other states
-
తెలంగాణలో ఇతర రాష్ట్రాల బీజేపీ ఎమ్మెల్యేల పర్యటన..
తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ప్రత్యర్థులకు అందని విధంగా తమదైన రీతిలో ప్రజల వద్దకు వెళ్లడానికి నాయకులు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ పార్టీ అధికార పీఠమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. నియోజక వర్గాల స్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో అధికార పార్టీకి ధీటుగా బదులు చెప్పగల సరైన ప్రత్యామ్నయం తామే అని చెప్పుతున్న బీజేపీ.. ఈ సారి ఇతర రాష్ట్రాల బీజేపీ ఎమ్మెల్యేలను రంగంలోకి దించనుంది. ఇతర రాష్ట్రాల బీజేపీ ఎమ్మెల్యేలు తెలంగాణలో పర్యటించనున్నట్లు సమాచారం. ఈ నెల 20వ తేదీ నుంచి పర్యటనలను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో 119 నియోజక వర్గాలకు 119 మంది ఎమ్మెల్యేలు ఈ మేరకు పర్యటన చేయనున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఎమ్మెల్యేలు వారం రోజుల పాటు పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ఒక్కో ఎమ్మెల్యే తమకు కేటాయించిన నియోజక వర్గంలో వారం రోజుల పాటు పర్యటించి, స్థానిక నాయకులను కలవనున్నారు. బూత్ స్థాయిలో పార్టీ పరిస్థితి, స్థానిక అంశాలపై రిపోర్టును తీసుకుని అధిష్ఠానానికి సమర్పించనున్నారని సమాచారం. ఇదీ చదవండి: మోదీని కలవనున్న బండి సంజయ్.. ఏ రాష్ట్రం ఇస్తారో? -
ఢిల్లీని నడుపుతోంది కేంద్రమే..ఇతర రాష్ట్రాల్లో కూడా..
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జాతీయ రాజధానిలో సేవల నియంత్రణపై ఆర్డినెన్స్ విషయమై కేంద్రంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఢిల్లీపై కేంద్ర తొలి దాడి జరిగింది, ఆ తర్వాత ఇతర రాష్ట్రాలకు ఇలాంటి ఆర్డినెన్స్‌లే వస్తాయని కేజ్రీవాల్ హెచ్చరించారు. ఈ మేరకు ఆయన రాంలీలా మైదానంలో జరిగిన ఆమ్ఆద్మీ పార్టీ మహా ర్యాలీలో పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కేంద్రంపై ఈ విధంగా వ్యాఖ్యానించారు. కేంద్రం ఆర్డినెన్స్‌తో నగర ప్రజలను అమానిస్తోందన్నారు. ఢిల్లీలో ప్రజాస్వామ్యం ఉందని ఆ ఆర్డినెన్స్ చెబుతోందంటూ ఆరోపణలు చేశారు. ఢిల్లీలో నియంతృత్వ పాలన కొనసాగుతోందన్నారు. సాక్షాత్తు లెఫ్టినెంట్ గవర్నరే ప్రజలు ఎవరికీ కావాలంటే వారికి ఓటు వేయవచ్చు, కానీ ఢిల్లీని కేంద్రమే నడుపుతుందని చెబుతున్నారని కేజ్రీవాల్ మండిపడ్డారు. దీన్ని వ్యతిరేకిస్తూ..దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నా..ఢిల్లీ ప్రజలు ఒంటరిగా లేరని వారికి భరోసా ఇవ్వాలనుకుంటున్నా అని చెప్పారు. భారతదేశంలో 140 కోట్ల మంది ప్రజలు తమ వెంట ఉన్నారని ఆయన ధీమాగా చెప్పారు. ఈ సందర్భంగా ఆప్ నేత మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్ల అరెస్టుల గురించి మాట్లాడుతూ..దేశ రాజధానిలో పనులు నిలిపివేయడానికే వారిని అరెస్టు చేశారన్నారు. అయినప్పటికీ తమ వద్ద వందమంది సిసోడియాలు, జైనులు ఉన్నారని, వారు తమ పనిని కొనసాగిస్తారని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. కాగా, ఈ కార్యక్రమానికి రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ కూడా హాజరయ్యారు. (చదవండి: అందుకే అతడిని పార్టీకి అధ్యక్షుడిగా ఎంపిక చేయలేదు) -
కర్ణాటకలో ‘చక్రం’ తిప్పాలని తెలంగాణ ఆర్టీసీ పక్కా ప్లాన్!
సాక్షి, హైదరాబాద్: పొరుగురాష్ట్రాల్లోనూ చక్రం తిప్పాలని టీఎస్ ఆర్టీసీ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్టీసీ అధికారులతో చర్చలు జరిపిన టీఎస్ ఆర్టీసీ తాజాగా కర్ణాటకకు కూడా బస్సుల సంఖ్యను భారీగా పెంచాలని నిర్ణయించింది. ఇటీవలే కర్ణాటక ఆర్టీసీ అధికారులతో బెంగళూరులో చర్చలు జరిపిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా కర్ణాటక పరిధిలో మరో 30 వేల కిలోమీటర్ల మేర నిత్యం అదనంగా బస్సులు తిరిగేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఇందుకు అదనంగా వంద బస్సులు అవసరమవు తాయని తేల్చారు. దీనివల్ల రోజువారీ ఆదాయంలో రూ.25 లక్షల వరకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. కర్ణాటకలోని బెంగుళూరు, మైసూరు, బెల్గాం, బీజాపూర్, యాద్గీర్, బీదర్, రాయచూర్ లాంటి ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులకు మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం టీఎస్ ఆర్టీసీ 500 బస్సులను కర్ణాటకలోని వివిధ ప్రాంతాలకు తిప్పుతోంది. వీటి ఆక్యుపెన్సీ రేషియో కూడా ఎక్కువ గానే ఉంది. కర్ణాటకలోని మూడు ఆర్టీసీలు కూడా హైదరాబాద్‌తోపాటు వివిధ ప్రాంతాలకు బస్సులను నడుపుతున్నాయి. వాటికి కూడా ఆదరణ బాగా ఉంది. ఈ నేపథ్యంలో బస్సుల సంఖ్య పెంచుకోవాలని పరస్పరం నిర్ణయించుకున్నాయి. 2008లో రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు ఒప్పందం కుదిరింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత టీఎస్ ఆర్టీసీతో విడిగా ఒప్పందం చేసుకోలేదు. దీంతో ఇటీవలే కర్ణాటక అధికారులు ఈ అంశాన్ని ప్రస్తావించారు. బస్సుల సంఖ్య పెంచుకునేందుకు ప్రతిపాదించారు. ఈ మేరకు ఇటీవల ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆధ్వర్యంలో అధికారులు, బెంగళూరు వెళ్లి ఉన్నతాధికారులతో చర్చించారు. స్లీపర్ బస్సుల కేటాయింపు ఆర్టీసీ కొత్తగా 16 ఏసీ స్లీపర్ బస్సులు కొంటోంది. మరో 108 నాన్ ఏసీ స్లీపర్ బస్సులను అద్దె ప్రాతిపదికన ప్రైవేటు వ్యక్తుల నుంచి తీసుకుంటోంది. వీటిలో కొన్నింటిని కర్ణాటకకు అదనంగా తిప్పే సర్వీసులకు కేటాయించాలని నిర్ణయించింది. ముఖ్యంగా బెంగళూరు, మైసూరు, రాయచూర్ లాంటి ప్రాంతాలకు వాటిని తిప్పాలని భావిస్తోంది. దూరప్రాంతాలు కావటంతో జనం స్లీపర్ బస్సుల్లో వెళ్లేందుకే మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం ఆర్టీసీ వద్ద స్లీపర్ బస్సుల్లేక చాలామంది ప్రైవేటు బస్సుల్లో వెళ్తున్నారు. దీంతో ఆర్టీసీ భారీగా ఆదాయం కోల్పోతోంది. ఇప్పుడు కొత్తగా పెట్టే స్లీపర్ బస్సులతో ఆ ప్రయాణికులను తనవైపు తిప్పుకోవాలని భావిస్తోంది. -
AP: జీతాలు, పింఛన్లకు మనకే ఖర్చెక్కువ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ కన్నా రాబడి బాగా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు సైతం.. తమ ఉద్యోగుల జీతభత్యాలపై ఇక్కడికన్నా తక్కువే వెచ్చిస్తున్నాయి. భౌగోళికంగా ఏపీ కన్నా పెద్ద రాష్ట్రాల్లోనూ జీతభత్యాల వ్యయం ఇక్కడికన్నా తక్కువే ఉంది. సాక్షాత్తూ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నెలవారీ గణాంకాలు దీన్ని వెల్లడించాయి. 2021–2022 తొలి ఏడు నెలల గణాంకాలను (ఏప్రిల్ నుంచి అక్టోబరు వరకు) విడుదల చేస్తూ... ఈ ఏడు నెలల్లో జీతాలు, పెన్షన్ల వ్యయం దాదాపు రూ.36వేల కోట్లకు పైగా అయిందని, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్, బిహార్ వంటి పెద్ద రాష్ట్రాల్లో కానీ... గుజరాత్, తెలంగాణ వంటి ఆదాయం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో కానీ ఈ స్థాయి వ్యయాలు కాలేదంటూ గణాంకాలను బయటపెట్టింది. ఇక్కడ గమనించాల్సిందేమిటంటే ఒక పక్క కరోనాతో రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. గడిచిన రెండేళ్లలో దాదాపు 22వేల కోట్ల ఆదాయం తగ్గిపోగా... కోవిడ్ సమయంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ప్రజల ఆరోగ్య రక్షణపై రూ.8వేల కోట్లు అదనంగా వెచ్చించాల్సి వచ్చింది. ఇలా రూ.30వేల కోట్లను కోవిడ్ మహమ్మారి మింగేసినప్పటికీ... ప్రభుత్వం క్రమం తప్పకుండా ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లను చెల్లిస్తూ వస్తోంది. గుజరాత్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, తెలంగాణ రాష్ట్రాలతో పోల్చి చూస్తే ఆంధ్రప్రదేశ్‌లో 2021–22 ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు వేతనాలు, పెన్షన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.36,006.11 కోట్లు వెచ్చించింది. ఇందులో వేతనాల రూపంలో 24,681.47 కోట్లు ఖర్చు చేయగా పెన్షన్ల కింద రూ.11,324.64 కోట్లు వెచ్చించింది. ఇటీవల 11వ వేతన సవరణ కమిషన్ నివేదికపై సీఎస్ నేతృత్వంలోని అధికారుల కమిటీ కూడా రాష్ట్రంలో వేతనాల వ్యయం చాలా ఎక్కువగా ఉందని తన నివేదికలో పేర్కొన్న విషయం తెలిసిందే. అంతే కాకుండా ఆ కమిటీ రాష్ట్ర సొంత ఆదాయం కన్నా వేతనాలు వ్యయం ఎక్కువగా ఉందని, ఈ నేపథ్యంలో ప్రతీ ఐదేళ్లకోసారి వేతన సవరణను రాష్ట్రం భరించలేదని కూడా కీలకమైన వ్యాఖ్య చేసింది. అందుకు తగినట్లుగానే ఈ ఆర్ధిక ఏడాది వేతనాల వ్యయంపై కాగ్ గణాంకాలు కూడా ఉండటం గమనార్హం. ప్రతీ నెల రాష్ట్ర ప్రభుత్వం వేతనాల రూపంలో రూ.3500 కోట్లకు పైగా చెల్లిస్తోంది. పెన్షన్ల రూపంలో మరో 1500 కోట్లకు పైగా ప్రతీ నెల చెల్లిస్తోంది. రాష్ట్రంలో ప్రతీ ఏటా వేతనాలు, పెన్షన్ల వ్యయం పెరుగుతూనే ఉంది. -
AP: అదుపులోనే అప్పులు.. ఇతర రాష్ట్రాలతో పోల్చితే..
సాక్షి, అమరావతి: దేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే అప్పులు చేస్తున్నట్లు ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా ఊదరగొడుతున్న ప్రచారంలో ఎంత వాస్తవం ఉందో తేటతెల్లమైంది. కోవిడ్ సంక్షోభం నేపథ్యంలో కేంద్ర, రాష్ట్రాల ఆదాయాలు గణనీయంగా తగ్గిపోయాయి. మరో పక్క కోవిడ్ నియంత్రణ, నివారణ వ్యయం పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో కేంద్రంతో పాటు అన్ని రాష్ట్రాలు అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. చదవండి: మీ ఆనందమే నా తపన: సీఎం జగన్ ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు అదనపు అప్పులకు అనుమతిచ్చింది. అయినప్పటికీ గత ఆర్థిక ఏడాది అంటే 2020–21లో ఆంధ్రప్రదేశ్ మిగతా రాష్ట్రాల కన్నా పరిమితికి లోబడే అప్పులు చేసింది. ఈ విషయం కంప్ట్రోలర్ అండ్ అడిటర్ జనరల్ (కాగ్) ప్రాథమిక అకౌంట్ల పరిశీలనలో వెల్లడైంది. తమిళనాడు గత ఆర్థిక ఏడాది బడ్జెట్ అంచనాలకు మించి ఏకంగా 55.54 శాతం మేర అప్పు చేసింది. బిహార్ 47.69 శాతం, కర్ణాటక 40.12 శాతం, తెలంగాణ 37.50 శాతం, పంజాబ్ 24.22 శాతం బడ్జెట్ అంచనాకు మించి అప్పు చేసింది. అయితే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అంచనాకు మించి కేవలం 14.23 శాతమే అప్పు చేసింది. ఆదాయం తగ్గినప్పటికీ.. ఏపీ ప్రభుత్వం కోవిడ్ సంక్షోభంలోనూ సంక్షేమ, అభివృద్ధి పథకాలను నిలుపుదల చేయకుండా కొనసాగించింది. కోవిడ్ సంక్షోభం, లాక్డౌన్ల నేపథ్యంలో 2019–20లో రూ.8 వేల కోట్లు, 2020–21లో ఏకంగా రూ.14 వేల కోట్ల ఆదాయం రాష్ట్ర ప్రభుత్వం కోల్పోయింది. మరో వైపు కోవిడ్ నియంత్రణ, నివారణ చర్యలకు ఏకంగా రూ.8 వేల కోట్లు వ్యయం చేసింది. మొత్తం మీద రూ.30 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు భారం పడింది. ఈ నేపథ్యంలో కేంద్రం అనుమతించిన మేరకు పరిమితికి లోబడే అప్పులు చేసింది. అయినప్పటికీ ప్రతిపక్షంతో పాటు ఎల్లో మీడియా రాష్ట్రం అప్పుల ఊబిలోకి వెళ్లిపోయిందంటూ దుష్ప్రచారం చేస్తూ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాయి. 2020–21 ఆర్థిక ఏడాదిలో కాగ్ ప్రాథమిక అకౌంట్ల మేరకు వివిధ రాష్ట్రాల బడ్జెట్ అంచనాలు, వాస్తవంగా చేసిన అప్పుల వివరాలు ఇలా ఉన్నాయి. మిగతా రాష్ట్రాల కంటే తక్కువే విభజన సమయం నుంచి ఏపీకి తప్పనిసరి రెవెన్యూ వ్యయం పెరుగుతూనే ఉంది. ఇప్పుడు కోవిడ్ సమయంలో మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో కేంద్రం అన్ని రాష్ట్రాలకు అదనపు రుణాలకు అనుమతించింది. అయితే ఇటీవల కొంత మంది ఏపీ ప్రభుత్వం ఎక్కువ అప్పులు చేస్తోందని తరుచూ ప్రస్తావిస్తున్నారు. 2014 రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఏపీ ఆర్థికంగా బలహీనంగా ఉంది. కోవిడ్ సంక్షోభంతో పాటు మరో పక్క రెవెన్యూ రాబడికి మించి తప్పసరి వ్యయాలు చేయాల్సి వస్తోంది. ఆస్తుల కల్పనకు సంబంధించి ఇరిగేషన్, విద్యుత్ వంటి ప్రాజెక్టులపై వ్యయం చేస్తున్నప్పటికీ వాటి ద్వారా వచ్చే రాబడి వాటి నిర్వహణకు సరిపోవడం లేదు. ఈ నేపథ్యంలో అప్పులు చేసి తప్పనిసరి ఖర్చులు చేయాల్సి వస్తోంది. అయినప్పటికీ మిగతా రాష్ట్రాలతో పోల్చితే ఏపీ ప్రభుత్వం 2020–21లో చేసిన అప్పులు అదుపులోనే ఉన్నాయి. – ఎం.ప్రసాదరావు, రిటైర్డ్ ఎకనమిక్ ప్రొఫెసర్, ఆంధ్రా విశ్వ విద్యాలయం -
వేరే రాష్ట్రాల్లో మళ్లీ రిజిస్ట్రేషన్ అక్కర్లేదు !
సాక్షి, న్యూఢిల్లీ: తమ కొత్త వ్యక్తిగత వాహనాలను ప్రభుత్వ/ప్రైవేటు ఉద్యోగులు వేరే రాష్ట్రాలకు తీసుకెళ్లినపుడు ఆ రాష్ట్రాల్లోనూ మళ్లీ రిజిస్ట్రేషన్ చేయాల్సిన పనిలేకుండా ‘భారత్ సిరీస్ (బీహెచ్–సిరీస్)’ పేరిట కొత్త రిజిస్ట్రేషన్ సిరీస్‌ను అందుబాటులోకి తేనుంది. ఈ కొత్త సిరీస్ సెప్టెంబర్ 15 నుంచి అమల్లోకి తేనుంది. ఈ వివరాలతో కేంద్ర రోడ్డు రవాణా, జాతీయరహదారుల శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. తాజా నోటిఫికేషన్ ప్రకారం కొత్త వాహనాలకు భారత్ సిరీస్ (బీహెచ్ –సిరీస్) వినియోగించనున్నారు. వాహన యజమాని మరొక రాష్ట్రానికి బదిలీ అయినప్పటికీ ఈ రిజిస్ట్రేషన్ ముద్ర ఉన్న వాహనాన్ని రీ–రిజిస్ట్రేషన్ చేయించుకోనవసరం ఉండదని రవాణా శాఖ తెలిపింది. కేంద్ర భద్రతా బలగాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, నాలుగుకంటే ఎక్కువ రాష్రాల్లో కార్యాలయాలున్న ప్రైవేట్ సంస్థల ఉద్యోగులు వేరే రాష్ట్రాలకు బదిలీ అయినపుడు ఈ రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని వాడుకోవచ్చని పేర్కొంది. బీహెచ్–సిరీస్ రిజిస్ట్రేషన్ మార్క్ ఉన్న వాటి వాహనాల పన్ను ఎలక్ట్రానిక్ పద్ధతిలో చెల్లించాలి. మోటారు వాహనం పన్నును రెండేళ్లు, అంత కుపైన విధించనున్నారు. 14 ఏళ్లు పూర్తవగానే ఆ వాహనంపై ఏటా విధించే పన్ను అంతకు ముందు విధించిన మొత్తంలో సగానికి తగ్గించనున్నారు. అదేవిధంగా, కొత్త సిరీస్ ఉన్న నాన్–ట్రాన్స్పోర్ట్ వాహనాల ధర రూ. 10 లక్షల లోపు ఉంటే 8% వాహన పన్ను, రూ. 10–20 లక్షల మధ్య ఉంటే 10% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ముద్ర ఫార్మాట్ YY BH #### XX. ఇందులో వైవై అంటే తొలి రిజిస్ట్రేషన్ సంవత్సరం, బీహెచ్ అంటే భారత్ సిరీస్ కోడ్, #### అంటే 0000 నుంచి 9999 నంబర్లు.. ఎక్స్ఎక్స్ అంటే ఆంగ్ల అక్షర క్రమం. -
కరోనా కట్టడికి ఏపీ బాటలో ఇతర రాష్ట్రాలు
సాక్షి, అమరావతి: కరోనా కట్టడి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ఇతర రాష్ట్రాలకు దిశా నిర్దేశం చేస్తున్నాయి. దేశంలో వ్యాక్సిన్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటూ మొదట 45 ఏళ్లు దాటిన వారికి రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఆ తర్వాతే 18 – 45 ఏళ్ల మధ్య ఉన్న వారికి వేయడం ప్రారంభించాలన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయాన్ని రాష్ట్రంలో ప్రతిపక్ష టీడీపీ విమర్శించింది. కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, చత్తీస్ఘడ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, అసోం తదితర రాష్ట్రాలు కూడా మే 1 నుంచి 18 ఏళ్లు దాటిన వారికి కూడా వ్యాక్సిన్లు వేస్తామని ప్రకటించాయి. కానీ ఆ రాష్ట్రాలన్నీ కూడా కేవలం కొన్ని రోజుల్లోనే క్షేత్ర స్థాయిలో పరిస్థితులను గమనించి వాస్తవాన్ని గుర్తించి ఏపీ ప్రభుత్వ విధానంలోకి వచ్చాయి. మహారాష్ట్ర, కర్టాటక, తెలంగాణ రాష్ట్రాలు తాము ప్రస్తుతం 18 ఏళ్లు నుంచి 45 ఏళ్లలోపు వారికి వ్యాక్సిన్లు వేయలేమని తేల్చి చెప్పాయి. చత్తీస్ఘడ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, అసోం కూడా మొదట 45 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామని తేల్చి చెప్పాయి. వ్యాక్సిన్ల కోసం గ్లోబల్ టెండర్లు.. మన అవసరాలకు సరిపడా వ్యాక్సిన్లు సకాలంలో దేశీయంగా లభించనందున వ్యాక్సిన్ల కొనుగోలు కోసం గ్లోబల్ టెండర్లు నిర్వహించాలని సీఎం జగన్ నిర్ణయించారు. వ్యాక్సిన్ల కోసం గ్లోబల్ టెండర్లు అవసరం ఏమిటన్న ఇతర రాష్ట్రాలు కూడా ఇప్పుడు ఏపీ బాట పట్టనున్నాయి. తాజాగా వ్యాక్సిన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం గురువారం గ్లోబల్ టెండర్లు వేసింది. జూన్ 3 నాటికి ఆ టెండర్లు తెరిచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ల కోసం గ్లోబల్ టెండర్లు పిలవాలని.. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాలు కూడా తాజాగా నిర్ణయించాయి. మరికొన్ని రాష్ట్రాలు కూడా అదే ఆలోచనలో ఉన్నాయి. శాస్త్రీయ దృక్పథంతో కూడిన ఆచరణాత్మక విధానం అనుసరిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విధానాలపై జాతీయ స్థాయిలో సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. -
రవీంద్రుడి గడ్డపై పరాయివారు ఉండరు
కాంథీ(పశ్చిమబెంగాల్): వందేమాతరం అంటూ దేశాన్ని ఒక్కటి చేసిన నేల పశ్చిమబెంగాల్ అని, అలాంటి గడ్డపై ‘పరాయివారు’ అనే మాటలు వినిపిస్తున్నాయని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. బీజేపీ అధికారంలోకి వస్తే స్థానిక నాయకుడినే సీఎం చేస్తామని మోదీ తెలిపారు. తూర్పు మిడ్నాపూర్ జిల్లాలోని కాంథీలో బుధవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోదీ పాల్గొన్నారు. తృణమూల్ కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరి నందిగ్రామ్‌లో మమతపై పోటీ చేస్తున్న సువేందు అధికారి కుటుంబానికి కాంథీ ప్రాంతంలో గట్టి పట్టుంది. మోదీ, బీజేపీ అగ్రనేత అమిత్ షాలను బెంగాల్‌కు పరాయివారంటూ టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రాన్ని ఢిల్లీ, గుజరాత్‌లకు చెందిన పరాయివారు పాలించడాన్ని బెంగాలీలు అంగీకరించబోరని మమత ప్రచారం చేస్తున్నారు. బీజేపీ అగ్ర నేతలను ఎన్నికల పర్యాటకులుగా అభివర్ణిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. బకించంద్ర చటర్జీ, రవీంద్రనాథ్ టాగోర్, సుభాష్ చంద్రబోస్ వంటి మహనీయులు జన్మించిన బెంగాల్ గడ్డపై భారతీయులెవరూ పరాయి వారు కావని మోదీ వ్యాఖ్యానించారు. ‘మమ్మల్ని టూరిస్ట్‌లంటున్నారు. అవహేళన చేస్తున్నారు. రవీంద్రుడి బెంగాల్లో ప్రజలు ఎవరినీ పరాయివారుగా చూడరు’ అని పేర్కొన్నారు. దాడి చేశారంటూ తప్పుడు ఆరోపణలు చేసి నందిగ్రామ్ ప్రజలను మమత బెనర్జీ అవమానపర్చారని మోదీ విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని పథకాలను అవినీతి రహితంగా, పారదర్శకంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. పశ్చిమబెంగాల్లో హింస, బాంబులు, తుపాకీల సంస్కృతిని రూపుమాపుతామన్నారు. ‘ఇంటి ముందుకు ప్రభుత్వం’ అని మమత ప్రచారం చేసుకుంటున్నారని, కానీ ఎన్నికల ఫలితాలు వెలువడే మే 2న ఆమె అధికారం కోల్పోయి ఇంటికి వెళ్లనున్నారని వ్యాఖ్యానించారు. తృణమూల్ ప్రభుత్వం రాష్ట్రానికి చీకటినే మిగిల్చిందని, బీజేపీ అధికారంలోకి వస్తే అభివృద్ధితో రాష్ట్రాన్ని బంగారు బంగ్లాగా మారుస్తామని హామీ ఇచ్చారు. -
వాళ్లే ‘పరాయి శక్తులు’!
బిష్ణుపుర్: రాబోయే ఎన్నికల్లో సమస్యలు, అరాచకం సృష్టించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతైనవాళ్లనే తమ పార్టీ ‘బయట వ్యక్తులు’(అవుట్‌సైడర్స్)గా అభివర్ణించిందని, తరాలుగా బెంగాల్లో జీవనం గడుపుతున్న ఇతర రాష్ట్రాల ప్రజలను కాదని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ వివరించారు. బెంగాల్లో జీవించేందుకు భారత్‌లోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవాళ్లంతా తమ దృష్టిలో స్థానికులేనన్నారు. బీజేపీని అవుట్‌సైడర్స్ పార్టీ అంటూ టీఎంసీ విమర్శించడం తెల్సిందే. ఈ నినాదం రాష్ట్రంలో నివాసముండే ఇతర రాష్ట్రాలవారిపై ప్రభావం చూపవచ్చన్న అంచనాతో మమత తాజాగా వివరణ ఇచ్చారు. ‘‘తరాలుగా ఇక్కడే ఉంటున్నవారిపై బయటవారనే ముద్ర ఎందుకు? వారు బెంగాల్లో భాగం, కేవలం యూపీలాంటి రాష్ట్రాల నుంచి ఎన్నికలు చెడగొట్టేందుకు వచ్చిన అల్లరిమూకలనే మేము బయటి శక్తులుగా భావిస్తాం’’ అని మమత చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు ఇలాంటి బయట శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వారిని దునుమాడాలని పిలుపునిచ్చారు. మరోవైపు కాంగ్రెస్, సీపీఎంపైన కూడా ఆమె నిప్పులు చెరిగారు. మైనార్టీలు వీరి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఓట్లను చీల్చడం ద్వారా ఈ పార్టీలు బీజేపీకి లబ్ది చేకూరుస్తాయని విమర్శించారు. ప్రధాని కుర్చీపై తనకు అమిత గౌరవం ఉందని, కానీ ప్రస్తుత ప్రధాని మోదీ మాత్రం అతిపెద్ద అబద్ధాలకోరని మమతా బెనర్జీ దుయ్యబట్టారు. ఒక్కొక్కరి అకౌంట్లో రూ. 15 లక్షలు వేసే హామీ ఏమైందని ప్రశ్నించారు. -
‘వారంతా వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలి’
సాక్షి, అమరావతి: ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్నవారంతా స్పందన వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలని కోవిడ్ స్టేట్ లెవల్ కో ఆర్డినేటర్ కృష్ణబాబు తెలిపారు.ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వాళ్లంతా spandana.ap.gov.inలో నమోదు చేసుకోవాలని సూచించారు. అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు సమాచారం ఇచ్చామని.. ఏపీకి రావాలనుకుంటున్నవారికి ఏర్పాట్లు చేయాలని కోరామని ఆయన తెలిపారు. రాజస్తాన్‌లో 9వేల మంది రిజిస్టర్ చేసుకున్నట్లు సమాచారం వచ్చిందని.. వారిని ఏపీకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. తమిళనాడులో ఉన్న మత్స్యకారులను కూడా తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మహారాష్ట్ర వలస కూలీలను స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. శ్రామిక్ రైళ్లలో సాధారణ ప్రజలకు అనుమతి ఉండదని.. వలస కూలీలకు మాత్రమే పాస్‌లు ఇస్తున్నామని కృష్ణబాబు వెల్లడించారు. రాజస్తాన్ మౌంట్ అబూలో 670 మంది వారు ఉన్నారని.. వారికి రాజస్తాన్ ప్రభుత్వం ప్రత్యేక రైలు సిద్ధం చేసిందని తెలిపారు. ఏ రైలులో కూడా 1200 మందికి మించి ఉండరని తెలిపారు. వివిధ దేశాల నుంచి ఏపీకి వచ్చేందుకు 10,500 మంది రిజిస్టర్ చేసుకున్నారని తెలిపారు. తెలంగాణ నుంచి ఏపీకి రావడానికి ఒక పద్దతి ప్రకారం పర్మిషన్ ఇవ్వాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. అనుమతులు లేకుండా సరిహద్దుల్లోకి వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని స్పష్టం చేశారు, ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోలేని వారు తహశీల్ధార్ కార్యాలయంలో సంప్రదించవచ్చని కృష్ణబాబు పేర్కొన్నారు. (మద్య నియంత్రణ దిశగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం) -
వేరే రాష్ట్రంలో కోటా వర్తించదు
న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీల వర్గాలకు చెందిన ఒక వ్యక్తి కులాన్ని వేరే రాష్ట్రంలోను అదే వర్గంగా గుర్తిస్తే తప్ప ఆ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా ప్రవేశాల్లో రిజర్వేషన్ల లబ్ధి పొందలేరంటూ సుప్రీం కోర్టు గురువారం కీలక తీర్పునిచ్చింది. ఈ మేరకు జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ ఆర్ భానుమతి, జస్టిస్ ఏ శంతన గౌడర్, జస్టిస్ ఎస్ఏ నజీర్‌ల రాజ్యాంగ ధర్మాసనం ఏకాభిప్రాయంతో తీర్పు వెలువరించింది. అదే సమయంలో ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఎస్సీ, ఎస్టీలకు కేంద్ర రిజర్వేషన్ విధానం అమలు చేయవచ్చని స్పష్టం చేసింది. ‘ఒక రాష్ట్రంలో ఎస్సీ లేదా ఎస్టీ వర్గానికి చెందిన వ్యక్తి వేరే రాష్ట్రాలకు వెళ్లినప్పుడు ఉద్యోగం, విద్యా సంస్థల్లో ప్రవేశాలకు సంబంధించిన అంశాల్లో ఆ రాష్ట్రంలో అతనిని ఎస్సీ, ఎస్టీగా పరిగణించకూడదు. దాని వల్ల సొంత రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలు వారికోసం ఉద్దేశించిన రిజర్వేషన్ల ప్రయోజనాలు కోల్పోతారు’ అని ధర్మాసనం పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన వ్యక్తి కులాన్ని వేరే రాష్ట్రంలో అదే వర్గంగా గుర్తించని పక్షంలో అతను ఆ రాష్ట్రంలో రిజర్వేషన్ కోరవచ్చా? అని దాఖలైన 8 పిటిషన్లను విచారించిన అనంతరం సుప్రీం కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. ‘ఒక రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతంలో ఎస్సీ, ఎస్టీలుగా గుర్తింపు పొందితే వారికి వేరే రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతంలో తప్పనిసరిగా అదే హోదా ఉండాల్సిన అవసరం లేదు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఒక కులం లేదా తెగను ఏ రాష్ట్రంలోనైనా ఎస్సీ, ఎస్టీల జాబితాలో చేర్చేందుకు అర్హతను ఆ ప్రాంత పరిస్థితులు, ప్రతికూలతలు, ఆ వర్గం ఎదుర్కొంటున్న సామాజిక ఇబ్బందులపై ఆధారపడి పరిగణనలోకి తీసుకుంటారని ధర్మాసనం వెల్లడించింది. ‘ఆంధ్రప్రదేశ్‌లోని ఎస్సీ లేదా ఎస్టీ వర్గానికి చెందిన వ్యక్తి మహారాష్ట్రలో రిజర్వేషన్ లబ్ధి పొందితే మహారాష్ట్రలోని ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన వ్యక్తికి ఆ రాష్ట్రం కేటాయించిన రిజర్వేషన్ ఫలాన్ని దక్కకుండా చేయడమే’ అని పేర్కొంది. అయితే వేరే రాష్ట్రానికి చెందిన ఎస్సీ, ఎస్టీలు ఢిల్లీలోని ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు అర్హులని సుప్రీంకోర్టు తెలిపింది. ఢిల్లీ విషయంలో ఇతర రాష్ట్రాలకు చెందిన ఎస్సీ, ఎస్టీలకు కేంద్ర రిజర్వేషన్ విధానం వర్తిస్తుందని నలుగురు న్యాయమూర్తులు స్పష్టం చేయగా జస్టిస్ భానుమతి వారితో విభేదించారు. ‘కేంద్ర పాలిత ప్రాంతంలోని ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వం కిందకు వచ్చినప్పటికీ అవన్నీ కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలో ఉంటాయి. యూనియన్ ఆఫ్ ఇండియా నియంత్రణలో ఉండవు’ అని తన తీర్పులో జస్టిస్ భానుమతి అభిప్రాయపడ్డారు. రిజర్వేషన్లకు వెనుకబాటు గీటురాయి కాదు ఉద్యోగ పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల అంశంలో వెనుకబాటుతనాన్ని కాకుండా ప్రభుత్వ ఉద్యోగాల్లో వారికి సరైన ప్రాతినిథ్యం లేకపోవడాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లపై గతంలో ఇచ్చిన తీర్పును సమీక్షించాలని దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేస్తూ తీర్పును రిజర్వ్ చేసింది. ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్ల అమలుకు షరతులు విధిస్తూ 2006లో సుప్రీం తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవరించేందుకు రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు పలువురు సుప్రీంలో పిటిషన్లు దాఖలు చేశారు. విచారించిన రాజ్యాంగ బెంచ్ తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. 2006 నాటి తీర్పును సమీక్షించండి ఎస్సీ, ఎస్టీ వర్గాలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించేముందు ప్రభుత్వ ఉద్యోగాల్లో వారికి సరైన ప్రాతినిధ్యం లేకపోవడం తదితర అంశాలకు సంబంధించి అవసరమైన సమాచారం సమర్పించాలని 2006 నాటి ఎం.నాగరాజ్ కేసులో రాష్ట్రాలకు సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే ఈ తీర్పును పునః సమీక్షించాలని కేంద్రం, పలు రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంను కోరాయి. -
అద్దెకు తెలంగాణ జైళ్లు
చంచల్‌గూడ: జైళ్లశాఖ చేపట్టిన సంస్కరణలతో ఖైదీల్లో పరివర్తన వస్తోందని, తద్వారా ఖైదీలు లేక జైళ్లు ఖాళీ అవుతున్నాయని తెలంగాణ జైళ్ల శాఖ డీజీ వినయ్‌కుమార్ సింగ్ అన్నారు. సోమవారం చంచల్గూడలోని జైళ్ల శాఖ ప్రధాన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ నూతన సంవత్సరం సందర్భంగా గ్రాండ్ విజన్ 2025 లక్ష్యాలను ఏర్పరచుకున్నట్లు తెలిపారు. నేరాల తగ్గింపు, సమాజిక సేవ, ఉపాధి కల్పన, స్వయం సమృద్ధి సాధన దిశగా ముందుకు సాగుతున్నామన్నారు. సామాజిక సేవలో జైళ్ల శాఖ ఒక కొత్త ఆధ్యయాన్ని సృష్టించిందన్నారు. యాచకరహిత హైదరాబాద్‌లో భాగంగా జైళ్ల ప్రాంగణంలో ఆనందాశ్రమం ఏర్పాటు చేసి 3749 యాచకులను పునరావాస కేంద్రానికి తరలించామన్నారు. కౌన్సిలింగ్ నిర్వహించగా అందులో 3526 మంది తిరిగి తమ తమ ఇళ్లకు వెళ్లారన్నారు. జైళ్ల శాఖ చేపట్టిన సంస్కరణల కారణంగా జైళ్లలో ఖైదీల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. త్వరలో ఇతర రాష్ట్రాల జైళ్ల శాఖకు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న జైళ్ల అద్దెకు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నామని ప్రభుత్వానికి ప్రతిపాదన పంపనున్నట్లు తెలిపారు. ఇతర జిల్లాల్లో కూడా ఆనందాశ్రమాలను ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని, అంధులు, మానసిక రోగులకు, అనాథలకు, వృద్ధులకు, వికలాంగులకు ఆశ్రయం కల్పిస్తామన్నారు. ఇప్పటి వరకు 9 సబ్ జైళ్లను మూసివేశామని, త్వరలో మరో 5 సబ్ జైళ్లను మూసివేయనున్నట్లు తెలిపారు. విడుదలైన ఖైదీలకు ఉపాధి కల్పిస్తే నేరాలు తగ్గుతాయన్నారు. సమావేశంలో ఐజీ ఆకుల నర్సింహ, డీఐజీ సైదయ్య, అధికారులు సంపత్, శ్రీమాన్‌రెడ్డి తదితరులున్నారు. -
కోల్‌కతలో మమతా బెనర్జీ నయకత్వంలో ర్యాలీ
-
భీమవరానికి ఇతర రాష్ట్రాల రొయ్యలు దిగుమతి
––గుజరాత్, పశ్చిమబెంగాల్, ఒరిస్సా రాష్ట్రాల్లో తక్కువ ధరకు కొనుగోలు ––ఇక్కడి ధరలు తగ్గిపోయే ప్రమాదముందని రైతులు ఆందోళన భీమవరం: ఆక్వా హబ్‌గా అభివృద్ది చెందుతున్న జిల్లాలోని రొయ్యల రైతుల గుండెల్లో ఇతర రాష్ట్రాల రొయ్యలు ఆందోళనలు కలిగిస్తున్నాయి. భీమవరం, నెల్లూరు ప్రాంతాల వ్యాపారులు ఇటీవల కాలంలో గుజరాత్, పశ్చిమబెంగాల్, ఒరిస్సా తదితర రాష్ట్రాల్లో రొయ్యల కొనుగోలు ప్రారంభించడంతో ఇక్కడి రొయ్యలకు ధరలు తగ్గిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రొయ్యల్లో యాంటిబయోటిక్స్ అవశేషాలు గుర్తిస్తే కొనుగోలు నిలిపివేస్తామంటూ ఎగుమతిదారులు ఇటీవల ప్రకటించడంతో రొయ్యల రైతులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడిన తరుణంలో ఇతర రాష్ట్రాల నుంచి రొయ్యల దిగుమతులు గోరుచుట్టుపై రోకలిపోటులా పరిణమించాయంటున్నారు. యాంటిబయోటిక్స్ అవశేషాలు రొయ్యల పిల్లల హేచరీలు, రొయ్యల మేతల నుంచి వచ్చే అవకాశం ఉన్నా కేవలం రైతులను బాధ్యులను చేస్తూ కొనుగోలు నిలిపివేస్తామంటూ ప్రకటనలో గుప్పించడం వెనుక కొనుగోలుదారులు ధరలు తగ్గించే హ్యుహం ఉందనే ఆరోపణలు విన్పించాయి. జిల్లాలో సుమారు 50 వేల ఎకరాల్లో రొయ్యలు, దాదాపు లక్షన్నర ఎకరాల్లో చేపలను సాగుచేస్తున్నారని అంచనా. భీమవరం పరిసర ప్రాంతాల్లోనే దాదాపు 21 రొయ్యలను శుద్దిచేసే ప్రొసెసింగ్ యూనిట్లు ఉన్నాయి. రొయ్యల సాగుపై ప్రత్యక్షంగా, పరొక్షంగా వేలాదిమంది ఆధారపడి జీవిస్తున్నారు. రాష్ట్రంలో సుమారు ఏడు జిల్లాల్లో రొయ్యల సాగుచేస్తున్నా దాదాపు 70 శాతం ఎగుమతులు భీమవరం ప్రాంతం నుంచే కావడం విశేషం. రొయ్యల ఎగుమతులు ద్వారా 2014లో రాష్ట్రానికి సుమారు 8,732 కోట్లు ఆదాయం వచ్చిందంటే రొయ్యలకు ఎంతటి ప్రాధాన్యత ఉందో అవగతమవుతోంది. – గుజరాత్,పశ్చిమబెంగాల్, ఒరిస్సా రాష్ట్రాల్లో కొనుగోలు..... మన రాష్ట్రం నుంచి రొయ్యలు ఎక్కువగా యుఎస్ఏ, చైనా, థాయిలాండ్, ఇండోనేషియా, జపాన్, ఆస్ట్రేలియా వంటి దేశాలకు ప్రధానంగా భీమవరం ప్రాంతం నుంచి ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయి. ముందుగా జిల్లాలోని సముద్రతీర ప్రాంతంలో వరిసాగుకు ఉపయోగపడని భూముల్లో మాత్రమే టైగర్ రొయ్యల సాగు ప్రారంభమైంది. అయితే దీనిలో రైతులు నష్టాలను చవిచూడడంతో టైగర్ రొయ్యలసాగుకు రైతులు స్వస్తి చెప్పి స్కాంపి రొయ్యల పెంపకం చేపట్టారు. అయితే స్కాంపి రొయ్యలు సరిౖయెన ఫలితాలు ఇవ్వలేదు. వెనువెంటనే వనామి రొయ్యల పెంపకం చేపట్టారు. వనామి పెంపకం ద్వారా రొయ్యల రైతులు మంచిఫలితాలు పొందడంతో రొయ్యల చెరువుల విస్తీర్ణం ఘననీయంగా పెరిగింది. సన్న,చిన్నకారు రైతులు సైతం రొయ్యల సాగు పట్ల ఆసక్తి చూపిస్తున్న తరుణంలో ఇటీవల ప్రతికూల వాతావరణంతో అనేక మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇదే సందర్భంలో యాంటిబయోటిక్స్ వాడకం అంటూ వ్యాపారులు రైతులను బెదిరించడం ప్రారంభించారు. దీనికితోడు గుజరాత్,పశ్చిమబెంగాల్, ఒరిస్సా తదితర‡ రాష్ట్రాల నుంచి రొయ్యల కొనుగోలు చేస్తున్నారు. ––రొయ్యల ధరలు తగ్గించడానికి ఎగుమతిదారులకు అవకాశం... రొయ్యల్లో యాంటిబయోటిక్స్ అవశేషాలు, ఇతరరాష్ట్రాల నుంచి దిగుమతులు కారణంగా రొయ్యల ధరలు తగ్గించడానికి రొయ్యల ఎగుమతిదారులకు మంచి అవకాశమని రైతులు వాపోతున్నారు. 2000 సంవత్సరంలో యాంటిబయోటిక్స్ అవశేషాలంటూ ధరలు ఘననీయంగా తగ్గించి రైతులను నష్టాల పాలుచేశారని, ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి ఇబ్బడిముబ్బడిగా రొయ్యలు వస్తున్నాయంటూ ధరలు తగ్గించేందుకు అవకాశం ఉందని చెబుతున్నారు. –అక్కడ ప్రొసెసింగ్ యూనిట్లు లేకపోవడమే కారణం..... ఒరిస్సా, గుజరాత్, ప శ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాల్లో రొయ్యల సాగు చేస్తున్నా అక్కడ రొయ్యల మేతలు తయారుచేసే కంపెనీలు, ప్రొసెసింగ్ యూనిట్లు లేవు. గతంలో అక్కడ రొయ్యల సాగు తక్కువగా ఉండడంతో తెలుగురాష్ట్రాల నుంచే రొయ్యల మేతలు, మందులు దిగుమతి చేసుకునేవారు. అక్కడ ఉత్పత్తి చేసిన రొయ్యలను ప్రధానంగా భీమవరం,నెల్లూరు ప్రాంతంల్లోని వ్యాపారులు కొనుగోలు చేసేవారు. అయితే ఇటీవల కాలంలో ఇతర రాష్ట్రాల్లోను రొయ్యల సాగు విస్తీర్ణం విఫరీతంగా పెరిగింది. రొయ్యలను నిల్వచేయడానికి అవసరమైన ప్రొసెసింగ్ యూనిట్లు లేకపోవడంతో రొయ్యల పట్టుబడి పట్టిన వెంటనే తక్కువ ధరకైనా అమ్మకాలు చేసేవారు. దీనితో భీమవరం ప్రాంతంలోని వ్యాపారులు, ఏజెంట్లు కిలోకు రూ. 100 తక్కువ ధరకు కొనుగోలు చేసి భీమవరం నుంచి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. ఇటీవల కాలంలో ఇతర రాష్ట్రాల నుంచి రొయ్యలు ఇబ్బడి ముబ్బడిగా రావడంతో వ్యాపారులు, ఏజెంట్లు తక్కువ ధరకు లభించే ఇతర రాష్ట్రాల రొయ్యలను కొనుగోలు చేయడానికి ఆశక్తి చూపిస్తున్నట్లు చెబుతున్నారు. ఇదే పద్దతి కొనసాగితే ఇక్కడి రొయ్యల ధర ఘననీయంగా తగ్గిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. –కంటెయినర్స్‌లో రొయ్యల తరలింపు.... భీమవరం ప్రాంతంలోని రొయ్యల వ్యాపారులు ఒరిస్సా, గుజరాత్, ప శ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాల్లో కొనుగోలు చేసిన రొయ్యలను కంటెయినర్స్‌లో భీమవరం తీసుకువస్తున్నారు. ఒక్కొక్క కంటెయినర్లో సుమారు మూడువేల టన్నుల రొయ్యలను రవాణ చేయడం వల్ల రవాణ ఖర్చులు అంతంతమాత్రంగానే ఉండడంతో అక్కడ తక్కువ ధరకు దొరికే రొయ్యలను కొనుగోలు చేయడానికి ఇక్కడి వ్యాపారులు మక్కువ చూపుతున్నారని చెబుతున్నారు. –ధరలు తగ్గిపోయే ప్రమాదం ఉంది.... ఫొటోఫైల్:30బీవీఆర్‌ఎమ్28–30080012: పి.ఏసు, రొయ్యరైతు, దెయ్యాల తిప్ప ఇప్పటికే ప్రతికూల వాతావరణంతో ఇక్కడి రొయ్యల ధరలను తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో ఇతర రాష్ట్రాల నుంచి రొయ్యలు దిగుమతి అయితే మేము పండించే రొయ్యలకు గిరాకీ తగ్గి మరింత ధర తగ్గిపోయే ప్రమాదం ఉంది. –ఇప్పటికే యాంటిబయోటిక్స్‌తో ఇబ్బందులు.... ఫొటోఫైల్:30బీవీఆర్‌ఎమ్29–30080012: ఎన్.సత్యనారాయణ, నాగిడిపాలెం రొయ్యల్లో యాంటì బయోటిక్స్ ఉంటే «కొనుగోలు చేయమంటూ వ్యాపారులు అల్టిమేట్టం ఇచ్చిన తరుణంలో ఇతరరాష్ట్రాల నుంచి రొయ్యల దిగుమతి ఇక్కడి రైతులకు గోరుచుట్టుపై రోకలిపోటులా పరిణమించనుంది. గతంలో యాంటి» యోటిక్స్ కార ణంగా ఇతర దేశాలు రొయ్యలు కొనుగోలు చేయడం లేదని ధరలు తగ్గించి వేశారు. ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి రొయ్యలు దిగుమతి అయితే ఉల్లిపాయలు, టమాట రైతుల పరిస్థితి రొయ్యల రైతులకు దాపురిస్తుంది. -
ఇసుక దొంగలు
హైటెక్ యంత్రాలతో యథేచ్ఛగా దోపిడీ నది మొత్తం గుంతలమయం తాత్కాలిక సచివాలయం పేరుతో అక్రమ రవాణా రోజూ వేలాది వాహనాల్లో తరలింపు సాక్షి, అమరావతి : కృష్ణా నదిలో దొంగలు పడ్డారు. బంగారం.. నగదు.. వస్తువులు దొంగలించే వారు కాదు. నదీమతల్లి గర్భంలో ఇసుకను దోచేస్తున్నారు. హైటెక్ యంత్రాల సాయంతో నది పొడవునా ఇసుక విచ్చలవిడిగా తోడేస్తున్నారు. టిప్పర్లు, లారీలు, ట్రాక్టర్లతో ఇతర ప్రాంతాలకు చేరవేస్తున్నారు. అక్కడి నుంచి చెన్నై, కర్నాటక, హైదరాబాద్‌కు తరలించి రూ.కోట్లు జేబులు నింపుకుంటున్నారు. కనీవినీ ఎరుగని రీతిలో సాగుతున్న ఈ భారీ దోపిడీ తాత్కాలిక సచివాలయ నిర్మాణం పేరుతో జరుగుతుండటం గమనార్హం. ఈ దోపిడీ వెనక కృష్ణా, గుంటూరు జిల్లాల మంత్రి, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీ స్థాయి నాయకులు అనేక మంది ఉన్నారు. ఏ రాష్ట్రాల్లో దొరకని ఇసుక సంపద కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో నిక్షిప్తమై ఉంది. విలువైన ఈ ప్రకృతి సంపదపై అధికారపార్టీ నేతల కన్నుపడింది. తుళ్లూరు మండలం వెలగపూడిలో సచివాలయ నిర్మాణ పనులు వీరి దోపిడీకి రాచమార్గమైంది. ‘తాత్కాలికం’ మాటతో ఇసుక దోపిడీకి తెరతీశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాసానికి కూతవేటు దూరంలో ఉండవల్లి, వెంకటపాలెం, లింగాయపాలెం, తాళ్లాయపాలెం, రాయపూడి, బోరుపాళెం, అమరావతి, మల్లాది, అచ్చంపేట ఇసుక రీచ్‌లు ఉన్నాయి. వీటిలో నాలుగు రీచ్‌ల నుంచి మాత్రమే ఇసుకను తీసుకెళ్లేందుకు అనుమతులు ఉన్నాయి. హైటెక్ యంత్రాలతో తోడివేత.. ఇసుక తోడేందుకు అక్రమార్కులు హైటెక్ యంత్రాలను దించారు. ఉండవల్లి సమీప నదిలో నుంచి హైటెక్ యంత్రాలు (డ్రెజ్జింగ్) సాయంతో ఇసుకను తోడుతున్నారు. నదిలో అనేక చోట్ల యంత్రాలు వినియోగిస్తున్నారు. మరి కొన్నిచోట్ల భారీ జేసీబీలు, క్రేన్లు ఉపయోగిస్తున్నారు. లింగాయపాలెం పరిధిలో రెండు మూడు రీచ్‌లు ఉన్నాయి. వీటిలో ఒక చోట, తాళ్లాయపాలెం, బోరుపాలెం రీచ్‌లో డ్రెజ్జింగ్ మిషన్లతో ఇసుక తోడుతున్నారు. డ్రెజ్జింగ్ మిషన్ పడవపై ఏర్పాటు చేస్తారు. ఆ పడవ నది మధ్యలోకి తీసుకెళ్తారు. నదిలో పైపును విడిచిపెట్టి డ్రెజ్జింగ్ మిషన్‌ను స్టార్ట్ చేస్తారు. విద్యుత్ మోటార్ ద్వారా నీరు ఎలా వెలుపలకి వస్తాయో.. అలా ఇసుక డ్రెజ్జింగ్ మిషన్ ద్వారా వెలుపలకు వస్తోంది. ఆ ఇసుకను క్రేన్, జేసీబీలతో పెద్ద పెద్ద గుట్టలుగా పోస్తున్నారు. ఒక డ్రెజ్జింగ్ మిషన్ ద్వారా రోజుకు 120 క్యూబిక్ మీటర్ల ఇసుక తోడుతోంది. నదీ తీరంలో ఐదు డ్రెజ్జింగ్ మిషన్ల ద్వారా ఇసుకను తోడుతున్నారు. క్రేన్, జేసీబీలు లెక్కలేనన్ని నదిలో నుంచి ఇసుక తోడుతున్నాయి. రోజూ వేలాది వాహనాలలో రవాణా.. సచివాలయ నిర్మాణానికి 50 నుంచి 75 టిప్పర్లతో ఇసుక తరలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మిగిలిన లారీలు, ట్రాక్టర్ల ద్వారా తరలించే ఇసుక తమకు సంబంధం లేదని తేల్చి చెప్పారు. లింగాయపాలెం ఇసుక రీచ్ వద్ద రోజుకు వెయ్యి లారీల ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు. లింగాయపాలెం మరో రీచ్ వద్ద రోజుకు 500 ట్రాక్టర్ల ఇసుక తరలి వెళ్తోంది. బోరుపాలెం రీచ్ నుంచి రోజుకు 1800 లారీల ఇసుక తరలిపోతోంది. ఇంకా వెంకటంపాలెం, అమరావతి, మల్లాది తదితర రీచ్‌ల నుంచి మరో వెయ్యి లారీలు. ఇలా రోజుకు సుమారు పది వేల క్యూబిక్ మీటర్ల ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. ఒక లారీ ఇసుక రూ.ఆరు వేల నుంచి రూ.పది వేల చొప్పున విక్రయిస్తున్నారు. ట్రాక్టర్ ఇసుక రూ.1500 నుంచి రూ.రెండు వేల వరకు పలుకుతోంది. కృష్ణా నదిలోని ఇసుకను గుంటూరుకు చేరవేసి అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు లారీ డ్రైవర్ ఒకరు వెల్లడించారు. ఇసుక ఇష్టానుసారంగా తోడేయటంతో నది గర్భంలో పెద్ద లోయ ఏర్పడుతోంది. అమరావతి సమీపంలోని కృష్ణానదిలో ఇసుక అక్రమ రవాణాతో ఏర్పడ్డ లోయలో పడే మంగళవారం ఐదుగురు యువకులు మృతి చెందడం గమనార్హం.