వరంగల్ : వరంగల్ జిల్లా ముప్పానపల్లి అటవీ ప్రాంతంలో కూంబింగ్కు వెళ్లిన పోలీసులుపై ఏటూరు నాగారం దళ కమాండర్ మావోయిస్టు మధు కాల్పులకు యత్నించాడు. దీంతో ప్రతిగా పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకున్నారు.కాగా మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారంతో నిన్న రాత్రి పోలీసులు కూంబింగ్ నిర్వహించారు.
మరోవైపు మావోయిస్టు మధు అరెస్ట్ పై మానవ హక్కుల వేదిక నేత ప్రొఫెసర్ హరగోపాల్ స్పందించారు. మధును పోలీసులు ఎన్కౌంటర్ చేసే ప్రమాదం ఉందని, అతడిని వెంటనే కోర్టులో హాజరు పరచాలని డిమాండ్ చేశారు.
పోలీసుల అదుపులో మావోయిస్టు మధు
Published Wed, May 4 2016 8:18 AM | Last Updated on Tue, Oct 9 2018 2:38 PM
Advertisement
Advertisement