ఎచ్చెర్ల: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో ఏప్రిల్‌లో జరిగిన పీజీ రెండు, నాలుగు సెమిస్టర్ ఫలితాలను ఇన్‌చార్జి వీసీ ప్రొఫెసర్ మిర్యాల చంద్రయ్య శుక్రవారం విడుదల చేశారు. రెండో సెమిస్టర్‌లో 13 పీజీ కోర్సులకు సంబంధించి 84.43 శాతం ఫలితాలు నమోదయ్యాయి. 546 మంది పరీక్ష రాయగా, 461 మంది ఉత్తీర్ణత సాధించారు. నాలుగో సెమిస్టర్‌లో 18 కోర్సులకు సంబంధించి 91.75 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 618 మందికి 567 మంది ఉత్తీర్ణత సాధించారు. ఎల్‌ఎల్‌బీ, ఎంసీఏ, జీయోటెక్‌కు సంబంధించి నాలుగో సెమిస్టర్‌లో 92.59 శాతం ఫలితాలు నమోదయ్యాయి. 108కి 100 మంది ఉత్తీర్ణత సాధించారు. ఎంసీఏ, ఎంబీఏ, ఎల్‌ఎల్‌ఎంలకు సంబంధించి రెండో సెమిస్టర్‌లో 98.78 శాతం ఉత్తీర్ణత సాధించారు. 206 మందికి 187 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గుంట తులసీరావు, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పెద్దకోట చిరంజీవులు, ఎగ్జామినేషన్స్ డీన్ ప్రొఫెసర్ తమ్మినేని కామరాజు, చీఫ్ వార్డెన్ ప్రొఫెసర్ బిడ్డిక అడ్డయ్యలు పాల్గొన్నారు.