతి ఎన్నికపై చర్చించుకున్నట్లు సమాచారం. తమ అభ్యర్థికి మద్దతివ్వాలని రాజ్‌నాథ్ కోరినట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి ఎన్నిక విషయంలో ఇతర పార్టీల నాయకులతో సంప్రదింపులు జరపడానికి బీజేపీ అధిష్టానం రాజ్‌నాథ్‌సింగ్, జేపీ నడ్డాలను నియమించిన సంగతి తెలిసిందే. -
సెంటీమీటరు వానకే.. ఇన్ని లీకులా!
ఒక్క చదరపు అడుగు నిర్మాణానికి రూ. 10 వేలు ఖర్చుపెట్టి ప్రపంచ స్థాయిలో తాత్కాలిక రాజధాని భవనాలు నిర్మిస్తున్నట్లు చెప్పారని, కానీ గట్టిగా ఒకటి, రెండు సెంటీమీటర్ల వానకే భవనాలన్నీ లీకుల మయం అయిపోయాయని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) విమర్శించారు. అసెంబ్లీ ప్రాంగణంలోని పలు భవనాలు లీకులమయం కావడంతో దాన్ని పరిశీలించేందుకు మీడియా ప్రతినిధులను తీసుకుని లోపలకు వెళ్లేందుకు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ప్రయత్నించారు. అయితే అక్కడున్న పోలీసులు, ఇతర అధికారులు మాత్రం మీడియాను లోపలకు అనుమతించలేదు. కేవలం ఎమ్మెల్యేలను మాత్రమే వెళ్లనిస్తామని, మీడియాను లోపలకు రానివ్వబోమని, ఆ మేరకు తమకు స్పష్టమైన ఉత్తర్వులున్నాయని అసెంబ్లీ కార్యదర్శి తమకు చెప్పినట్లు ఆర్కే తెలిపారు. ఉన్న వాస్తవాలను బయటకు చెప్పడానికి మీడియాను తీసుకుని లోపలకు వెళ్దామంటే కనీసం అనుమతి ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. అసెంబ్లీ లోపలకు కాకపోయినా కనీసం ప్రాంగణంలో మీడియా పాయింటు ఉంది కాబట్టి అక్కడి వరకు అనుమతించాలని కోరినా, దానికి కూడా అంగీకరించలేదన్నారు. దీనివెనక దురుద్దేశాన్ని గమనించాలని, వైఎస్ జగన్ చాంబరే కాదు, అసెంబ్లీ, సీఎం చాంబర్, మంత్రుల చాంబర్లు ఎలా ఉన్నాయో కూడా చూపించాలని ఆయన తెలిపారు. లోపల ఎవరో సిబ్బంది తీసిన చిన్న వీడియో క్లిప్ ద్వారానే ఈ భవనాల బండారం మొత్తం బయటపడిందని, అందువల్ల లోపల భవనాల నాణ్యత ఎలా ఉందో కచ్చితంగా చూపించాలని ఆయన డిమాండ్ చేశారు. నూజివీడు ప్రాంతంలో రాజధాని కట్టాలని తాము ఎంతగానో కోరామని, ఇక్కడ అంతా నల్లమట్టి, ఇది నిర్మాణాలకు పనికిరాదని చెప్పామని నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అన్నారు. తాము చెప్పిన విషయాలను పట్టించుకోకుండా.. ఏదో త్వరగా చేసేశామని చూపించుకోవాలన్న తొందరలో ఇలా నాణ్యత లేని నిర్మాణాలు చేయించారని, అందుకే కట్టిన కొద్ది రోజులకే ఇలా నీళ్లు కారుతున్నాయని, ఇది చాలా దురదృష్టకరమని ఆయన చెప్పారు. నూజివీడు దగ్గర ప్రభుత్వ భూములు 140 ఎకరాలున్నాయి. అయినా అక్కడ కాదని ఇక్కడే కట్టారన్నారు. మీడియాను నియంత్రించడం సరికాదని, వర్షానికి తడిసి ముద్దయిన అసెంబ్లీ ఎలా ఉందో ప్రపంచానికి తెలియాలని మరికొందరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నేత చాంబరే ఇలా ఉంటే ఇక అసెంబ్లీ హాల్ ఎలా ఉందోనని అనుమానం వ్యక్తం చేశారు. రూ. 900 కోట్లు ఖర్చుపెట్టి నాసిరకం పనులు చేపట్టారని, అసెంబ్లీ నిర్మించేటపుడు తొందరపాటు వద్దని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చెబుతున్నా తనకు అనుభవం ఉందంటూ చంద్రబాబు ఊదరగొట్టారని చెప్పారు. వాస్తవాలు ప్రజలకు తెలియకూడదనే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందని, చంద్రబాబు వల్ల ఏపీ పరువు పోయిందని, ప్రపంచ స్థాయి నిర్మాణం అంటే ఇదేనా అని ప్రశ్నించారు. -
ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నిధులు లేవు
గంగవరం : ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గాల అభివృద్ధికి ఎమ్మెల్యేలకు ప్రభుత్వం నిధులు కేటాయించలేకపోయిందని వైఎస్సార్ సీపీ రంపచోడవరం నియోజకవర్గ కన్వీనర్, పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్ (బాబు) విమర్శించారు. శుక్రవారం సాయంత్రం నెల్లిపూడిలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో అనంతబాబు, రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేసేం దుకు గ్రామ కమిటీలను పటిష్టం చేస్తున్నామన్నారు. మం డలంలో పార్టీ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేస్తూ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లేందుకు కార్యాచరణ చేస్తున్నామన్నారు. తొమ్మిది మంది సభ్యుల తో మండల సమన్వయ కమిటి, గ్రామ ఇ¯ŒSచార్జీలను ని యమించామని తెలిపారు. పార్టీ అభివృద్ధికి కష్టించి పని చేసే కార్యకర్తలకు తగిన గుర్తింపు ఉంటుందని, కార్యకర్తలు పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. పార్టీ మం డల కన్వీనర్ అమృత అప్పలరాజు, జిల్లా నాయకులు రామతులసి, ఏడుకొండలు, కల్లం సూర్యప్రభాకర్, ఎంపీటీసి సభ్యులు ఆదిలక్ష్మీ, కుంజం లక్ష్మీ, మండల నాయకులు రమణయ్య, బాబి, మాగంటి శ్రీను, బేబిరాణి, గంగాదేవి, సర్పంచ్‌లు అక్కమ్మ, పార్వతి పాల్గొన్నారు. -
బడ్జెట్ ప్రజల కోసమా..కాంట్రాక్టర్ల కోసమా
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్‌పై ప్రభుత్వం ఇచ్చిన సమాధానాలపై ప్రతిపక్షాలు తీవ్ర సంతృప్తి వ్యక్తం చేశాయి. మూడు రోజులుగా బడ్జెట్‌పై జరిగిన సాధారణ చర్చను శనివారంతో ముగిసినట్లు ప్రభుత్వం తెలిపింది. దీనిపై విపక్ష ఎమ్మెల్యేలు భట్టి విక్రమార్క, చిన్నారెడ్డి, రేవంత్ రెడ్డి, పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... బడ్జెట్ కేటాయింపులపై తాము అడిగిన వివరాలకు సమాధానం చెప్పకుండా ప్రభుత్వం అసెంబ్లీను అర్థవంతంగా వాయిదా వేసి పారిపోయిందని ఆరోపించారు. లక్షా 30 వేల కోట్ల బడ్జెట్ వాస్తవ విరుద్ధమని అన్నారు. ప్రభుత్వం లక్ష కోట్ల బడ్జెట్ అమలు చేయలేదని.. ముప్పై వేల కోట్లు సమకూర్చుకోలేరన్న తమ ప్రశ్నలకు ఈటల సమాధానమివ్వలేకపోయారని ఎద్దేవా చేశారు. ఈ బడ్జెట్ ప్రజల కోసమా.. కాంట్రాక్టర్ల కోసమా అని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ మూడేళ్లలో పూర్తి చేస్తామని చెప్పలేదంటూ సీఎం కేసీఆర్ ఇచ్చిన సమాధానమే అభివృద్ధి సంక్షేమంపై ప్రభుత్వ చిత్తశుద్ధి అర్ధమవుతుందన్నారు. -
సీఎం అధికార నివాసం వద్ద హైడ్రామా
విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికార నివాసం వద్ద సోమవారం రాత్రి రాజకీయ హైడ్రామా కొనసాగింది. రెండేళ్ల పరిపాలనా వైఫల్యాలు, భారీ అవినీతి ఆరోపణల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేక్రమంలో ఫిరాయింపు రాజకీయాలను తెరపైకి తీసుకొచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు విపక్ష పార్టీకి చెందిన ఐదుగురు ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. ఓవైపు తెలంగాణలో టీఆర్ఎస్ లోకి టీడీపీ ఎమ్మెల్యేల చేరికలను గర్హిస్తున్న ఆయనే.. విపక్ష ఎమ్మెల్యేలను తన నివాసానికి పిలిపించుకుని రహస్యంగా మంతనాలు సాగించారు. కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, ఆయన కుమార్తె అఖిలప్రియ, కడప జిల్లా జమ్మలమగుడు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, ఎమ్మెల్సీ నారాయణ రెడ్డిలు సోమవారం రాత్రి చంద్రబాబుతో భేటీఅయినవారిలో ఉన్నారు. సోమవారం మధ్యహ్నం పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) చైర్మన్ పదవికి రాజీనామాచేసిన అనంతరం భూమా తన కూతురుతో కలిసి విజయవాడలోని చంద్రబాబు నివాసానికి వెళ్లారు. మరికాసేపటికి జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, విజయవాడ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ లు కూడా బాబుతో భేటీ అయ్యారు. కాగా, ఆదినారాయణ రెడ్డి చేరతారనే ఊహాగాలను ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జి రామసుబ్బారెడ్డి, మాజీ మంత్రి శివారెడ్డి సతీమణి లక్ష్మీదేవమ్మలు తీవ్రంగా వ్యతిరేకించారు. వాళ్లను పార్టీలో చేర్చుకుంటే తమదారి తాము చూసుకుంటామని హెచ్చరించారు. చంద్రబాబు సర్దిచెప్పడంతో చివరికి కాస్త మెత్తబడ్డట్లు తెలిసింది. -
అవినీతిపై ప్రశ్నిస్తే స్పందించరేం?
సీతంపేట: సీతంపేట పీఎంఆర్సీలో జరిగిన ఐటీడీఏ పాలకవర్గ సమావేశంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు విశ్వాసరాయి కళావతి, కలమ ట వెంకటరమణ, అధికార పక్ష ఎమ్మెల్యే శివాజీలు అవినీతిపై అధికారులను నిలదీశారు. ఐటీడీఏలో వివిధ శాఖల్లో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, విచారణలో లోపంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమాలపై రెండేళ్లుగా ప్రశ్నిస్తే అధికారులు స్పందించకపోవడానికి కారణం ఏమిటని మండిపడ్డారు. సమాధానం చెప్పలేక అధికారులు నీళ్లు నమిలారు. ఉద్యానవనశాఖ లో రైతులకు ఎరువులు, పురుగు మందులు సక్రమంగా అందలేదని, దీనిలో రూ. 2.80 కోట్లు అవినీతి జరిగిందని, ఎరువులు పక్కదారి పట్టాయని పాలకొండ ఎమ్మెల్యే కళావతి సంబంధిత అధికారులను నిలదీశారు. ఎరువులను పూర్తిగా పంపిణీ చేసేస్తే గోదాంలో ఎందుకు ఉన్నాయని ప్రశ్నించారు. కాలం చెల్లే వరకూ ఎరువులనుహెచ్ఎన్టీసీ ఫారంలో ఎందుటు ఉంచాల్సి వచ్చిందని ఎమ్మెల్యే కలమట వెంకటరమణ నిలదీశారు. దీనికి ఐటీడీఏ పీవో జె.వెంకటరావు బదులిస్తూ.. 2014లో సంభవించిన హుద్‌హుద్ తుపాను సమయంలో రైతులకు పంపిణీ చేయాల్సిన ఎరువులు ఉండిపోయాయని బదులిచ్చారు. అక్రమాలు ఉన్నాయనే ఆలోచించి గత పీవో సత్యనారాయణ ఎరువులు పంపిణీ చేసిన వారికి డబ్బులు చెల్లించలేదని వివరించారు. దీనికి ఎమ్మెల్యే కలమట స్పందిస్తూ.. పీవోగా వెంకటరావు చేరిన కొద్ది రోజులకే రూ.90 లక్షలు చెల్లించాల్సిన అవసరమేమిటని నిలదీశారు. ఎరువుల అవినీతిపై పూర్తి విచారణ ఎప్పటికి జరుగుతుందనేది నివేదిక ఇవ్వాలని పలాస ఎమ్మెల్యే శివాజీ కోరారు. విజిలెన్స్ ఎస్పీకి విచారణ బాధ్యత అప్పగించామని కలెక్టర్ లక్ష్మీనరసింహం చెప్పారు. ‘వెలుగు’లో అవినీతి పెచ్చుమీరింది వెలుగు పథకంలో అవినీతి పెచ్చుమీరిందనిఎమ్మెల్యే కళావతి ఆరోపించారు. గతంలో బాలబడులు, న్యూట్రీషియన్ కేంద్రాల్లో అక్రమాలు జరిగాయని అప్పట్లో జరిగిన పాలకవర్గ సమావేశాల్లో నిలదీసినా ఇప్పటివరకు ఎటువంటి చర్యలు లేవన్నారు. అక్రమాలు చేసిన వారికి ఏకంగా ఉద్యోగాలు తిరిగి ఇతర జిల్లాల్లో ఇచ్చేశారన్నారు. భామిని ఎంఎంఎస్‌లో 2012 నుంచి 15 వరకు ఆడిట్ ఎందుకు జరగలేదని ఎమ్మెల్యే కలమట ఏపీడీ సావిత్రిని నిలదీశారు. ఎంఎంఎస్ నిధులు సీఎఫ్ రూ.90 వేలు సొంతానికి వాడుకున్నాడని ఇది ప్రశ్నించిన నాపై దాడికి దిగాడని కొత్తూరు ఎంపీపీ రాజేశ్వరి సమావేశం దృష్టికి తీసుకువచ్చారు.ఆయనపై చర్యలు తీసుకోవాలని కలమట పట్టుబట్టారు. పోలీసులకు ఫిర్యాదు చేయాలని కలెక్టర్ సూచించారు. మందస ఎంఎంఎస్‌లో ఎటువంటి వోచర్లు లేకుండా లక్షల రూపాయలు దుర్వినియోగం చేశారని, సక్రమంగా విచారణ జరగలేదని గ్రంథాలయ సంస్థ చైర్మన్ విఠల్, ఎమ్మెల్యే శివాజీలు ఆరోపించారు. ఆర్ఆర్ యాక్ట్ ఉపయోగించి అక్రమాలు చేసిన నిధులను రాబట్టాలని ఎమ్మెల్సీ ప్రతిభా భారతి కోరారు. మమ్మల్ని అనాగిరికులను చేయొద్దు అణగారిన గిరిజనులను ఇంకా అనాగిరికులను చేయవద్దని, మా అభివృద్ధిని అడ్డుకోవడానికి ఇక్కడ అధికారులుగా వచ్చారా అని ఎమ్మెల్యే కళావతి పీఏవో జగన్మోహన్పై ఆగ్రహించారు. ప్రోటోకాల్ ఉల్లంఘణపై నివేదిక ఇవ్వాలని కలెక్టర్ పీవోను కోరారు. పాలకొండ మండలం డోలమడ పంచాయితీలో రహదారి పూర్తి చేయకుండా బిల్లులు మార్చేశారని జెడ్పీటీసీ సభ్యుడు సామంతుల దామోదర్ ప్రశ్నించగా.. విచారణ జరుగుతోందని ఈఈ శ్రీనివాస్ తెలిపారు. ఇంకా ఎప్పుడు విచారణ పూర్తవుతుందని సభ్యులు ప్రశ్నించారు. ముగ్గురు ఎమ్మెల్యేలు, ఇద్దరు జెడ్పీటీసీ సభ్యులతో కమిటీ వేయాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. అంబావల్లి గ్రామంలో ఉపాధి పనులు ప్రారంభం కాకపోవడంతో గిరిజనులు ఖాళీగా ఉన్నారని ఎమ్మెల్యే కలమట సమావేశం దృష్టికి తెచ్చారు. ఇందిర జలప్రభ పథకం బోర్లకు విద్యుత్ కనెక్షన్ వేయలేదని జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు సవరతోట ముఖలింగం అన్నారు. ప్రోటోకాల్ ఎందుకు ఉల్లంఘిస్తున్నారు? ఐటీడీఏ అధికారులు ప్రోటోకాల్ ఉల్లంఘిస్తున్నారని ఎమ్మెల్యే కళావతి మండిపడ్డారు. ఇటీవల లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు సీతంపేటలో ప్రారంభిస్తే తమ పేరును చిన్నదిగా పెట్టారని, గొయిది పంచాయతీలో కార్యక్రమం జరిగితే ఆ సర్పంచ్‌కే చెప్పలేదని, ఇది న్యాయమా అని ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులతో ఎందుకు కో ఆర్డినేషన్ చేసుకోవడం లేదని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ప్రశ్నించారు. ప్రోటోకాల్ ఉల్లఘించిన అధికారులకు చార్జ్‌మెమో ఇస్తామని కలెక్టర్ సమాధానమిచ్చారు. లాడా, పాండ్ర గ్రామాలకు జీసీసీ ద్వారా రేషన్ అందడం లేదని, ఐదు వందల కుటుంబాలు 8 కిలో మీటర్ల దూరంలో ఉన్న వేరే గ్రామానికి వెళ్లి సరుకులు తెచ్చుకుంటున్నారని ఎమ్మెల్యే కళావతి సమావేశం దృష్టికి తీసుకు వచ్చారు. ఉపాధి, మరుగుదొడ్ల నిర్మాణ బిలులు రావడం లేని బూర్జ జెడ్మీటీసీ సభ్యుడు రామకృష్ణ అన్నారు. డీఈ సస్పెన్సన్:నీటి ఎద్దడి ప్రణాళికలు వేయమంటే నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించినందుకు సంబంధిత డీఈ మల్లికార్జున్‌ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఆదేశించారు. వేసవిలో నీటి ఎద్దడి దృష్ట్యా రూ.5.6 కోట్లు మంజూరు చేస్తే సీతంపేట మండలంలోని దారపాడు పంచాయతీకి కోటి రూపాయలతో ప్రతిపాదన ఎందుకు పెట్టారని ఎమ్మెల్యేలు వెంకటరమణ, కళావతిలు ప్రశ్నించారు. దీనికి సంబంధిత అధికారులు సరిగా సమాధానం చెప్పకపోవడంతో డీఈ సస్పెన్షన్‌కు కలెక్టర్ ఆదేశించారు. నీటి ఎద్దడి ప్రణాళికలు క్షేత్రస్థాయిలో తయారు చేయాలని ఎస్ఈ రవీంద్రనాథ్‌కు ఆదేశించారు. ఏనుగుల సమస్యను పరిష్కరించాలని, ఐదోషెడ్యూల్డ్ సాధనకు తీర్మానం చేయాలని ఎమ్మెల్యే కళావతి కోరారు. అందరి సభ్యుల ఆమోదించడంతో తీర్మానం చేశారు. ఇకపై ప్రతీ రెండు నెలలకు ఒకసారి పాలకవర్గ సమావేశం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే శివాజీ కోరారు. మూడు నెలలకొకసారి జరగాల్సిన సమావేశం ఆరునెలలకెందుకు పెట్టారని ప్రశ్నించారు. ఇకపై రెండు నెలలకు సమావేశం పెడతామని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ రామ్మోహన్నాయుడు, జెడ్పీ చైర్పర్సన్ ధనలక్ష్మి, ఇచ్ఛాపురం, నరసన్నపేట ఎమ్మెల్యేలు బెందాళం అశోక్, బగ్గు రమణమూర్తి, పలువురు ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు ఆర్డీవోలు గున్నయ్య, దయానిధి పాల్గొన్నారు. 20 శాఖల ఊసే లేదు! ఐటీడీఏ సమావేశంలో 20 శాఖల పనితీరుపై చర్చే జరగలేదు. ప్రతి సమావేశంలోనూ ఇదే పరిస్థితి. గత సమావేశం మూడు గంటల్లో ముగియగా, ఈసారి మరో గంట ఎక్కువ జరిగినా ఫలితం లేకపోయింది. కీలకశాఖలపై చర్చ జరగకపోవడంతో కొంతమంది ప్రజాప్రతినిధులు అసంతృప్తి చెందారు. ఎంపీ కొత్త పల్లి గీత సమావేశానికి గైర్హాజరయ్యారు. ఆమె గత సమావేశానికి కూడా రాకపోవడం గమనార్హం. గత సమావేశంలో ప్రస్తావనకు రాని శాఖలపైనే ఇప్పుడు చర్చించి, మిగతా శాఖలను వదిలేశారు. ముఖ్యమైన ఇంజినీరింగ్‌శాఖ, ఎస్ఎంఐ, గృహనిర్మాణశాఖ, ట్రైకార్, ఏపీఈపీడీసీఎల్, మహిళా, శిశుసంక్షేమశాఖ, అటవీశాఖ, పట్టుపరిశ్రమ, ఏపీఎస్ఐడీసీ, ప్రాథమిక విద్య, గిరిజన సంక్షేమ విద్య, మలేరియా, వైద్య ఆరోగ్యశాఖ, మత్స్య శాఖ వంటి శాఖల ప్రస్తావనకు రాకపోవడం గమనార్హం. నలుగురు ఎమ్మెల్సీలు హాజరు కావాల్సి ఉండగా.. ప్రతిభాభారతి మాత్రమే పాల్గొన్నారు.భారీ బందోబస్తు: పాలకవర్గ సమావేశం సందర్భంగా గట్టి పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. డీఎస్సీప సీహెచ్ ఆదినారాయణ, సీఐ అశోక్‌కుమార్, ఎసై్స వి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. -
అక్కడ ఖాళీ.. అందుకే.. ఇక్కడ మోళీ
తెలుగుదేశం నేతల గోబెల్స్ ప్రచారంపై వైఎస్సార్సీపీ నాయకుల ఆగ్రహం టీఆర్ఎస్ దెబ్బకు దిమ్మతిరిగే.. ఈ కుతంత్రమంటూ మండిపాటు తమ ఎమ్మెల్యేలు పార్టీ మారతారంటున్న తప్పుడు కథనాలకు ఖండన కొన్ని జిల్లాల్లో విపక్ష ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరుతున్నారంటూ తెలుగుదేశం నేతలు, ఆ పార్టీ అనుకూల మీడియా చేస్తున్న ప్రచారాన్ని జిల్లాకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఖండించారు. తెలంగాణలో టీడీపీ ఖాళీ అవుతోందని, దాని నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ గోబెల్స్ ప్రచారానికి టీడీపీ నేతలు ఒడిగడుతున్నారని వారు మండిపడ్డారు. సాక్షి ప్రతినిధి, కాకినాడ :హైదరాబాద్ నగరపాలక సంస్థ ఎన్నికల్లో తల బొప్పి కట్టడం.. తెలంగాణలో తమ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్కు క్యూ కడుతూండడంతో దిమ్మ తిరిగిన తెలుగుదేశం పార్టీ.. ప్రజల దృష్టిని మళ్లించేందుకు.. ఆంధ్రాలో తమ ఎమ్మెల్యేలపై అసత్య ప్రచారానికి ఒడిగడుతోందని.. వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. కొన్ని జిల్లాల్లో తమ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతున్నారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన అనుకూల మీడియా ద్వారా దుష్ప్రచారానికి పాల్పడుతూ.. మైండ్ గేమ్ ఆడే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో టీడీపీ నాయకులు టీఆర్ఎస్లోకి వలస పోతూంటే ఆపలేకపోతున్న ఆ పార్టీ నేతలు.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం విపక్ష ఎమ్మెల్యేలు కొందరు ‘దేశం’లో చేరుతున్నారంటూ చేస్తున్న దుష్ర్పచారాన్ని.. జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ నాయకులంతా ముక్తకంఠంతో ఖండించారు. కష్టమైనా, నష్టమైనా వైఎస్సార్సీపీలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడూ తమ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటే ఉంటారని, అధికార పార్టీ దమననీతిని ప్రయోగిస్తే ఎదుర్కొంటారే తప్ప వెన్ను చూపబోరని స్పష్టం చేశారు. ప్రజల దృష్టి మళ్లించేందుకే దుష్ర్పచారం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో వైఫల్యం, తెలంగాణలో ఎదురైన ఘోర పరాభవంతో టీడీపీ దిక్కుతోచని స్థితిలో ఉంది. ప్రజల దృష్టిని మళ్లించేందుకు పలువురు ఎమ్మెల్యేలు వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలో చేరతారంటూ అధికార పార్టీ నాయకులు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష వైఎస్సార్సీపీని ఎదుర్కొనే ధైర్యం లేకే ఈ మైండ్‌గేమ్‌ను టీడీపీ మొదలెట్టింది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని వైఎస్సార్సీపీ శాసనసభ్యులపై దుష్ర్పచారం చేస్తున్నారు. మా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో నిత్యం ప్రజా సమస్యలపై నిబద్ధతతో పోరాడుతున్న మా పార్టీకి ప్రజల్లో ఆదరణ మరింత పెరుగుతోంది. ఇప్పటికైనా టీడీపీ నాయకులు పద్ధతి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవు. - జ్యోతుల నెహ్రూ, వైఎస్సార్సీపీ శాసనసభాపక్ష ఉపనేత, జగ్గంపేట ఎమ్మెల్యే అక్కడి వలసలు ఆపలేకే ఇక్కడ దుష్ర్పచారం తెలంగాణలో ఇప్పటికే 10 మంది టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరారు. మిగిలిన ఐదుగురూ కూడా అదే పార్టీవైపు చూడడంతో దిమ్మతిరిగిన చంద్రబాబు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలపై పథకం ప్రకారం తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తెలంగాణలో వలసలకు అడ్డుకట్ట వేయలేకపోయినా.. ఏపీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరుతున్నారంటూ తనకు అనుకూల పత్రికల ద్వారా మైండ్‌గేమ్ ఆడుతున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు కాకుండా టీడీపీ ఇన్‌చార్జ్‌లకు నిధులిస్తూ రాజ్యాంగ విరుద్ధంగా పాలన సాగిస్తున్నారు. ఒకప్పుడు మాల, మాదిగలను, ప్రస్తుతం బీసీలు, కాపులను విభజించి పాలిస్తూ పబ్బం గడుపుకునేందుకు ప్రయత్నిస్తున్న టీడీపీకి నూకలు చెల్లే రోజులు దగ్గర పడుతున్నాయి. మా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంపై మాకందరికీ సంపూర్ణ విశ్వాసం ఉంది. - చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే, కొత్తపేట ఒక్క కార్యకర్త కూడా టీడీపీలో చేరరు మా వైఎస్సార్సీపీ నుంచి ఒక్క కార్యకర్త కూడా తెలుగుదేశం పార్టీలో చేరరు. తెలంగాణలో మాదిరిగా ఇక్కడ కూడా టీడీపీ అడ్రస్ గల్లంతవుతుందనే భయంతోనే టీడీపీ నాయకులు అసత్య ప్రచారాలకు తెర లేపారు. ఇది సిగ్గుచేటు. వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎల్లప్పుడూ పార్టీకి బద్ధులై పని చేస్తారు. పార్టీ వెంటే క్రమశిక్షణతో ఉంటారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలను ఏ ఒక్కరూ నమ్మే స్థితిలో లేరు. - వంతల రాజేశ్వరి, ఎమ్మెల్యే, రంపచోడవరం అది టీడీపీ మైండ్‌గేమ్ తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులు టీఆర్ఎస్లోకి ప్రవాహంలా వెళ్లిపోతూండటంతో చంద్రబాబు అండ్ కో నేతలకు మతి భ్రమించింది. టీడీపీ కోసం పని చేస్తున్న ‘ఎల్లో’ మీడియా సహాయంతో ప్రజలను తప్పుదారి పట్టించేందుకు మైండ్‌గేమ్ ఆడుతున్నారు. నేను ఎప్పటికీ వైఎస్సార్ కాంగ్రెస్‌లోనే కొనసాగుతా. జగనన్నకు విశ్వాసపాత్రుడుగా ఉంటా. టీడీపీలో ఎవరైనా చేరడమంటే అరాచకాలకు మద్దతు ఇవ్వడమే. భవిష్యత్ వైఎస్సార్సీపీదే. తుని నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తా. - దాడిశెట్టి రాజా, ఎమ్మెల్యే, తుని -
ఇద్దరు ఎమ్మెల్యేలకు గాయాలు
సచివాలయం ముందు రాస్తారోకో యత్నం బ్యారికేడ్లతో అడ్డుకున్న పోలీసులు చెన్నై, సాక్షి ప్రతినిధి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ విపక్ష ఎమ్మెల్యేలు విజృంభించారు. సాధారణ కార్యకర్తల వలే రాస్తారోకో యత్నం చేశారు. ఎమ్మెల్యేలు, పోలీసుల తోపులాటతో సచివాలయ ప్రాంగణం రణరంగాన్ని తలపించింది. ఈ సంఘటనల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు తీవ్రంగా గాయపడ్డారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బుధవారం తాగునీటి వసతులపై మంత్రి వేలుమణి ప్రసంగించి కూర్చున్నారు. వెంటనే వామపక్షాల ఎమ్మెల్యేలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముద్రించిన కరపత్రాలను వెదజల్లారు. అన్నదాతలకు అందజేస్తున్న సబ్సిడీలపై కేంద్రం కోత విధిస్తోందనే ఆరోపణలతో కూడిన కరపత్రాలు చిందరవందరగా పడటంతో గందరగోళం నెలకొంది. మాట్లేందుకు అవకాశం ఇవ్వడంలేదని స్పీకర్‌పై విపక్షాలు విరుచుకుపడ్డాయి. సుమారు అరగంటపాటు అసెంబ్లీ సమావేశ హాలు కేకలు, అరుపులతో దద్దరిల్లింది. వామపక్షాలకు వాదనకు కాంగ్రెస్, మనిదనేయ మక్కల్ కట్చి, పుదయ తమిళగం, పీఎంకే తదితర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు సమావేశం నుంచి వాకౌట్ చేసి బయటకు వచ్చాయి. ఆ తరువాత అకస్మాత్తుగా సచివాలయం వెలుపలకు పరుగెత్తుతూ రాస్తారోకో చేసేందుకు పూనుకున్నాయి. అయితే అసెంబ్లీ సమావేశాల బందోబస్తులో ఉన్న పోలీసులు ఎమ్మెల్యేలను అడ్డుకున్నారు. ట్రాఫిక్ కోసం వినియోగించే బ్యారికేడ్లు, తాళ్లు, కమ్ములతో కూడిన వైర్లను ప్రయోగించి ఎమ్మెల్యేలకు ఎదురునిలిచారు. అయినా పోలీసులను తోసుకుని రోడ్డుపైకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో తీవ్రస్తాయిలో తోపులాట చోటుచేసుకుంది. ఎమ్మెల్యేలమని కూడా చూడకుండా పోలీసులు వ్యవహరించారంటే సచివాలయం ప్రధాన గేటు ముందు బైఠాయించారు. ఒక దశలో ఎమ్మెల్యేలు, పోలీసులకు మద్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం చోటుచేసుకుంది. బ్యారికేడ్లేను దాటి రోడ్డుపై వెళుతున్న ఎమ్మెల్యేలను బంధించేలా ఘనమైన ఇనుప వైరును మరోవైపు పోలీసులు విసిరివేశారు. ఈ సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయధరణి, సీపీఐ ఎమ్మెల్యే అన్నాదురై తలపై వైరు పడటంతో తీవ్రగాయలైనాయి. దీంతో విపక్ష ఎమ్మెల్యేలు మరింతగా రెచ్చిపోయి ఘర్షణకు దిగారు. బుధవారం నాటి అసెంబ్లీ సమావేశాలు ముగిసేవరకు విపక్షాల ఆందోళన సాగుతూనే ఉంది. గాయాలపై ఇద్దరు ఎమ్మెల్యేలు ఆసుపత్రిలో చేరారు. -
విపక్ష సభ్యుల చెంతకు మంత్రులు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో శనివారం పలువురు మంత్రులు విపక్ష సభ్యుల వద్దకు వెళ్లి వారికి వివిధ అంశాలపై స్పష్టతనివ్వడం కనిపించింది. రాష్ట్రాలకు కేంద్రం పన్నుల వాటాను పెంచిందని బీజేపీ నేత లక్ష్మణ్ బడ్జెట్‌పై చర్చ సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై, ఆయన మాట్లాడిన అనంతరం మంత్రి కేటీఆర్ ఆయన వద్దకు వెళ్లి కొద్దిసేపు ముచ్చటించారు. కేంద్రం వాటాలను పెంచి మిగిలిన కీలక పథకాలకు ఎలా కోతలు పెట్టిందో వివరించారు. ఇక పారిశ్రామిక రంగంపై మంత్రి జూపల్లి కృష్ణారావు గత ప్రభుత్వంపై చేసిన విమర్శల కు తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని కాం గ్రెస్ ఎమ్మెల్యే జె.గీత కోరినా డిప్యూటీ స్పీకర్ పద్మాదేవెందర్‌రెడ్డి పట్టించుకోలేదు. కొద్దిసేపటి తర్వాత జూపల్లి స్వయంగా గీత వద్దకు వెళ్లి ఆమెతో మాట్లాడారు. ఇక టీ విరామం అనంతరం మరో మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ప్రతిపక్షనేత జానారెడ్డి పక్కన కూర్చొని చాలాసేపు ముచ్చటిస్తూ కనిపించారు. -
'చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారు?'
రాజమండ్రి: ప్రతిపక్ష ఎమ్మెల్యేలను చూసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు భయపడుతున్నారని వైఎస్ఆర్ సీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రు ప్రశ్నించారు. సీఎం వ్యవహార తీరుపై ఆయన మండిపడ్డారు. పుష్కరాలపై సమీక్ష నిర్వహిస్తున్న చంద్రబాబు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను పిలవకపోవడం సిగ్గుచేటని నెహ్రు అన్నారు.