ఆకతాయిలతో భయమేస్తోంది
-
పాఠశాలకు రావాలంటే వణిపోతున్నాం...
-
రక్షణ కల్పించాలని ఎమ్మెల్యేకు విద్యార్థినుల వినతి
హుస్నాబాద్ : ‘పాఠశాలకు రావాంటే ఆకతాయిల తీరుతో వణికిపోతున్నాం... ఉదయం, సాయంత్రం ఆడపిల్లలు, టీచర్లు పాఠశాలకు రావాలంటే భయమేస్తోంది. ఆడ పిల్లలను, తల్లిదండ్రులను బెదిరిస్తున్నారు. చివరకు పాఠశాల టీచర్‌పైనా దాడి చేశారు. మాకు భద్రత ఎక్కడుందని’ అంటూ కస్తూరిబా బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు, టీచర్లు ఎమ్మెల్యే సతీష్‌కుమార్‌కు మొరపెట్టుకున్నారు. హుస్నాబాద్ పట్టణంలో హరితహారం కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎమ్మెల్యే రాగా.. కస్తూరిబా బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థులు తమ గోడు వెల్లబోసుకున్నారు.
పాఠశాలకు ప్రహరీలేదని, తాగిన మైకంలో ఇద్దరు వ్యక్తులు మాస్క్‌లు ధరించి అమ్మాయిలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని తెలిపారు. అడ్డుకునేందుకు వెళ్లిన టీచర్‌పై దాడి చేశారని, రాత్రి అయిందంటే తాగుబోతులు వచ్చి బెదిరిస్తున్నారని వివరించారు. తమకు రక్షణ కల్పించాలని వేడుకున్నారు. స్పందించిన ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ ఆకతాయిలను పట్టుకుని శిక్షించాలని ఎసై ్స ఎర్రల కిరణ్‌ను ఆదేశించారు. పాuý శాలకు వెళ్లే దారిలో గస్తీ ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైతే పాఠశాల చుట్టూ, వెలుపల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మరో రోజు పాఠశాలకు వచ్చి అమ్మాయిలు, టీచర్ల సమస్యలు తెలుసుకుంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.