పోరాడేవారినే ఎన్నుకోండి | pls select to good leader | Sakshi
Sakshi News home page

పోరాడేవారినే ఎన్నుకోండి

Published Sat, Oct 8 2016 8:11 PM | Last Updated on Mon, Sep 4 2017 4:40 PM

పోరాడేవారినే ఎన్నుకోండి

పోరాడేవారినే ఎన్నుకోండి

కడప ఎడ్యుకేషన్‌:
ఉపాధ్యాయ సమస్యలపై స్పష్టత ఉండి.. ప్రభుత్వంపై పోరాటం చేసేవారినే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్నుకోవాలని ఎస్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జయరామయ్య సూచించారు.  నగరంలోని ఎస్టీయూభవన్‌లో శనివారం  రాష్ట్రోపా«ధ్యాయ సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన ‘ఓటర్ల నమోదుకు సూచనలు’ కరపత్రం ఆవిష్కరణలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం ఉపాధ్యాయ,అధ్యాపక సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయన్నారు. రాష్ట్ర విద్యాశాఖ అసంబద్ధ ప్రయోగాలు చేసి విద్యార్థులు, ఉపాధ్యాయులతో ఆడుకుంటోందన్నారు. వీటిని అడ్డుకోవడానికి పెద్దల సభకు సమస్యలపై స్పష్టత ఉన్న నాయకున్ని దీంతోపాటు సంఘం బాధ్యుడిని ఎన్నుకుంటే ప్రభుత్వంపై పోరాటానికి ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటారని అన్నారు.  సంబంధిత ఎమ్మెల్సీ ఎన్నికలపై కడపలోని డీసీఈబీలో అదివారం  శిక్షణా కార్యక్రమాన్ని ఎస్టీయూ ఏర్పాటు చేసిందన్నారు. ఈ కార్యక్రమానికి ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు కత్తి నరసింహారెడ్డి హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఇలియాస్‌బాషా, ఆర్థిక కార్యదర్శి బాలగంగిరెడ్డి, రాష్ట్ర మున్సిపల్‌ కన్వీనర్‌ రవిశంకర్‌రెడ్డి, ఇతర నాయకులు వెంకటరామిరెడ్డి, శంకరయ్య, హైదర్‌వల్లి, గౌరీశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement