గోనెగండ్ల: కర్నూలు జిల్లా గోనెగండ్ల పోలీస్ సబ్‌ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ యువకుని శవంతో గురిజహళ్లి గ్రామస్తులు ఆదివారం సాయంత్రం ఆందోళనకు దిగారు. భార్య, అత్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురిజహళ్లి గ్రామానికి చెందిన రాముడు(35)ను స్టేషన్‌కు పిలిపించిన ఎస్‌ఐ అతనిని చిత్రహింసలకు గురిచేశాడు.
దాంతో మనస్థాపానికి గురైన రాముడు పురుగుల మందు సేవించి ఆదివారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు. దాంతో ఆగ్రహించిన కుటుంబసభ్యులు, గ్రామస్తులు జాతీయరహదారిపై రాస్తారోకో చేశారు. రాముడు మరణానికి కారకుడైన ఎస్‌ఐని సస్పెండ్‌చేయాలని వారు పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది.
ఎస్‌ఐపై చర్య తీసుకోవాలని ఆందోళన
Published Sun, May 1 2016 10:15 PM | Last Updated on Sun, Sep 2 2018 3:51 PM
Advertisement
Advertisement