ద్విచక్ర వాహనం అదుపు తప్పి వ్యక్తి మృతి
వినుకొండ రూరల్ : ప్రమాదవశాత్తు ద్విచక్రవాహనం అదుపు తప్పి పడడంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం రాత్రి పట్టణ శివారు చెక్కపోస్టు వద్ద చోటు చేసుకుంది. నీలగంగవరానికి చెందిన దండు చెన్నయ్య(30) గత కొంత కాలంగా వినుకొండలో నివసిస్తూ ముళ్ళమూరు బస్టాండ్‌లో కూరగాయల వ్యాపారం చూస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం రాత్రి ముళ్ళమూరు బస్టాండ్ వద్ద ద్విచక్రవాహనంపై వెళుతున్న సందర్భంలో అదుపు తప్పి పడడంతో చెన్నయ్య తలకు బలమైన గాయాలయ్యాయి. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు హుటాహుటినా సంఘటనా ప్రాంతానికి చేరుకొని మృతదేహాన్ని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతునికి భార్య సత్యవతి, ఇరువురు కుమార్తెలు ఉన్నారు.