విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
Published Sat, Jan 7 2017 1:37 AM | Last Updated on Wed, Sep 5 2018 2:25 PM
సింగవరం (దెందులూరు) : విద్యుదాఘాతానికి గురైన ఓ పాల ట్యాంకర్ డ్రైవర్ శుక్రవారం మృతి చెందాడు. దెందులూరు ఏఎస్సై పి.కుమారస్వామి కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన పి.శంకరరావు (58) గతనెల నుంచి దెందులూరు మండలం సింగవరం తిరుమల డెయిరీలో పాలట్యాంకర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈనెల 5న ఫ్యాక్టరీ గేటు వద్ద పాలు దిగుమతి చేస్తుండగా.. ట్యాంకర్ పైకి ఎక్కేందుకు శంకరరావు యత్నించాడు. కాలు జారి కిందపడిపోతుండగా పట్టుకోసం ఎడమ చేతిని పైకెత్తాడు. పైనున్న విద్యుత్ తీగలు తగిలి విద్యుదాఘాతానికి గురయ్యాడు. వెంటనే అతడిని ఏలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం శంకరరావు మరణించాడు.
Advertisement
Advertisement