పోలీస్‌శాఖ విభజనకు కసరత్తు | police department divided | Sakshi
Sakshi News home page

పోలీస్‌శాఖ విభజనకు కసరత్తు

Published Tue, Aug 23 2016 6:59 PM | Last Updated on Mon, Sep 4 2017 10:33 AM

పోలీస్‌శాఖ విభజనకు కసరత్తు

పోలీస్‌శాఖ విభజనకు కసరత్తు

  • హుజూరాబాద్‌ అవుట్‌ .. మెట్‌పల్లి ఇన్‌
  • ఒక్కో జిల్లాకు రెండు డీఎస్పీ పోస్టులు
  • ప్రస్తుతం 6 డీఎస్పీ, 29 సీఐ, 68 ఎస్సై పోస్టులు
  • 1 డీఎస్పీ, 4 సీఐ, 11 ఎస్సై పోస్టులు అవుట్‌
  • 1 డీఎస్పీ, 1 సీఐ, 4 ఎస్సై పోస్టులు ఇన్‌ 
  • కరీంనగర్‌ క్రైం :  జిల్లాల పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా కరీంనగర్‌ జిల్లాను కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలుగా విభజిస్తుండడంతో పోలీస్‌ శాఖలో కూడా మార్పులు జరుగనున్నాయి. కొత్తగా ఏర్పాటవుతున్న జిల్లాలకు అనుగుణంగా  విభజన చేయడానికి ఐజీపీ సౌమ్యమిశ్రాను ప్రభుత్వ నియమించింది. ఏఏ జిల్లాకు ఎంతమంది సిబ్బందిని కేటాయించాలి, కొత్తగా ఠాణా ఏర్పాటు అవశ్యకత, ఇతర అధికారులకు సంబంధించిన నివేదిక రూపొందిస్తారు. ఇప్పటికే ఎస్పీ జోయల్‌డెవిస్‌ నివేదిక సమర్పించారు. తాజాగా ప్రభుత్వం జారీచేసిన నోటిఫికేషన్‌ ప్రకారం... జిల్లాలో ప్రస్తుతం ఉన్న 6 డీఎస్పీలు, 18 సర్కిల్‌ సీఐల కలుపుకుని 29 సీఐ పోస్టులు, 68 ఎస్సై పోలీస్‌స్టేషన్‌ పోస్టులుండగా.. వీటి నుంచి 1 డీఎస్పీ, 4 సీఐ, 11 ఠాణాలు వాటి ఎస్సై పోస్టులు ఇతర జిల్లాలకు వెళ్లిపోతున్నాయి. ఒక సబ్‌ డివిజన్‌తోపాటు నాలుగు కొత్త మండలాలు ఏర్పడుతుండడంతో కొత్తగా ఒక డీఎస్పీ, ఒక సీఐ, నాలుగు ఎస్సై పోస్టులు వచ్చే అవకాశముంది.
     
    జిల్లాకు రెండు డీఎస్పీ పోస్టులు
    ప్రస్తుతం జిల్లాలో 6 డీఎస్పీలు పోస్టులు.. 29 సీఐ పోస్టులు, 68 ఠాణాలున్నాయి. వీటి నుంచి ఒక్క జిల్లాకు రెండు డీఎస్పీ పోస్టులు వస్తున్నాయి. ప్రస్తుతం జగిత్యాల సబ్‌డివిజన్‌ డీఎస్పీలో 5 సీఐ పోస్టులుండగా.. 16 ఎస్సై పోస్టులున్నాయి. కరీంనగర్‌ సబ్‌డివిజన్‌ డీఎస్పీ పరిధిలో 7 సీఐ, 12 ఎస్సై పోస్టులున్నాయి. పెద్దపల్లి పరిధిలో 3 సీఐ, 11 ఎస్సై, గోదావరిఖని పరిధిలో 6 సీఐ, 11 ఎస్సై, సిరిసిల్ల డీఎస్పీ పరిధిలో 4 సీఐ, 9 ఎస్సై పోస్టులున్నాయి. ఇవి కాకుండా సీసీఎస్, ఎస్‌బీ, డీసీఆర్‌బీ, ఎస్పీ అటాచ్డ్‌గా మొత్తం 49 మందికిపైగా సీఐలు ఉండగా, వివిధ విభాగాల్లో 130 మందికిపైగా ఎస్సైలు ఉన్నారు.  
     
    1 డీఎస్పీ, 4 సీఐ, 11 ఎస్సై పోస్టులు అవుట్‌.. 
    ప్రస్తుతం ఉన్న 6 డీఎస్పీ, 29 సీఐ, 68 ఎస్సై పోస్టుల్లో ఒక డీఎస్పీ, 4 సీఐ, 11 ఎస్సై పోస్టులు ఇతర జిల్లాలకు వెళ్లిపోతున్నాయి. ప్రస్తుతం ఉన్న డీఎస్పీ సబ్‌ డివిజన్ల నుంచి హుజూరాబాద్‌ సబ్‌ డివిజన్‌ హన్మకొండలో కలుస్తోంది. కొత్తగా మెట్‌పల్లికి డీఎస్పీ పోస్టు వచ్చే అవకాశముంది.
    –హుజూరాబాద్‌ డీఎస్పీ పరిధిలోని హుజూరాబాద్, జమ్మికుంట సీఐ స్థానాలు, హుజూరాబాద్, కమలాపూర్, జమ్మికుంట, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి ఎస్సై ఠాణాలు హన్మకొండలో కలుస్తున్నాయి.
    –సిద్దిపేట జిల్లాలోకి హుజూరాబాద్‌ డీఎస్పీ పరిధిలోని హుస్నాబాద్‌ సీఐ పోస్టుతోపాటు హుస్నాబాద్, కోహెడ, సిరిసిల్ల డీఎస్పీ పరిధిలోని ముస్తాబాద్, ఇల్లంతకుంట ఎస్సై పోస్టులు వెళ్తున్నాయి. 
    – గోదావరిఖని డీఎస్పీ పరిధిలోని కాటారం సీఐ స్థానంతోపాటు మహదేవపూర్, కాటారం, మల్హార్, మహాముత్తారం ఎస్సై స్థానాలు భూపాలపల్లి జిల్లాలోకి వెళ్లనున్నాయి. 
    – ఇతర జిల్లా నుంచి జిల్లాకు ఒక్క ఠాణా కూడా రావడం లేదు. కొత్తగా కరీంనగర్‌ రూరల్, కొత్తపల్లి, ఇల్లందకుంట, అంతర్గాం మండలాలు ఏర్పడితే ఇక్కడ  ఒక సీఐ, నాలుగు ఎస్సై పోస్టులు పెరిగే అవకాశముంది. 
     
    అయా జిల్లాలోని ఠాణాలు, పోస్టులు....
    జగిత్యాల జిల్లాలో 
    డీఎస్పీ పోస్టులు–02, జగిత్యాల, మెట్‌పల్లి(కొత్తది)
    సీఐ పోస్టులు– 05 జగిత్యాల, జగిత్యాల రూరల్, కోరుట్ల, ధర్మపురి, మెట్‌పల్లి.
    ఎస్సై ఠాణాలు, పోస్టులు–17, జగిత్యాల, జగిత్యాల రూరల్, జగిత్యాల ట్రాఫిక్, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్, సారంగపూర్, ధర్మపురి, పెగడపల్లి, గొల్లపల్లి, మల్యాల, కొడిమ్యాల, వెల్గటూర్, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, మేడిపల్లి, కథలాపూర్‌  
     
    పెద్దపల్లి జిల్లాలో...
    డీఎస్పీ పోస్టులు– 02, పెద్దపల్లి, గోదావరిఖని
    సీఐ పోస్టులు– 07, పెద్దపల్లి, సుల్తానాబాద్, రామగుండం, రామగుండం ట్రాఫిక్, గోదావరిఖని వన్‌టౌన్, గోదావరిఖని టుటౌన్, మంథని
    ఎస్సై ఠాణాలు, పోస్టులు– 16, పెద్దపల్లి, గోదావరిఖని వన్‌టౌన్, టుటౌన్,  బసంతనగర్, సుల్తానాబాద్, ఎన్టీపీసీ, పొత్కపల్లి, జూలపల్లి, ధర్మారం, రామగుండం, రామగుండం ట్రాఫిక్, కాల్వశ్రీరాంపూర్, కమాన్‌పూర్, మంథని, ముత్తారం, అంతర్గాం(కొత్తది)
     
    కరీంనగర్‌ జిల్లాలో
    డీఎస్పీ పోస్టులు–02, కరీంనగర్, సిరిసిల్ల
    సీఐ పోస్టులు– 13, కరీంనగర్‌ వన్‌టౌన్, టుటౌన్, త్రిటౌన్, ట్రాఫిక్, కరీంనగర్‌ మహిళా ఠాణా, సీసీఎస్, కరీంనగర్‌ రూరల్, తిమ్మాపూర్, సిరిసిల్ల టౌన్, సిరిసిల్ల రూరల్, వేములవాడ, వేములవాడ రూరల్, చొప్పదండి
    ఎస్సై ఠాణాలు, పోస్టులు–27, కరీంనగర్‌ వన్‌టౌన్, టూటౌన్, త్రీటౌన్, ట్రాఫిక్, కరీంనగర్‌ మహిళా ఠాణా, సీసీఎస్, కరీంనగర్‌ రూరల్, ఎల్‌ఎండీ, బెజ్జంకి, మానకొండూర్, గంగాధర, రామడుగు, చొప్పదండి, సైదాపూర్, చిగురుమామిడి, వీణవంక, శంకరపట్నం, సిరిసిల్ల టౌన్, గంభీరావుపేట, వేములవాడ, చందుర్తి, బోయినపల్లి, ఎల్లారెడ్డిపేట, కోనరావుపేట, కొత్తవి...కరీంనగర్‌ రూరల్, కొత్తపల్లి, ఇల్లందకుంట
    ఇవి కాకుండా ఆయా జిల్లాలో ఎస్‌బీ, డీసీఆర్‌బీ, పీసీఆర్, హెడ్‌క్వార్టర్‌కు సంబంధించిన పలు డీఎస్పీ, సీఐ, ఎస్సై పోస్టులుంటాయి. 
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement