పంటలు ఎండుతున్నాయి.. నీళ్లివ్వండి
Published Mon, Oct 31 2016 11:52 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
కర్నూలు(న్యూసిటీ): గోనెగండ్ల, కృష్ణగిరి, కోడుమూరు మండలంల్లో సాగు చేసిన వేరుశనగ, ఇతర పంటలు ఎండుతున్నాయని.. నీళ్లిచ్చి కాపాడాలని రైతులు శ్రీనివాసరెడ్డి, నాగేశ్వరరెడ్డి, ప్రకాష్‌రెడ్డి కోరారు. సోమవారం ఆయా ప్రాంతాల రైతులు పెద్ద ఎత్తున కలెక్టరేట్‌కు తరలివచ్చి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గాజులదిన్నె ప్రాజెక్టు ద్వారా నీళ్లు రానందువల్ల వేసిన పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధిక వడ్డీలతో అప్పులు చేసి సాగు చేసిన పంట కళ్లెదుటే ఎండిపోతుందన్నారు. అధికారులు స్పందించి పంటలకు నీరందించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం కలెక్టర్ సీహెచ్ విజయమోహన్‌కు వినతిపత్రం అందజేశారు.
Advertisement
Advertisement