అణు ప్లాంట్లను వ్యతిరేకించాలి
అణు ప్లాంట్లను వ్యతిరేకించాలి
Published Wed, Aug 10 2016 1:23 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
నెల్లూరు(అర్బన్):
సమాజానికి పొంచి ఉన్న ముప్పును అరికట్టాలంటే ప్రమాదకరమైన అణు ప్లాంట్లను ప్రజలు వ్యతిరేకించాలని ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం విజ్ఞప్తి చేశారు. జనవిజ్ఞానవేదిక నగర కమిటీ ఆధ్వర్యంలో స్థానిక బాలాజీనగర్‌లోని ఆదిత్య డిగ్రీ కళాశాలలో మంగళవారం హిరోషిమా.. నాగసాకి డే కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అణుధార్మిక విస్పోటనం వల్ల కలిగే నష్టాలను వివరించారు. జనవిజ్ఞానవేదిక ఆరోగ్య సబ్‌కమిటీ జిల్లా కన్వీనర్ డాక్టర్ శ్రీనునాయక్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అణుధార్మికత వల్ల కలిగే నష్టాలను వివరించారు. కార్యక్రమంలో ఆ వేదిక నగర అధ్యక్ష, కార్యదర్శులు విద్యాచరణ్, మాదాల రాము, కోశాధికారి మోహన్‌రెడ్డి, నాయకులు విజయకుమార్, విజయ, ఆదిత్య కళాశాల కరస్పాండెంట్ ఆచార్య ఆదిత్య పాల్గొన్నారు.
Advertisement
Advertisement