singavaram
-
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
సింగవరం (దెందులూరు) : విద్యుదాఘాతానికి గురైన ఓ పాల ట్యాంకర్ డ్రైవర్ శుక్రవారం మృతి చెందాడు. దెందులూరు ఏఎస్సై పి.కుమారస్వామి కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన పి.శంకరరావు (58) గతనెల నుంచి దెందులూరు మండలం సింగవరం తిరుమల డెయిరీలో పాలట్యాంకర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈనెల 5న ఫ్యాక్టరీ గేటు వద్ద పాలు దిగుమతి చేస్తుండగా.. ట్యాంకర్ పైకి ఎక్కేందుకు శంకరరావు యత్నించాడు. కాలు జారి కిందపడిపోతుండగా పట్టుకోసం ఎడమ చేతిని పైకెత్తాడు. పైనున్న విద్యుత్ తీగలు తగిలి విద్యుదాఘాతానికి గురయ్యాడు. వెంటనే అతడిని ఏలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం శంకరరావు మరణించాడు. -
పీబీసీకి గండికొట్టిన జేసీ దివాకర్ రెడ్డి!
అనంతపురం: ఎల్లనూరు మండలం సింగవరం వద్ద పులివెందుల బ్రాంచ్ కెనాల్(పీబీసీ)కు తెలుగుదేశం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, ప్రభుత్వ విప్ యామిని బాల గండి కొట్టారు. ఈ చర్యను పోలీసులు అడ్డుకున్నారు. దాంతో సింగవరంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులతో జేసీ దివాకర్ రెడ్డి, యామిని బాల వాగ్వివాదానికి దిగారు. పీబీసీ కింద అనంతపురం జిల్లాలో 5వేల ఎకరాలు, వైఎస్ఆర్ జిల్లాలో 55వేల ఎకరాలు మొత్తం 60వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ కెనాల్‌కు అంతంత మాత్రంగానే నీరు విడుదల చేస్తుంటారు. అందులో ఎక్కువ భాగం నీరు అనంతపురం జిల్లా రైతులే వాడేసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. -
శింగవరంలో ఉద్రిక్తత
బండిఆత్మకూరు: శింగవరం గ్రామంలో తోపు పోరంబోకు భూమి వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. శుక్రవారం ఈ భూములను పరిశీలించడానికి వచ్చిన ఆర్డీఓ సుధాకర్‌రెడ్డి, తహశీల్దారు సుధాకర్ వాహనాలను గ్రామస్తులు అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. నిరసనతో ఓంకార క్షేత్రానికి వెళ్లే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శింగవరం గ్రామ పంచాయతీకి చెందిన 564, 567, 570, 571 సర్వేనంబర్లలో 45.24 ఎకరాల తోపు పోరంబోకు భూమి ఉంది. ఈ భూమి సోమయాజులపల్లె గ్రామస్తులు సాగు చేసుకుంటున్నారు. తమకు పట్టాలు ఇవ్వాలని రెవెన్యూ అధికారులను కోరారు. దీంతో రెవెన్యూ అధికారులు ఈ భూమిని పరిశీలించి తోపు పోరంబోకుగా గుర్తించారు. అయితే ఈ భూమికి పట్టాలు ఇవ్వాలంటే ప్రభుత్వ భూమిగా (ఎ.డబ్ల్యూలాండ్) గా మార్చితేనే పట్టాలు ఇచ్చే అవకాశం ఉంటుందని భావించారు. అయితే తోపు పోరంబోకు భూమిని పట్టాలు ఇవ్వాలంటే గ్రామ పంచాయితీ తీర్మానం తప్పనిసరి. ఈ మేరకు విషయాన్ని శింగవరం గ్రామ పంచాయతీ దృష్టికి అధికారులు తెచ్చారు. అయితే శింగవరం సర్పంచ్ కళావతి, ఆమె భర్త బూరుగయ్య తదితరులు తమ గ్రామంలో పేదలు ఉండగా మరొక్క గ్రామానికి చెందిన వ్యక్తుల కోసం ఎలా తీర్మానం చేస్తామన్నారు. ఈ మేరకు తమ పంచాయతీకి చెందిన పేదలకే భూములు ఇవ్వాలని తీర్మానం చేసి రెవెన్యూ అధికారులకు ఇచ్చారు. దీంతో సోమయాజులపల్లె, శింగవరం గ్రామాల మధ్య వివాదానికి కారణమైంది. ఈ సమయంలో శుక్రవారం భూముల పరిశీలనకు తహశీల్దార్, ఆర్‌ర్డీఓ గ్రామానికి చేరుకున్నారు. కాగా భూములకు పట్టాలిచ్చేందుకే అధికారులు వచ్చారని భావించిన శింగవరం గ్రామస్తులు అధికారుల వాహనాలను అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. దీంతో అధికారులు చేసేదేమి లేక వెనుదిరిగారు. అయితే తమకు స్పష్టమైన హామీ ఇవ్వకుండా అధికారులు వెళ్లిపోవడంతో నిరసన వ్యక్తం చేస్తూ రహదారిపై బైఠాయించారు. సమాచారం అందుకున్న ఎస్ఐ గ్రామానికి చేరుకుని ప్రజలను శాంతింప చేసే ప్రయత్నాలు ఫలించలేదు. భూములను తమ గ్రామంలోని పేదలకు పంపిణీ చేస్తామని ఆర్డీఓ హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని చెప్పారు. కాగా ఇదే రహదారిలో వెళ్లాల్సిన ఓంకార క్షేత్ర భక్తులు మూడు గంటల పాటు వేచి ఉండలేక ఆందోళనకారులతో వాగ్వాదానికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తతంగా మారుతుండటంతో సీఐ శివప్రసాద్‌కు సమాచారం అందించగా ఆయన గ్రామానికి చేరుకుని ప్రజలకు నచ్చచెప్పి శాంతింప చేశారు. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
గూడూరు: కర్నూలు జిల్లా సి.బెళగల్ మండల పరిధిలోని కె.శింగవరానికి చెందిన రైతు దేవదానం(45) అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పంటలకోసం చేసి అప్పు భారం రూ.3 లక్షలకు చేరుకుంది. తీర్చే దారిలేక శనివారం ఇంట్లో పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబీకులు కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. -
బాలిక హత్య
సింగవరం(నిడదవోలు రూరల్), న్యూస్‌లైన్ : ఆడుకోవడానికి వెళ్లిన ఆ చిన్నారి చెరువులోని ఓ మూటలో విగతజీవిగా కనిపించింది. దీంతో ఆమె హత్యకు గురైందని అనుమాని స్తున్నారు. మృతదేహాన్ని చూసిన వారి హృదయాలు ద్రవించి పోయాయి. బాలిక బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిడదవోలు ఎన్టీఆర్ కాలనీకి చెందిన నేమాల కల్యాణి, లోవనారాయణరాజు దంపతులకు అనుష్క(6) ఏకైక కుమార్తె. స్థానిక ప్రైవేట్ స్కూల్లో ఒకటో తరగతి చదువుతోంది. శనివారం స్కూల్ నుంచి వచ్చిన తరువాత ఆడుకోవడానికి బయటకు వెళ్లింది. సాయంత్రం 6 గంటలైనా తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆదివారం మధ్యాహ్నం సింగవరం గ్రామ గౌడ సంఘ రామాలయం వెనుక ఉన్న చెరువులో మృతదేహంతో కూడిన మూట తేలుతోందని తెలుసుకున్న అనుష్క బంధువులు ఆందోళనకు గురయ్యారు. వీఆర్వో సూర్యనారాయణమూర్తి ఫిర్యాదు మేరకు నిడదవోలు ఎస్సై శ్యాంసుందర్ గ్రామానికి చేరుకుని స్థానికుల సహాయంతో మూటను విప్పి చూడగా బాలిక మృతదేహం బయటపడింది. అనుష్క మృతదేహంగా బంధువులు గుర్తించారు. బిడ్డ మృతి వార్త తెలుసుకున్న తల్లి రోదన చూపరులను కంటతడి పెట్టించింది. గతంలో కల్యాణికి మరో వ్యక్తితో పుట్టిన కుమార్తె కిడ్నాప్‌కు గురైంది. ఇప్పుడు దుండగులు అనుష్కను హత్యచేయటంతో ఆమె బంధువులు హంతకులను ఉరి తీయాలంటూ ఆవేశం వ్యక్తం చేశారు. తల, కంటిపై గాయాలు మృతిచెందిన అనుష్క తలపై గాయం ఉండడం, కన్నుగుడ్డుకు తీవ్ర గాయమై రక్తం కారిన గుర్తులు ఉండడంతో అఘంతకులు తొలుత బాలికను గాయపరిచి మృతి అనంతరం గోనె సంచుల్లో కుక్కి మూటకట్టి చెరువులో పడేసినట్లు స్థానికులు అనుమానం వ్యక్తపరుస్తున్నారు. మృతి వెనుక అనుమానాలు శనివారం సాయంత్రం పాఠశాల నుంచి వచ్చిన అనుష్క పుస్తకాల సం చి ఇంటివద్ద పెట్టి స్కూల్ యూనిఫామ్‌తోనే ఆడుకోవడానికి వెళ్లింది. అప్పటికే బాలిక ఇంటి సమీపంలోని ఆయిల్‌పాం తోటలో గుర్తుతెలియని వ్యక్తి రెండు సంచులతో గులాబీ మొక్కలకు మట్టి కావాలంటూ తిరిగాడని బాలిక బంధువులు చెప్పారు. -
ఆలిని కత్తితో నరికి చంపిన భర్త
ఎంత నచ్చజెప్పినా భార్య ప్రవర్తన మార్చుకోకపోగా, కాపురానికి కూడా రావడం లేదని ఆగ్రహించిన భర్త అతి కిరాతకంగా ఆమెను నరికి చంపాడు. అడ్డొచ్చిన అత్తయ్య, ఇద్దరు బావమరుదుల పైనా దాడి చేశాడు. తూర్పుగోదావరి జిల్లా సీతాపురం మండలం సింగవరంలో శనివారం అర్ధరాత్రి జరిగిన ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సామర్లకోట మండలం నవరకు చెందిన కోరుమిల్లి శ్రీనివాస్ తాపీ పని చేస్తుంటాడు. అతడికి మూడేళ్ల క్రితం రెండో వివాహమైంది. సింగవరానికి చెందిన వీరమణి (28)ని పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఏడాదిన్నర కుమార్తె ఉంది. పెళ్లయినప్పటి నుంచి సింగవరంలో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. శ్రీనివాస్ మొదటి భార్య గ్యాస్ స్టౌపై వంట చేస్తుండగా చీరకొంగు అంటుకుని మరణించింది. అప్పట్లో శ్రీనివాస్‌పై పోలీసులు కేసు నమోదు చేయగా, కోర్టులో అతడిపై నేరం నిరూపణ కాలేదు. శ్రీనివాస్‌తో వీరమణిది నాలుగో వివాహం. అంతకు ముందు పెళ్లి చేసుకున్న వారు వివిధ కారణాలతో ఆమెను విడిచిపెట్టారు. వీరమణి నడవడిక సక్రమంగా లేదని నెల రోజుల క్రితం శ్రీనివాస్ ఆమెతో గొడవపడ్డాడు. ఈ క్రమంలో తగాదాను పెద్దల్లో పెట్టగా, ఇష్టం లేకపోతే వెళ్లిపోవాలని వారు శ్రీనివాస్‌తో చెప్పారు. దీంతో శ్రీనివాస్ తన సొంత గ్రామానికి వెళ్లిపోయాడు. హతమార్చి.. ఆత్మహత్య చేసుకోవాలని.. శనివారం రాత్రి రెండు బాటిళ్లలో పెట్రోలు, అగ్గిపెట్టె, కత్తి, రెండు జతల దుస్తులు, పురుగుమందును వెంట తీసుకుని శ్రీనివాస్ సింగవరంలో భార్య ఇంటికి వచ్చాడు. ఆదమరచి నిద్రపోతున్న వీరమణి కుడి చెంపపైనా, మెడపై కత్తితో వేటు వేయగా, ఆమె కేకలు వేస్తూ అక్కడికక్కడే చనిపోయింది. కుమార్తె కేకలు విన్న ఆమె తల్లి వెంకటలక్ష్మి అక్కడకు రాగా, ఆమె మెడ, తలపై కత్తితో దాడి చేశాడు. అడ్డొచ్చిన బావమరుదులు రామారావు, వీరమణి పెదనాన్న కుమారుడు వీరవెంకట కృష్ణలను గాయపర్చాడు. అనంతరం తన వెంట తెచ్చుకున్న పురుగుమందు తాగేశాడు. అప్పటికే అక్కడకు చేరుకున్న స్థానికులు.. శ్రీనివాస్‌ను పట్టుకుని చెట్టుకు కట్టేశారు. తీవ్రంగా గాయపడ్డ ముగ్గురిని అంబులెన్స్లోను, అపస్మారక స్థితిలో ఉన్న శ్రీనివాస్‌ను ఆటోలోను రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. వెంకటలక్ష్మి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆదివారం ఉదయం ఆమెను కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. శ్రీనివాస్, రామారావు, వెంకటకృష్ణ రాజమండ్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరమణి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రవర్తన మార్చుకోమని వీరమణికి ఎంత నచ్చజెప్పినా వినకపోవడంతో ఆమెను హతమార్చినట్టు శ్రీనివాస్ చెప్పాడని సీఐ రమణ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
సింగవరంలో దారుణం
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం సింగవరం గ్రామంలో ఆదివారం దారుణం చోటు చేసుకుంది. ఈ రోజు తెల్లవారుజామున ఓ భర్త అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి చంపాడు. అడ్డువచ్చిన అత్త, బావమరిది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికలు వెంటనే స్పందించి పోలీసులుకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని ఆ దాడిలో గాయపడిన వారిద్దరిని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. మృతురాలి మృతదేహన్ని కూడా పోస్ట్‌మార్టం నిమిత్తం పోలీసులు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. నిందితుడు మాత్రం పరారీలో ఉన్నాడని పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పోలీసులు వివరించారు.