––గుజరాత్, పశ్చిమబెంగాల్, ఒరిస్సా రాష్ట్రాల్లో తక్కువ ధరకు కొనుగోలు
––ఇక్కడి ధరలు తగ్గిపోయే ప్రమాదముందని రైతులు ఆందోళన
భీమవరం:
ఆక్వా హబ్‌గా అభివృద్ది చెందుతున్న జిల్లాలోని రొయ్యల రైతుల గుండెల్లో ఇతర రాష్ట్రాల రొయ్యలు ఆందోళనలు కలిగిస్తున్నాయి. భీమవరం, నెల్లూరు ప్రాంతాల వ్యాపారులు ఇటీవల కాలంలో గుజరాత్, పశ్చిమబెంగాల్, ఒరిస్సా తదితర రాష్ట్రాల్లో రొయ్యల కొనుగోలు ప్రారంభించడంతో ఇక్కడి రొయ్యలకు ధరలు తగ్గిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రొయ్యల్లో యాంటిబయోటిక్స్ అవశేషాలు గుర్తిస్తే కొనుగోలు నిలిపివేస్తామంటూ ఎగుమతిదారులు ఇటీవల ప్రకటించడంతో రొయ్యల రైతులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడిన తరుణంలో ఇతర రాష్ట్రాల నుంచి రొయ్యల దిగుమతులు గోరుచుట్టుపై రోకలిపోటులా పరిణమించాయంటున్నారు. యాంటిబయోటిక్స్ అవశేషాలు రొయ్యల పిల్లల హేచరీలు, రొయ్యల మేతల నుంచి వచ్చే అవకాశం ఉన్నా కేవలం రైతులను బాధ్యులను చేస్తూ కొనుగోలు నిలిపివేస్తామంటూ ప్రకటనలో గుప్పించడం వెనుక కొనుగోలుదారులు ధరలు తగ్గించే హ్యుహం ఉందనే ఆరోపణలు విన్పించాయి. జిల్లాలో సుమారు 50 వేల ఎకరాల్లో రొయ్యలు, దాదాపు లక్షన్నర ఎకరాల్లో చేపలను సాగుచేస్తున్నారని అంచనా. భీమవరం పరిసర ప్రాంతాల్లోనే దాదాపు 21 రొయ్యలను శుద్దిచేసే ప్రొసెసింగ్ యూనిట్లు ఉన్నాయి. రొయ్యల సాగుపై ప్రత్యక్షంగా, పరొక్షంగా వేలాదిమంది ఆధారపడి జీవిస్తున్నారు. రాష్ట్రంలో సుమారు ఏడు జిల్లాల్లో రొయ్యల సాగుచేస్తున్నా దాదాపు 70 శాతం ఎగుమతులు భీమవరం ప్రాంతం నుంచే కావడం విశేషం. రొయ్యల ఎగుమతులు ద్వారా 2014లో రాష్ట్రానికి సుమారు 8,732 కోట్లు ఆదాయం వచ్చిందంటే రొయ్యలకు ఎంతటి ప్రాధాన్యత ఉందో అవగతమవుతోంది.
– గుజరాత్,పశ్చిమబెంగాల్, ఒరిస్సా రాష్ట్రాల్లో కొనుగోలు.....
మన రాష్ట్రం నుంచి రొయ్యలు ఎక్కువగా యుఎస్‌ఏ, చైనా, థాయిలాండ్, ఇండోనేషియా, జపాన్, ఆస్ట్రేలియా వంటి దేశాలకు ప్రధానంగా భీమవరం ప్రాంతం నుంచి ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయి. ముందుగా జిల్లాలోని సముద్రతీర ప్రాంతంలో వరిసాగుకు ఉపయోగపడని భూముల్లో మాత్రమే టైగర్ రొయ్యల సాగు ప్రారంభమైంది. అయితే దీనిలో రైతులు నష్టాలను చవిచూడడంతో టైగర్ రొయ్యలసాగుకు రైతులు స్వస్తి చెప్పి స్కాంపి రొయ్యల పెంపకం చేపట్టారు. అయితే స్కాంపి రొయ్యలు సరిౖయెన ఫలితాలు ఇవ్వలేదు. వెనువెంటనే వనామి రొయ్యల పెంపకం చేపట్టారు. వనామి పెంపకం ద్వారా రొయ్యల రైతులు మంచిఫలితాలు పొందడంతో రొయ్యల చెరువుల విస్తీర్ణం ఘననీయంగా పెరిగింది. సన్న,చిన్నకారు రైతులు సైతం రొయ్యల సాగు పట్ల ఆసక్తి చూపిస్తున్న తరుణంలో ఇటీవల ప్రతికూల వాతావరణంతో అనేక మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇదే సందర్భంలో యాంటిబయోటిక్స్ వాడకం అంటూ వ్యాపారులు రైతులను బెదిరించడం ప్రారంభించారు. దీనికితోడు గుజరాత్,పశ్చిమబెంగాల్, ఒరిస్సా తదితర‡ రాష్ట్రాల నుంచి రొయ్యల కొనుగోలు చేస్తున్నారు.
––రొయ్యల ధరలు తగ్గించడానికి ఎగుమతిదారులకు అవకాశం...
రొయ్యల్లో యాంటిబయోటిక్స్ అవశేషాలు, ఇతరరాష్ట్రాల నుంచి దిగుమతులు కారణంగా రొయ్యల ధరలు తగ్గించడానికి రొయ్యల ఎగుమతిదారులకు మంచి అవకాశమని రైతులు వాపోతున్నారు. 2000 సంవత్సరంలో యాంటిబయోటిక్స్ అవశేషాలంటూ ధరలు ఘననీయంగా తగ్గించి రైతులను నష్టాల పాలుచేశారని, ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి ఇబ్బడిముబ్బడిగా రొయ్యలు వస్తున్నాయంటూ ధరలు తగ్గించేందుకు అవకాశం ఉందని చెబుతున్నారు.
–అక్కడ ప్రొసెసింగ్ యూనిట్లు లేకపోవడమే కారణం.....
ఒరిస్సా, గుజరాత్, ప శ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాల్లో రొయ్యల సాగు చేస్తున్నా అక్కడ రొయ్యల మేతలు తయారుచేసే కంపెనీలు, ప్రొసెసింగ్ యూనిట్లు లేవు. గతంలో అక్కడ రొయ్యల సాగు తక్కువగా ఉండడంతో తెలుగురాష్ట్రాల నుంచే రొయ్యల మేతలు, మందులు దిగుమతి చేసుకునేవారు. అక్కడ ఉత్పత్తి చేసిన రొయ్యలను ప్రధానంగా భీమవరం,నెల్లూరు ప్రాంతంల్లోని వ్యాపారులు కొనుగోలు చేసేవారు. అయితే ఇటీవల కాలంలో ఇతర రాష్ట్రాల్లోను రొయ్యల సాగు విస్తీర్ణం విఫరీతంగా పెరిగింది. రొయ్యలను నిల్వచేయడానికి అవసరమైన ప్రొసెసింగ్ యూనిట్లు లేకపోవడంతో రొయ్యల పట్టుబడి పట్టిన వెంటనే తక్కువ ధరకైనా అమ్మకాలు చేసేవారు. దీనితో భీమవరం ప్రాంతంలోని వ్యాపారులు, ఏజెంట్లు కిలోకు రూ. 100 తక్కువ ధరకు కొనుగోలు చేసి భీమవరం నుంచి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. ఇటీవల కాలంలో ఇతర రాష్ట్రాల నుంచి రొయ్యలు ఇబ్బడి ముబ్బడిగా రావడంతో వ్యాపారులు, ఏజెంట్లు తక్కువ ధరకు లభించే ఇతర రాష్ట్రాల రొయ్యలను కొనుగోలు చేయడానికి ఆశక్తి చూపిస్తున్నట్లు చెబుతున్నారు. ఇదే పద్దతి కొనసాగితే ఇక్కడి రొయ్యల ధర ఘననీయంగా తగ్గిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
–కంటెయినర్స్‌లో రొయ్యల తరలింపు....
భీమవరం ప్రాంతంలోని రొయ్యల వ్యాపారులు ఒరిస్సా, గుజరాత్, ప శ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాల్లో కొనుగోలు చేసిన రొయ్యలను కంటెయినర్స్‌లో భీమవరం తీసుకువస్తున్నారు. ఒక్కొక్క కంటెయినర్‌లో సుమారు మూడువేల టన్నుల రొయ్యలను రవాణ చేయడం వల్ల రవాణ ఖర్చులు అంతంతమాత్రంగానే ఉండడంతో అక్కడ తక్కువ ధరకు దొరికే రొయ్యలను కొనుగోలు చేయడానికి ఇక్కడి వ్యాపారులు మక్కువ చూపుతున్నారని చెబుతున్నారు.
–ధరలు తగ్గిపోయే ప్రమాదం ఉంది....
ఫొటోఫైల్:30బీవీఆర్‌ఎమ్28–30080012: పి.ఏసు, రొయ్యరైతు, దెయ్యాల తిప్ప
ఇప్పటికే ప్రతికూల వాతావరణంతో ఇక్కడి రొయ్యల ధరలను తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో ఇతర రాష్ట్రాల నుంచి రొయ్యలు దిగుమతి అయితే మేము పండించే రొయ్యలకు గిరాకీ తగ్గి మరింత ధర తగ్గిపోయే ప్రమాదం ఉంది.
–ఇప్పటికే యాంటిబయోటిక్స్‌తో ఇబ్బందులు....
ఫొటోఫైల్:30బీవీఆర్‌ఎమ్29–30080012: ఎన్.సత్యనారాయణ, నాగిడిపాలెం
రొయ్యల్లో యాంటì బయోటిక్స్ ఉంటే «కొనుగోలు చేయమంటూ వ్యాపారులు అల్టిమేట్టం ఇచ్చిన తరుణంలో ఇతరరాష్ట్రాల నుంచి రొయ్యల దిగుమతి ఇక్కడి రైతులకు గోరుచుట్టుపై రోకలిపోటులా పరిణమించనుంది. గతంలో యాంటి» యోటిక్స్ కార ణంగా ఇతర దేశాలు రొయ్యలు కొనుగోలు చేయడం లేదని ధరలు తగ్గించి వేశారు. ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి రొయ్యలు దిగుమతి అయితే ఉల్లిపాయలు, టమాట రైతుల పరిస్థితి రొయ్యల రైతులకు దాపురిస్తుంది.