విశాఖపట్నం: తుపాకీ విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన విశాఖపట్నం జిల్లాలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. పెద్దబయలు మండలం కొత్త బోయినపల్లిలో వీరు తుపాకీ విక్రయం చేస్తుండగా పోలీసులు ఒక్కసారిగా దాడి చేసి అరెస్టు చేశారు.
అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి వివరాలు సేకరించే ప్రయత్నం చేయగా తమకు ఐదు నెలల కిందట స్మగ్లర్లు ఆ తుపాకీని ఇచ్చారని నిందితులు పోలీసులకు తెలిపారు. ఈ నిందితుల్లో ఒకరు గతంలో జ్యువెలరీ షాపు యజమానిపై దాడి కేసులో నిందితుడు.
తుపాకీ విక్రయిస్తుండగా అరెస్టు
Published Mon, Aug 10 2015 10:49 AM | Last Updated on Thu, Sep 19 2019 2:50 PM
Advertisement
Advertisement