Published
Sat, Sep 24 2016 1:51 AM
| Last Updated on Mon, Sep 4 2017 2:40 PM
మత్తడికి చేరువలో పాకాల
28 ఫీట్లకు చేరిన నీటిమట్టం
ఖానాపురం : జిల్లాలోని ప్రధాన చెరువుల్లో ఒకటైన పాకాల సరస్సు నీటిమట్టం శుక్రవారం నాటికి 28 ఫీట్లకు చేరింది. ఎగువ ప్రాంతమైన కొత్తగూడ మండలంలో కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు పొంగి పాకాల సరస్సులోకి నీరు చేరుతోంది. ఈ సరస్సు పూర్తిస్థాయి నీటిమట్టం 30.03 ఫీట్లు కాగా మరో 2 ఫీట్ల నీరు చేరితో అలుగుపడే అవకాశం ఉంది. ఎగువప్రాంతం నుంచి వాగులు భారీగా పొంగుతుండటంతో సరస్సులోకి నీరు చేరుతూనే ఉంది. ఎగువ ప్రాంతంలో వర్షాలు పడితే శనివారం ఉదయం వరకు పాకాల సరస్సు అలుగుపడే అవకాశం ఉంది.