బాలిక హత్య
Published Mon, Nov 4 2013 1:01 AM | Last Updated on Mon, Jul 30 2018 8:27 PM
సింగవరం(నిడదవోలు రూరల్), న్యూస్‌లైన్ : ఆడుకోవడానికి వెళ్లిన ఆ చిన్నారి చెరువులోని ఓ మూటలో విగతజీవిగా కనిపించింది. దీంతో ఆమె హత్యకు గురైందని అనుమాని స్తున్నారు. మృతదేహాన్ని చూసిన వారి హృదయాలు ద్రవించి పోయాయి. బాలిక బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిడదవోలు ఎన్‌టీఆర్ కాలనీకి చెందిన నేమాల కల్యాణి, లోవనారాయణరాజు దంపతులకు అనుష్క(6) ఏకైక కుమార్తె. స్థానిక ప్రైవేట్ స్కూల్‌లో ఒకటో తరగతి చదువుతోంది. శనివారం స్కూల్ నుంచి వచ్చిన తరువాత ఆడుకోవడానికి బయటకు వెళ్లింది. సాయంత్రం 6 గంటలైనా తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఆదివారం మధ్యాహ్నం సింగవరం గ్రామ గౌడ సంఘ రామాలయం వెనుక ఉన్న చెరువులో మృతదేహంతో కూడిన మూట తేలుతోందని తెలుసుకున్న అనుష్క బంధువులు ఆందోళనకు గురయ్యారు. వీఆర్వో సూర్యనారాయణమూర్తి ఫిర్యాదు మేరకు నిడదవోలు ఎస్సై శ్యాంసుందర్ గ్రామానికి చేరుకుని స్థానికుల సహాయంతో మూటను విప్పి చూడగా బాలిక మృతదేహం బయటపడింది. అనుష్క మృతదేహంగా బంధువులు గుర్తించారు. బిడ్డ మృతి వార్త తెలుసుకున్న తల్లి రోదన చూపరులను కంటతడి పెట్టించింది. గతంలో కల్యాణికి మరో వ్యక్తితో పుట్టిన కుమార్తె కిడ్నాప్‌కు గురైంది. ఇప్పుడు దుండగులు అనుష్కను హత్యచేయటంతో ఆమె బంధువులు హంతకులను ఉరి తీయాలంటూ ఆవేశం వ్యక్తం చేశారు.
తల, కంటిపై గాయాలు
మృతిచెందిన అనుష్క తలపై గాయం ఉండడం, కన్నుగుడ్డుకు తీవ్ర గాయమై రక్తం కారిన గుర్తులు ఉండడంతో అఘంతకులు తొలుత బాలికను గాయపరిచి మృతి అనంతరం గోనె సంచుల్లో కుక్కి మూటకట్టి చెరువులో పడేసినట్లు స్థానికులు అనుమానం వ్యక్తపరుస్తున్నారు.
మృతి వెనుక అనుమానాలు
శనివారం సాయంత్రం పాఠశాల నుంచి వచ్చిన అనుష్క పుస్తకాల సం చి ఇంటివద్ద పెట్టి స్కూల్ యూనిఫామ్‌తోనే ఆడుకోవడానికి వెళ్లింది. అప్పటికే బాలిక ఇంటి సమీపంలోని ఆయిల్‌పాం తోటలో గుర్తుతెలియని వ్యక్తి రెండు సంచులతో గులాబీ మొక్కలకు మట్టి కావాలంటూ తిరిగాడని బాలిక బంధువులు చెప్పారు.
Advertisement
Advertisement