three districts
-
రుణమో.. రామచంద్రా !
మూడు జిల్లాల్లో నిలిచిన ఎస్‌హెచ్‌జీ రుణాలు 2016–17లో ఇవ్వాల్సింది రూ.763.54 కోట్లు నవంబర్ నాటికి చెల్లించింది రూ.234.22 కోట్లే.. ఇంకా 33,324 సంఘాల ఎదురుచూపులు.. బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు క్యాష్‌లెస్ లావాదేవీల నేపథ్యంలో కొత్త తిప్పలు సంఘాల తీర్మానంతోనే రుణాలు ఇవ్వాలని గ్రామీణాభివృద్ధి సంస్థ ఆదేశాలు నల్లగొండ : మహిళా స్వయం సహాయక సంఘాల రుణాలకు బ్రేక్ పడింది. పెద్ద నోట్ల రద్దు వలలో చిక్కుకుని మహిళా సంఘాలు కొట్టుమిట్టాడుతున్నాయి. 2016–17 ఆర్థిక సంవత్సరానికి గాను సంఘాలకు చెల్లించాల్సిన లింకేజీ రుణాలను బ్యాంకులు నిలిపేశాయి. గ్రామీణ ప్రాంతాల్లో మ హిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించి.. వారిని అన్ని రంగాల్లో బలోపేతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం వడ్డీ లేని రుణాలను అందిస్తోంది. ప్రతి ఏడాది ఏప్రిల్ నుంచి బ్యాంకుల ద్వారా మహిళా సంఘాలకు రుణాలు మంజూరవుతుంటాయి. అదే పద్ధతిలో ఈ ఏడాది కూడా రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు సిద్ధమయ్యాయి. అప్పటికే జిల్లాల పునర్విభజనలో అధికార యంత్రాంగం బిజీగా ఉండటంతో రుణాలివ్వడంలో బ్యాంకులు వెనుకంజ వేశాయి. దీంతోపాటు ప్రభుత్వం విడుదల చేయాల్సిన పావలా వడ్డీ రాయితీ కూడా బ్యాంకుల్లో జమ కాలేదు. ఈ క్రమంలో బ్యాంకర్లు రుణాలు ఇవ్వకుండా మొండికేశారు. ఇదే క్రమంలో కేంద్రం పెద్ద నోట్లు రద్దు చేయడంతో రుణాల మంజూరు ఎక్కడికక్కడే నిలిచిపోయింది. ఇదీ పరిస్థితి.... 2016–17కుగాను నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో 43,825 సంఘాలకు రూ. 763.54 కోట్లు రుణ లక్ష్యాన్ని నిర్ధేశించారు. ఈ మేరకు అక్టోబర్ మాసాంతానికి కేవలం 10 ,501 సంఘాలకు రూ.234.22 కోట్లు మంజూరు చేశారు. నిర్ధారించిన లక్ష్యం ప్రకారం బ్యాంకులు నవంబర్ నాటికి 21,898 సంఘాలకు రూ.397.61 కోట్ల రుణాలు ఇవ్వాల్సి ఉంది. కానీ.. పది వేల సంఘాలకు మాత్రమే రుణాలు ఇచ్చాయి. దీంతో 33,324 సంఘాలు రుణాల కోసం ఎదురుచూస్తున్నాయి. మండలాల వారీగా ఇలా.. నల్లగొండ జిల్లాలోని చండూరు మండలంలో 737 సంఘాలకు రూ.15.21 కోట్ల రుణం ఇవ్వాల్సి ఉండగా.. కేవలం 85 సంఘాలకు రూ.3.47 కోట్లు ఇచ్చారు. మిర్యాలగూడ మండలంలో 1,338 సంఘాలకు రూ.26.14 కోట్లు ఇవ్వాల్సి ఉంది. 387 సంఘాలకు రూ.11.28 కోట్లు మాత్రమే చెల్లించారు. సూర్యాపేట జిల్లాలోని నేరేడుచర్ల మండలంలో 1313 సంఘాలకు రూ.21.93 కోట్ల రుణాలు ఇవ్వాలి. 262 సంఘాలకు రూ.7.11 కోట్లు మాత్రమే ఇచ్చారు. చివ్వెంల మండలంలో 765 సంఘాలకు రూ.13.90 కోట్లు ఇవ్వాల్సి ఉండగా.. 69 సంఘాలకు రూ.2.15 కోట్లు ఇచ్చారు. యాదాద్రి జిల్లాలోని ఆలేరు మండలంలో 783 సంఘాలకు రూ.12.49 కోట్లు రుణాలు ఇవ్వాలని నిర్దేశించగా.. 166 సంఘాలకు రూ.3.59 కోట్లు మాత్రమే పంపిణీ చేశారు. వలిగొండ మండలంలో 1,049 సంఘాలకు రూ.18.59 కోట్లు ఇవ్వాల్సి ఉండగా.. 255 సంఘాలకు రూ.7.19 కోట్లు చెల్లించారు. తీర్మానం తప్పనిసరి.. రుణాలు రాక సంఘాలు సతమవుతున్న పరిస్థితుల్లో నగదు రహిత లావాదేవీలు ప్రోత్సహి ంచడం కోసం చేపట్టిన చర్యలు సంఘాలను మరింత ఇబ్బందుల పాల్జేస్తున్నాయి. సంఘం లోని ప్రతి సభ్యురాలికి బ్యాంకు ఖాతా, ఏటీఎం కార్డు ఉంటే తప్ప రుణం ఇచ్చే పరిస్థితి లే కుండా పోయింది. బ్యాంకు ఖాతా, ఏటీఎం కార్డు, చెక్కుబుక్కు కలిగిన సంఘ సభ్యురాలికి మాత్రమే రుణం ఇవ్వాలని అధికారులు ఆదేశించారు. గతంలో రుణం మంజూరైన సంఘం బ్యాంకుకు వెళ్లి ఆ మొత్తాన్ని డ్రా చేసి సభ్యులకు పంచడం చేసేవారు. ప్రస్తుతం నగదు ర హిత లావాదేవీల వైపు మహిళా సంఘాలను మళ్లించాలన్న నిర్ణయంతో కొత్త నిబంధన వి ధించారు. రుణ మంజూరు పొందిన సంఘం సభ్యుల ఆమోదంతో తప్పనిసరిగా తీర్మానం చేయాలి. ఈ పత్రాన్ని బ్యాంకులకు అందజేయాలి. తీర్మాన పత్రంలో సభ్యుల బ్యాంకు ఖాతా నంబర్లు రాయాలి. దీంతో బ్యాంకర్లు రుణ మొత్తాన్ని సభ్యుల ఖాతాల్లో జమ చేస్తారు. ఆ తర్వాత సభ్యులు ఏటీఎం నుంచి నగదు పొందాలి. సభ్యులు మరొకరి ఖాతాల్లోకి నగదు బదిలీ చేయాల్సిన పరిస్థితి వస్తే చెక్కులు ఉపయోగించుకోవాలి. మొత్తంగా ఇక ముందు బ్యాంకుల నుంచి రుణాలు పొందే సంఘాలు నగదు రహిత లావాదేవీలనే కొనసాగించాలి. ఈ మేరకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ క్షేత్రస్థాయిలో సీసీలకు, ఏపీఎంలకు ఉత్తర్వులు జారీ చేసింది. మూడు మాసాలే గడువు... ఆర్థిక సంవత్సరం మరో మూడు మాసాల్లో ముగియనుంది. ఈ మూడు నెలల్లో బ్యాంకులు 33,324 సంఘాలకు రూ.529.32 కోట్లు రుణం ఇవ్వాల్సి ఉంది. నోట్ల రద్దు సమస్య నుంచి బ్యాంకులు ఇంకా కోలుకోలేదు. పూర్తిస్థాయిలో బ్యాంకులకు నగదు నిల్వలు చేరుకోలేదు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఇంత స్వల్ప వ్యవధిలో బ్యాంకులు ఏమేరకు రుణ లక్ష్యాన్ని పూర్తిచేస్తాయో వేచిచూడాల్సిందే. -
మూడు జిల్లాల పరిధిలో ‘మాడా’
46 గ్రామాలకే పరిమితమైన మానుకోట మైదాన ప్రాంత గిరిజన అభివృద్ధి సంస్థ ఐటీడీఏ ఏర్పాటు చేయాలని గిరిజనుల విజ్ఞప్తి మహబూబాబాద్ : మానుకోట జిల్లాగా ఏర్పడుతున్న నేపథ్యంలో మానుకోటలోని మాడా (మైదాన ప్రాంత గిరిజన అభివృద్ధి సంస్థ) మూడు జిల్లాల పరిధిలోకి వెళ్లనుంది. మానుకోట పట్టణంలోని మాడా సహాయ ప్రాజెక్టు అధికారి కార్యాలయం పరిధిలో ప్రస్తుతం 15 మండలాలు ఉన్నాయి. చెన్నారావుపేట, దేవరుప్పుల, డోర్నకల్, గూడూరు, కేసముద్రం, కొడకండ్ల, కురవి, మహబూబాబాద్, మరిపెడ, నర్సింహులపేట, నెక్కొండ, నెల్లికుదురు, పాలకుర్తి, పర్వతగిరి, రాయపర్తి మండలాల్లోని 68 గ్రామాలు ఇందులో ఉన్నాయి. ఇతర జిల్లాల పరిధిలోకి Ðð ళ్లిన గ్రామాలు.. కొడకండ్ల మండలంలోని రెండు గ్రామాలు, పాలకుర్తిలోని ఒక గ్రామం, దేవరుప్పల మండలంలోని రెండు గ్రామాలు మొత్తం 5 గ్రామాలు హన్మకొండ జిల్లాలో చేర్చనున్నారు. పర్వతగిరి మండలంలోని మూడు గ్రామాలు, రాయపర్తిలోని మూడు గ్రామాలు, చెన్నారావుపేట మండలంలోని మూడు గ్రామాలు, నెక్కొండ మండలంలోని 8 గ్రామాలు వరంగల్ జిల్లాలోకి వెళ్లనున్నాయి. కార్యాలయం పరిధిలో 68 గ్రామాలు ఉండగా 22 గ్రామాలు ఇతర జిల్లాల పరిధిలోకి వెళ్లాయి. ప్రస్తుతం 46 గ్రామాలు మాత్రమే మిగిలాయి. కొత్తగూడ, గార్ల, బయ్యారం మండలాలను మాడా పరిధిలో చేర్చారు. గతంలో కార్యాలయం పరిధిలో ఉన్న గూడూరు మండలం, మానుకోట మండలంలోని రెడ్యాల గ్రామం ఏజెన్సీ పరిధిలోనే ఉన్నాయి. మాడా కార్యాలయంలో అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్, మేనేజర్, ఒక సీనియర్ అసిస్టెంట్, ఒక జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, వాచ్మెన్, అటెండర్ పోస్టులున్నాయి. 50 శాతం గిరిజన జనాభా ఉంటే 1977వ సంవత్సరంలో మాడా ఏర్పాటు చేశారు. మాడా కార్యక్రమాలు.. మాడా పరిధిలో ప్రధానంగా వ్యవసాయం, పశుసంవర్థక శాఖ, ఇరిగేషన్, చిన్న తరహా పరిశ్రమలకు సంబంధించిన సెల్ఫ్ డెవల ప్మెంట్ స్కీంలు, రుణాలు ఇవ్వడం జరిగింది. గత సంవత్సరం మానుకోట మాడా పరిధిలో 10 కోట్ల రుణాలు ఇచ్చారు. రూ. లక్షకు 80 వేల సబ్సిడీ, రూ.2 లక్షలకు 70 వేలు, రూ. 5 లక్షలకు 60 వేలు, రూ.10 లక్షలకు 50 వేల సబ్సిడీ చొప్పున రుణాలను అందజేశారు. మానుకోట పరిధి నుంచి విడిపోయిన గ్రామాలకు రుణాలు, ఇతర విషయాల్లో ఇబ్బందులు తలెత్తే పరిస్థితి ఉంది. ఐటీడీఏగా అప్‌గ్రేడ్ చేస్తేనే అభివృద్ధి.. మానుకోట మాడా పరిధిలో ఏజెన్సీ మండలాలు ఎక్కువగా ఉన్నాయి. కొత్తగూడ, గార్ల, బయ్యారం మాడా పరిధిలోకి వచ్చాయి. ఇల్లందు మండలాన్ని కూడా మానుకోట జిల్లాలోకి చేర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం బయ్యారంలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తే దాని నుంచి వచ్చే ఆదాయంలో 20 శాతం గిరిజనుల అభివృద్ధి కోసం కేటాయించాల్సి ఉంటుంది. అది ఐటీడీఏ ఏర్పాటు అయితేనే సాధ్యమవుతుందని సంబంధిత అధికారులు అంటున్నారు. మాడాను అప్‌గ్రేడ్ చేసి అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్‌కు డెవలప్మెంట్ ఆఫీసర్‌గా (డీఓగా) పదోన్నతి కల్పించి ఐటీడీఏ పీఓ ఆధీనంలో పనిచేసే విధంగా అధికార యంత్రాంగం చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా మానుకోట మాడాను ఐటీడీఏగా మారిస్తేనే ఈ ప్రాంతం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని గిరిజనులు అభిప్రాయపడుతున్నారు. -
పోలీస్‌శాఖ విభజనకు కసరత్తు
హుజూరాబాద్ అవుట్ .. మెట్పల్లి ఇన్ ఒక్కో జిల్లాకు రెండు డీఎస్పీ పోస్టులు ప్రస్తుతం 6 డీఎస్పీ, 29 సీఐ, 68 ఎస్సై పోస్టులు 1 డీఎస్పీ, 4 సీఐ, 11 ఎస్సై పోస్టులు అవుట్ 1 డీఎస్పీ, 1 సీఐ, 4 ఎస్సై పోస్టులు ఇన్ కరీంనగర్ క్రైం : జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా కరీంనగర్ జిల్లాను కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలుగా విభజిస్తుండడంతో పోలీస్ శాఖలో కూడా మార్పులు జరుగనున్నాయి. కొత్తగా ఏర్పాటవుతున్న జిల్లాలకు అనుగుణంగా విభజన చేయడానికి ఐజీపీ సౌమ్యమిశ్రాను ప్రభుత్వ నియమించింది. ఏఏ జిల్లాకు ఎంతమంది సిబ్బందిని కేటాయించాలి, కొత్తగా ఠాణా ఏర్పాటు అవశ్యకత, ఇతర అధికారులకు సంబంధించిన నివేదిక రూపొందిస్తారు. ఇప్పటికే ఎస్పీ జోయల్‌డెవిస్ నివేదిక సమర్పించారు. తాజాగా ప్రభుత్వం జారీచేసిన నోటిఫికేషన్ ప్రకారం... జిల్లాలో ప్రస్తుతం ఉన్న 6 డీఎస్పీలు, 18 సర్కిల్ సీఐల కలుపుకుని 29 సీఐ పోస్టులు, 68 ఎస్సై పోలీస్‌స్టేషన్ పోస్టులుండగా.. వీటి నుంచి 1 డీఎస్పీ, 4 సీఐ, 11 ఠాణాలు వాటి ఎస్సై పోస్టులు ఇతర జిల్లాలకు వెళ్లిపోతున్నాయి. ఒక సబ్ డివిజన్‌తోపాటు నాలుగు కొత్త మండలాలు ఏర్పడుతుండడంతో కొత్తగా ఒక డీఎస్పీ, ఒక సీఐ, నాలుగు ఎస్సై పోస్టులు వచ్చే అవకాశముంది. జిల్లాకు రెండు డీఎస్పీ పోస్టులు ప్రస్తుతం జిల్లాలో 6 డీఎస్పీలు పోస్టులు.. 29 సీఐ పోస్టులు, 68 ఠాణాలున్నాయి. వీటి నుంచి ఒక్క జిల్లాకు రెండు డీఎస్పీ పోస్టులు వస్తున్నాయి. ప్రస్తుతం జగిత్యాల సబ్‌డివిజన్ డీఎస్పీలో 5 సీఐ పోస్టులుండగా.. 16 ఎస్సై పోస్టులున్నాయి. కరీంనగర్ సబ్‌డివిజన్ డీఎస్పీ పరిధిలో 7 సీఐ, 12 ఎస్సై పోస్టులున్నాయి. పెద్దపల్లి పరిధిలో 3 సీఐ, 11 ఎస్సై, గోదావరిఖని పరిధిలో 6 సీఐ, 11 ఎస్సై, సిరిసిల్ల డీఎస్పీ పరిధిలో 4 సీఐ, 9 ఎస్సై పోస్టులున్నాయి. ఇవి కాకుండా సీసీఎస్, ఎస్బీ, డీసీఆర్బీ, ఎస్పీ అటాచ్డ్గా మొత్తం 49 మందికిపైగా సీఐలు ఉండగా, వివిధ విభాగాల్లో 130 మందికిపైగా ఎస్సైలు ఉన్నారు. 1 డీఎస్పీ, 4 సీఐ, 11 ఎస్సై పోస్టులు అవుట్.. ప్రస్తుతం ఉన్న 6 డీఎస్పీ, 29 సీఐ, 68 ఎస్సై పోస్టుల్లో ఒక డీఎస్పీ, 4 సీఐ, 11 ఎస్సై పోస్టులు ఇతర జిల్లాలకు వెళ్లిపోతున్నాయి. ప్రస్తుతం ఉన్న డీఎస్పీ సబ్ డివిజన్ల నుంచి హుజూరాబాద్ సబ్ డివిజన్ హన్మకొండలో కలుస్తోంది. కొత్తగా మెట్‌పల్లికి డీఎస్పీ పోస్టు వచ్చే అవకాశముంది. –హుజూరాబాద్ డీఎస్పీ పరిధిలోని హుజూరాబాద్, జమ్మికుంట సీఐ స్థానాలు, హుజూరాబాద్, కమలాపూర్, జమ్మికుంట, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి ఎస్సై ఠాణాలు హన్మకొండలో కలుస్తున్నాయి. –సిద్దిపేట జిల్లాలోకి హుజూరాబాద్ డీఎస్పీ పరిధిలోని హుస్నాబాద్ సీఐ పోస్టుతోపాటు హుస్నాబాద్, కోహెడ, సిరిసిల్ల డీఎస్పీ పరిధిలోని ముస్తాబాద్, ఇల్లంతకుంట ఎస్సై పోస్టులు వెళ్తున్నాయి. – గోదావరిఖని డీఎస్పీ పరిధిలోని కాటారం సీఐ స్థానంతోపాటు మహదేవపూర్, కాటారం, మల్హార్, మహాముత్తారం ఎస్సై స్థానాలు భూపాలపల్లి జిల్లాలోకి వెళ్లనున్నాయి. – ఇతర జిల్లా నుంచి జిల్లాకు ఒక్క ఠాణా కూడా రావడం లేదు. కొత్తగా కరీంనగర్ రూరల్, కొత్తపల్లి, ఇల్లందకుంట, అంతర్గాం మండలాలు ఏర్పడితే ఇక్కడ ఒక సీఐ, నాలుగు ఎస్సై పోస్టులు పెరిగే అవకాశముంది. అయా జిల్లాలోని ఠాణాలు, పోస్టులు.... జగిత్యాల జిల్లాలో డీఎస్పీ పోస్టులు–02, జగిత్యాల, మెట్పల్లి(కొత్తది) సీఐ పోస్టులు– 05 జగిత్యాల, జగిత్యాల రూరల్, కోరుట్ల, ధర్మపురి, మెట్పల్లి. ఎస్సై ఠాణాలు, పోస్టులు–17, జగిత్యాల, జగిత్యాల రూరల్, జగిత్యాల ట్రాఫిక్, కోరుట్ల, మెట్పల్లి, రాయికల్, సారంగపూర్, ధర్మపురి, పెగడపల్లి, గొల్లపల్లి, మల్యాల, కొడిమ్యాల, వెల్గటూర్, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, మేడిపల్లి, కథలాపూర్ పెద్దపల్లి జిల్లాలో... డీఎస్పీ పోస్టులు– 02, పెద్దపల్లి, గోదావరిఖని సీఐ పోస్టులు– 07, పెద్దపల్లి, సుల్తానాబాద్, రామగుండం, రామగుండం ట్రాఫిక్, గోదావరిఖని వన్‌టౌన్, గోదావరిఖని టుటౌన్, మంథని ఎస్సై ఠాణాలు, పోస్టులు– 16, పెద్దపల్లి, గోదావరిఖని వన్‌టౌన్, టుటౌన్, బసంతనగర్, సుల్తానాబాద్, ఎన్టీపీసీ, పొత్కపల్లి, జూలపల్లి, ధర్మారం, రామగుండం, రామగుండం ట్రాఫిక్, కాల్వశ్రీరాంపూర్, కమాన్‌పూర్, మంథని, ముత్తారం, అంతర్గాం(కొత్తది) కరీంనగర్ జిల్లాలో డీఎస్పీ పోస్టులు–02, కరీంనగర్, సిరిసిల్ల సీఐ పోస్టులు– 13, కరీంనగర్ వన్‌టౌన్, టుటౌన్, త్రిటౌన్, ట్రాఫిక్, కరీంనగర్ మహిళా ఠాణా, సీసీఎస్, కరీంనగర్ రూరల్, తిమ్మాపూర్, సిరిసిల్ల టౌన్, సిరిసిల్ల రూరల్, వేములవాడ, వేములవాడ రూరల్, చొప్పదండి ఎస్సై ఠాణాలు, పోస్టులు–27, కరీంనగర్ వన్‌టౌన్, టూటౌన్, త్రీటౌన్, ట్రాఫిక్, కరీంనగర్ మహిళా ఠాణా, సీసీఎస్, కరీంనగర్ రూరల్, ఎల్ఎండీ, బెజ్జంకి, మానకొండూర్, గంగాధర, రామడుగు, చొప్పదండి, సైదాపూర్, చిగురుమామిడి, వీణవంక, శంకరపట్నం, సిరిసిల్ల టౌన్, గంభీరావుపేట, వేములవాడ, చందుర్తి, బోయినపల్లి, ఎల్లారెడ్డిపేట, కోనరావుపేట, కొత్తవి...కరీంనగర్ రూరల్, కొత్తపల్లి, ఇల్లందకుంట ఇవి కాకుండా ఆయా జిల్లాలో ఎస్బీ, డీసీఆర్బీ, పీసీఆర్, హెడ్‌క్వార్టర్‌కు సంబంధించిన పలు డీఎస్పీ, సీఐ, ఎస్సై పోస్టులుంటాయి. -
మెతుకుసీమ మురిసే
మెదక్ ఇకపై మూడు జిల్లాలు నెరవేరిన దశాబ్దాల కల సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాలు కొత్తగా నాలుగు రెవెన్యూ డివిజన్లు అదనంగా నాలుగు కొత్త మండలాలు ముసాయిదాను విడుదల చేసిన ప్రభుత్వం నేటి నుంచి సలహాలు, అభ్యంతరాల స్వీకరణ మెదక్, సిద్దిపేటలో అంబరాన్నంటిన సంబురాలు సాక్షి, సంగారెడ్డి: దశాబ్దాల కలలు నెరవేరాయి.. ప్రజల మనోభీష్టం మేరుకు ప్రభుత్వం కొత్త జిల్లాలకు తుదిరూపునిచ్చింది. మెదక్ జిల్లాను విభజించి కొత్తగా సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాలు ఏర్పాటుకు ఆమోదముద్ర వేసింది. జిల్లాల పునర్విభజనకు సంబంధించి సోమవారం ముసాయిదాను విడుదల చేసింది. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. 23 మండలాలతో సంగారెడ్డి పెద్ద జిల్లాగా అవతరించనుంది. 14 మండలాలతో మెదక్ జిల్లా కొనసాగనుంది. 19 మండలాలతో కొత్తగా సిద్దిపేట జిల్లా ఏర్పాటు కానుంది. కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. కొత్తగా ఏర్పాటుకానున్న సిద్దిపేట, మెదక్‌లో సంబరాలు అంబరాన్నంటాయి. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ శ్రేణుల్లో సంబరాల్లో పాల్గొన్నాయి. మెదక్‌లో జరిగిన వేడుకల్లో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు. ప్రజలతో కలిసి నృత్యం చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు మిఠాయిలు పంచిపెట్టారు. సిద్దిపేటలో సైతం ప్రజలు, టీఆర్ఎస్ నాయకులు వేడుకలు జరుపుకున్నారు. ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు వేడుకల్లో పాల్గొన్నారు. నారాయణఖేడ్, జహీరాబాద్ డివిజన్లుగా ఏర్పడనుండటంతో ప్రజలు సంబరాలు చేసుకున్నారు. ఎంపీ బీబీ పాటిల్ వేడుకల్లో పాలుపంచుకున్నారు. ఇదిలా ఉంటే కొత్త జిల్లాల ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం విడుదల చేసిన ముసాయిదాపై కలెక్టరేట్లో అధికారులు అన్ని వర్గాల నుంచి సలహాలు, సూచనలు, అభ్యంతరాలు స్వీకరించనున్నారు. ఇందుకోసం కలెక్టరేట్లో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయనున్నారు. ఎట్టకేలకు నెరవేరిన కల దశాబ్దాల కలను ప్రభుత్వం నిజం చేసింది. సిద్దిపేట జిల్లా ఏర్పాటు చేయాలని అక్కడి ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. అలాగే మెదక్ ప్రజలు సైతం జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. జిల్లాల పునర్విభజనలో భాగంగా ప్రభుత్వం మెదక్ జిల్లాను విభజించి సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాలను ఏర్పాటు చేస్తూ సోమవారం ముసాయిదాను వెలువరించింది. సిద్దిపేట జిల్లాలో వరంగల్ జిల్లాకు చెందిన చేర్యాల్, మద్దూరు విలీనం కానుండగా కరీంనగర్ జిల్లాలోని కోహెడ, హుస్నాబాద్ మండలాలు విలీనం కానున్నాయి. అలాగే సిరిసిల్ల నియోజకవర్గానికి చెందిన ముస్తాబాద్, ఇల్లంతకుంట మండలాలు సిద్దిపేటలో విలీనం చేయనున్నారు. జిల్లాల ఏర్పాటులో భాగంగా ప్రస్తుతం ఉన్న రెవెన్యూ డివిజన్లకు అదనంగా నాలుగు కొత్త రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రతిపాదిత సంగారెడ్డి జిల్లాలో కొత్తగా జహీరాబాద్, నారాయణఖేడ్ రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయనున్నారు. అలాగే మెదక్ జిల్లాలో తూప్రాన్, సిద్దిపేట జిల్లాలో గజ్వేల్ రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు కానున్నాయి. ఇదిలా ఉంటే నర్సాపూర్ నియోజవకర్గంలోని కౌడిపల్లిని తూప్రాన్ రెవెన్యూ డివిజన్లో కలపటం పట్ల అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. కొత్తగా నాలుగు మండలాలు.. జిల్లాలోని పలు మండలాలను ప్రభుత్వం పునర్విభజించింది. ప్రతిపాదిత మూడు జిల్లాలో కొత్తగా నాలుగు మండలాలను ఏర్పాటు చేయనుంది. సంగారెడ్డి జిల్లాలో నూతనంగా సిర్గాపూర్, అమీన్పూర్, గుమ్మడిదల మండలాలు ఏర్పాటు కానున్నాయి. సిద్దిపేట జిల్లాలో కొత్తగా సిద్దిపేట రూరల్ మండలం ఏర్పాటు కానుంది. ప్రస్తుతం ఉన్న మండలాల నుంచి కొన్ని గ్రామాలను విభజించి కొత్త మండలాలను ఏర్పాటు చేస్తున్నందున్న మండలాల స్వరూపం మారనుంది. కాగా, మెదక్ జిల్లాలో ఏ ఒక్క కొత్త మండలం ఏర్పాటు కావటంలేదు. నిజామాబాద్ జిల్లాలోని నాగిరెడ్డిపేట మండలాన్ని విలీనం చేయాలని భావించినప్పటికీ విలీనం చేయలేదు. నిజామాబాద్ జిల్లా నేతలను నాగిరెడ్డిపేట మండలం విలీనంను గట్టిగా వ్యతిరేకించినందవల్లే ప్రభుత్వం విలీనం వైపు మొగ్గుచూపలేదని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ప్రతిపాదిత కొత్త మండలాల జాబితాలో ఉన్న కంది, హవేలిఘనపురం, నారాయణరావుపేట మండలాల ఏర్పాటుకు సైతం ప్రభుత్వం మొగ్గుచూపలేదు. ప్రస్తుతం ఉన్న సంగారెడ్డి మండలాన్ని కంది రూరల్ మండలంగా ఏర్పాటు చేయాలని భావించినప్పటికీ డ్రాప్టు నోటిఫికేషన్లో కంది మండలం ఏర్పాటను మినహాయించారు. కంది స్థానంలో నారాయణఖేడ్ నియోజకవర్గంలో సిర్గాపూర్ మండలాన్ని ఏర్పాటు చేయనున్నారు. కల్హేర్ మండలంలోని 9, కంగ్టి మండలంలోని 10, నారాయణఖేడ్ మండలంలోని రెండు గ్రామాలను కలుపుతూ కొత్తగా సిర్గాపూర్ మండలాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. అలాగే పటాన్చెరు మండలంలోని 11 గ్రామాలతో కొత్తగా అమీన్పూర్ మండలాన్ని ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం 34 గ్రామాలతో జిన్నారం మండలం ఉండగా అందులోని 13 మండలాలను విభజించి కొత్తగా గుమ్మడిదల మండలం ఏర్పాటు కానుంది. ఇక సిద్దిపేట జిల్లాలో కొత్తగా సిద్దిపేట రూరల్, నారాయణరావుపేట మండలాల ఏర్పాటు ప్రతిపాదన ఉండగా ప్రభుత్వం కేవలం కొత్తగా సిద్దిపేట రూరల్ మండలాన్ని ఏర్పాటుకు చేయనుంది. ప్రతిపాదిత నారాయణరావుపేట మండలం ఏర్పాటుకు ప్రభుత్వం మొగ్గుచూపలేదు. ఇదిలా ఉంటే సీఎం స్వగ్రామమైన చింతమడకను మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ ఉంది. అయితే చింతమడకను మండలంగా ఏర్పాటు చేయలేదు. దీంతో అక్కడి ప్రజలు నిరసనలు వ్యక్తం చేశారు. -
ఉత్తమ అవార్డు దిశగా..
టెస్టింగ్ క్యాంపులో స్కౌట్స్ అండ్ గైడ్స్ సత్తా ఐదు రోజుల శిక్షణ మూడు జిల్లాల విద్యార్థులు హాజరు గోదావరిఖనిటౌన్: క్రమశిక్షణకు మారు పేరు స్కౌట్స్ అండ్ గైడ్స్. వీరిని కూడా మరింత ఉత్తములుగా తీర్చిందిద్దేందుకు ఏటా క్యాంపులు నిర్వహిస్తుంటారు. అలాంటి క్యాంపు ఈ ఏడాది గోదావరిఖనిలో నిర్వహిస్తున్నారు. ఐదు రోజుల ఈ క్యాంపులో పాల్గొనేందుకు మెదక్, వరంగల్, కరీంనగర్ జిల్లాల నుంచి ప్రభుత్వ, ప్రై వేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులు వెయ్యిమంది హాజరయ్యారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ సోపాన్‌లో వీరు శిక్షణ పొందుతున్నారు. ఈ శిక్షణలో ఉత్తీర్ణులైన విద్యార్థులు గవర్నర్, రాజ్యపురస్కార్ అవార్డుకు ఎంపిక అవుతారు. అనంతరం రాష్ట్రపతి అవార్డు శిక్షణ ఉంటుంది. ఈ క్యాంపులో నిత్య జీవితంలో ఎలా నడుచుకోవాలో, విద్యార్థులకు ఉండాల్సిన సేవా, ఇతర ముఖ్య అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. నిజజీవితంలో ఎదుర్కొనే కష్టాలను ఎలా అధిగమించాలో నేర్పుతూ ఉత్తమలుగా తయారు చేస్తున్నారు. ఈ క్యాంప్ కోసం రాష్ట్ర, ప్రాంతీయ, స్థానికంగా ఉన్న కౌన్సిలర్స్, మాస్టర్స్, రోవర్స్, ప్రత్యేక శిక్షకులు సుమారు 50 మంది ప్రత్యేక బృందాలుగా శిక్షణ ఇస్తున్నారు. శిక్షణలోని అంశాలు రోప్ నాటింగ్, టవర్ మేకింగ్, జెండా మేకింగ్, అథ్లెటిక్స్, గార్డ్నర్, స్విమ్మింగ్, కుక్, సామాజిక అవగాహన, పరిశుభ్రత, తెలివితేటలు, సేవాభావం, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం, ఆరోగ్య పరిరక్షణ, గ్రామల్లో సేవా, విద్యలో రాణించడం, ఇతర అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. ఈ అంశాలలో ప్రతిభ చాటిన విద్యార్థులకు ప్రత్యేక సర్టిఫికెట్లు అందిస్తారు. రాష్ట్రపతి అవార్డు కోసం శిక్షణ ఏడు నెలల పాటు ప్రథమ, ద్వితీయ, తతీయ సోపాన్‌ల తరువాత గవర్నర్, రాజ్యపురస్కార్ అవార్డును అందుకున్న విద్యార్థులు అనంతరం రాష్ట్రపతి అవార్డుకు అర్హులవుతారు. దీని కోసం ప్రత్యేక పరీక్ష రాయాల్సి ఉంటుంది. స్టేట్బాడీ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన అనంతరం రాష్ట్రపతి అవార్డుకు అర్హత సాధిస్తారు. దీని కోసం మరో మూడు నెలలు ప్రత్యేక శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రపతి అవార్డు పొందిన విద్యార్థులు ప్రతీ పోటీ పరీక్షలో 5 శాతం మార్కులు అదనంగా పొందుతారు. పోటీ పరీక్షలలో, ఉద్యోగ అవకాశాల కోసం రాష్ట్రపతి అవార్డు ఎంతగానో ఉపయోగపడుతుంది. -
జెడ్పీ ఒక్కటే! జిల్లాలు మూడు
♦ పాలకవర్గం సమయం ముగిశాకే కొత్తవి ఏర్పాటు ♦ సర్కార్ యోచన యంత్రాంగం కసరత్తు సాక్షి, సంగారెడ్డి: దసరా నుంచి మూడు జిల్లాలు అమల్లోకి రానున్నప్పటికీ జిల్లా పరిషత్ మాత్రం ఒక్కటే ఉంటున్నట్టు తెలుస్తోంది. జెడ్పీ పాలకవర్గం సమయం ముగిశాకే కొత్త జిల్లాల్లో జెడ్పీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త జిల్లా పరిషత్ ఏర్పాటులో సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున ప్రస్తుత పాలకవర్గం సమయం ముగిశాకే కొత్త జెడ్పీలు ఏర్పాటు చేయనున్నట్లు వినికిడి. జిల్లాల పునర్విభజనలో భాగంగా కొత్తగా మెదక్, సిద్దిపేట జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. దసరా నుంచి కొత్త జిల్లాలో పరిపాలన సాగేలా అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. జిల్లా పరిషత్ చైర్పర్సన్ రాజమణి మురళీయాదవ్ ఆధ్వర్యంలోని పాలకవర్గం జూలై 5, 1014లో పగ్గాలు చేపట్టింది. జిల్లా పరిషత్ పాలకవర్గం సమయం ఇంకా మూడేళ్లు ఉంది. దీంతో పాలకవర్గం సమయం పూర్తిగా ముగిశాకే కొత్త జిల్లాలో జెడ్పీలు ఏర్పాటు కానున్నాయి. ఇందుకు సంబంధించి గతంలో పంచాయతీరాజ్ వ్యవస్థ పునర్వవస్థీకరణను అధికారులు, ప్రజాప్రతినిధులు ఉటంకిస్తున్నారు. గతంలో పంచాయతీ సమితి(బ్లాక్ సమితి)లు ఉండేవి. 1984లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ బ్లాక్ సమితిల స్థానే మండల వ్యవస్థ ఏర్పాటుకు శ్రీకారం చుట్టూరు. అయితే రెవెన్యూ మండలాలను తక్షణం అమల్లోకి తెచ్చిన ఎన్టీఆర్ ప్రభుత్వం బ్లాక్ సమితిలను మాత్రం 1987 ప్రాంతంలో రద్దు చేసి వాటి స్థానంలో మండల ప్రజాపరిషత్‌లను ఏర్పాటు చేసింది. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం కొత్త జిల్లా పరిషత్ ఏర్పాటుకు ప్రభుత్వానికి అధికారాలు ఉన్నప్పటికీ కొత్తగా జిల్లా పరిషత్ ఏర్పాటుకు వల్ల ప్రస్తుతం ఉన్న పాలకవర్గం రద్దు చేసి మూడు జిల్లాల్లో మళ్లీ వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించి పాలకవర్గాలు ఏర్పాటు ఉంటుందని తెలుస్తోంది. దీని వల్ల సమస్యలు తలెత్తవచ్చని గుర్తించిన ప్రభుత్వం జెడ్పీ విభజన వాయిదా వేసినట్లు సమాచారం. అలాగే పంచాయతీరాజ్ శాఖ పరిధిలోకి వచ్చే పంచాయతీ, ఇంజనీరింగ్, మార్కెటింగ్ , సహకారశాఖల విభజన జరగకపోవచ్చని తెలుస్తోంది. సంక్షేమశాఖలన్నింటినీ జెడ్పీ పరిధిలోకి తీసుకువచ్చి కొత్త జిల్లాలో సంక్షేమ కార్యక్రమాల అమలు జెడ్పీ సీఈఓకు అప్పగించాలని యోచిస్తున్నట్లు సమాచారం. కసరత్తు పూర్తి చేసిన అధికారులు విభజనపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనప్పటికీ అధికార యంత్రాంగం మాత్రం జెడ్పీ విభజనకు సంబంధించిన కసరత్తు పూర్తి చేసింది. నూతనంగా ఏర్పాటు కానున్న సిద్దిపేట, మెదక్‌లో కొత్తగా జిల్లా పరిషత్‌ల ఏర్పాటుకు సంబంధించి కార్యాలయాలను గుర్తించారు. సిద్దిపేటలో హౌసింగ్ శాఖకు సంబంధించిన నూతన భవనంలో జిల్లా పరిషత్ కార్యాలయం ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అలాగే మెదక్‌లోని మండల పరిషత్ కార్యాలయం సమీపంలోని స్త్రీ శక్తి భవనాన్ని గుర్తించారు. అలాగే సిబ్బంది విభజన ప్రక్రియను పూర్తి చేశారు. అధికారుల సమాచారం మేరకు కొత్తగా ఏర్పాటయ్యే మెదక్, సిద్దిపేట జిల్లాలో జెడ్పీ కార్యాలయాలు ఏర్పాటు చేసినపక్షంలో కొత్తగా 60 మంది అధికారులు, సిబ్బంది అవసరం అవుతారు. రాబోయే రోజుల్లో పదోన్నతుల ద్వారా, కొత్త పోస్టుల మంజూరు ద్వారా సిబ్బంది నియామకాలు చేపట్టే అవకాశాలున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతానికి అధికారుల కసరత్తును అనుసరించి సంగారెడ్డిలో ఉన్న జెడ్పీ సీఈఓ ఇక్కడే కొనసాగుతారు. డిప్యూటీ సీఈఓకు మెదక్ సీఈఓ బాధ్యతలు అప్పగించనున్నారు. సిద్దిపేటలో కొత్త సీఈఓ పోస్టు మంజూరు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం జెడ్పీలో ఐదుగురు సూపరింటిండెంట్లు పనిచేస్తున్నారు. వీరిలో ఇద్దరు సూపరింటెండెంట్లను సంగారెడ్డికి, ఇద్దరిని మెదక్, ఒకరిని సిద్దిపేటకు సర్దుబాటు చేస్తారు. సిద్దిపేటలో అదనంగా ఒక సూపరింటెండెంట్‌ను నియమిస్తారు, సీనియర్ అసిస్టెంట్లను ఇదే పద్దతితో సర్దుబాటు చేస్తారు. -
ఆ మూడు జిల్లాల్లో ఎడతెగని కరువు
- రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల దుస్థితి - తెలంగాణలో గడచిన 21 ఏళ్లలో 15 ఏళ్లు కరువే - కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వ నివేదిక - 1995 నుంచి రాష్ట్రంలో వరస కరువులు - దేశంలో మూడో అత్యంత కరువు పీడిత రాష్ట్రం తెలంగాణే.. తాజాగా 231 మండలాలపై ప్రభావం - జాతీయ విపత్తుల ఉపశమన నిధి నుంచి 2,514 కోట్ల రూపాయలు ఇవ్వండి - ఇందులో రూ. 781.98 కోట్లు ఇన్పుట్ సబ్సిడీకి.. రూ. 916.47 కోట్లు కరువు పింఛన్లకు.. - ‘ఉపాధి’ పని దినాలను 150కి పెంచాలని విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరువు రక్కసి విలయ తాండవం చేస్తోంది. గుక్కెడు నీటికి దిక్కులేకుండా చేసి కరాళ నృత్యం చేస్తోంది. గడచిన 21 ఏళ్లలో ఏకంగా 15 ఏళ్లు రాష్ట్రాన్ని కబళిస్తూ వచ్చింది. రైతుల ఆత్మహత్యలకు.. పంట నష్టాలకు.. ఆకలి చావులకు.. నీటి జగడాలకు.. చివరికి పశుగ్రాసానికీ దిక్కులేకుండా చేసింది. ఈసారీ పంజా విసిరి జనం ప్రాణాలతో చెలగాటమాడుతోంది. 1998-99, 2005-06, 2007-08, 2008-09, 2013-14, 2014-15 సంవత్సరాలను మినహాయిస్తే... 1995-96 నుంచి ఇప్పటి వరకు తెలంగాణ భూభాగంపై వరసగా కరువు కాటకాలు విజృంభిస్తూనే ఉన్నాయి. రాష్ట్రంలో నీటి పారుదల సౌకర్యం పెద్దగా లేకపోవడంతో... రైతులు వర్షాధార పంటలే సాగు చేస్తున్నారు. నైరుతి రుతుపవనాలే తెలంగాణకు ప్రధాన దిక్కు. 9వ ప్రపంచ వ్యవసాయ గణాంకాలు-2010-11 ప్రకారం రాష్ట్రంలో 55.5 లక్షల కమతాలుండగా.. అందులో 85.85 శాతం చిన్న, సన్నకారు రైతులవే. వరస కరువులతో వారు దెబ్బతింటూనే ఉన్నారు. ప్రతి ఏటా వర్షాభావ పరిస్థితులే నెలకొనడంతో దేశంలో రాజస్తాన్, కర్ణాటక తర్వాత మిగతా మూడో అత్యంత కరువు పీడిత రాష్ట్రంగా తెలంగాణ నమోదైంది. రాష్ట్రంలో ఉన్న 10 జిల్లాల్లో రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలైతే.. ఎడతెగని కరువు ప్రాంతాలుగా తయారయ్యాయి. ఈ విస్మయకర అంశాలను స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే వెల్లడించింది. రాష్ట్రంలో కరువు పరిస్థితులపై ఇటీవల కేంద్రానికి సమర్పించిన నివేదికలో ఈ అంశాలన్నింటినీ అంశాలను పొందుపరిచింది. ఆ నివేదికను ‘సాక్షి’ సంపాదించింది. అందులోని పలు ముఖ్యాంశాలు... వడగళ్ల వానల వల్ల 2015 ఫిబ్రవరి-మే నెలల మధ్య అన్ని జిల్లాల్లో సాగులో ఉన్న పంటలు ధ్వంసమయ్యాయి. నైరుతి రుతుపవనాల సీజన్లో వర్షాభావం వల్ల జూలైలో 66 శాతం లోటు, ఆగస్టులో 31 శాతం లోటు వర్షపాతం నమోదైంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పంటల ఎదుగుదల మందగించి దిగుబడి తగ్గిపోయింది. పత్తి, వేరుశనగ, జొన్న, మొక్కజొన్న తదితర వర్షాధార పంటలు బాగా దెబ్బతిన్నాయి. తీవ్ర వర్షాభావంతో రాష్ట్రంలో 7 జిల్లాల పరిధిలోని 231 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించడం జరిగింది. కరువు నుంచి ఉపశమనం కోసం ప్రభుత్వం ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. కరువు పీడిత పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరాకు శ్రీకారం చుట్టాం. ఉపాధి హామీ పథకం కింద పనిదినాలను 100 నుంచి 150కు పెంచి పనులు కల్పించడం, పశుగ్రాసం సాగు, పశువులకు తాగునీటి లభ్యత, ప్రత్యామ్నాయ పంటల సాగుపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా వంట నూనెలు, పప్పుల ధరల స్థిరీకరణకు చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకోసం ఇప్పటికే రూ. 118.20 కోట్లను ఖర్చు చేయడం జరిగింది. తీవ్రంగా నష్టపోయిన చిన్న రైతులు రాష్ట్రంలో కరువు మూలంగా రూ. 2,122.91 కోట్లు విలువ చేసే 12,48,498 టన్నుల పంట దిగుబడులకు నష్టం వాటిల్లింది. ప్రధానంగా చిన్న, సన్నకారు రైతులు బాగా నష్టపోయారు. జాతీయ విపత్తుల ఉపశమన నిధి (ఎన్డీఆర్ఎఫ్) కింద దిగువ పేర్కొన్న అవసరాల కోసం రాష్ట్రానికి రూ. 2,514.03 కోట్లు విడుదల చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఆ వివరాలు... రాష్ట్రంలో పంటలు నష్టపోయిన 20,91,859 మంది రైతులకు పెట్టుబడి రాయితీగా రూ. 863 కోట్లు ఇవ్వాలి. అందులో రూ.781.98 కోట్లు కేవలం చిన్న, సన్నకారు రైతులకే. పశుగ్రాసం సాగు, పశు వైద్య శిబిరాల నిర్వహణ తదితర ప్రత్యామ్నాయ చర్యల కోసం పశు సంవర్థక శాఖకు రూ. 42.84 కోట్లు అవసరం. ట్యాంకర్లు, ప్రైవేటు వాహనాల ద్వారా ప్రత్యామ్నాయ తాగునీటి సరఫరా కోసం పల్లెలకు రూ. 102.16 కోట్లు, పట్టణాలకు రూ. 220.55 కోట్ల నిధులు అవసరం. ఉపాధి హామీ కింద ఇప్పటికే చాలా మంది కూలీలకు 100 రోజుల పని పూర్తయింది. కరువు నుంచి ఉపశమనం కోసం ఈ పనిదినాల పరిమితిని 100 నుంచి 150 రోజులకు పెంచాలి. ఈ లెక్కన 11 లక్షల కుటుంబాలకు అదనపు పని కల్పించేందుకు రూ. 369 కోట్లు కావాలి. కరువు ఫలితంగా సమాజంలో నిస్సహాయ వర్గాలైన వృద్ధులు, వికలాంగులు, నిరుపేదలు, భూములు లేని వ్యవసాయ కూలీలు తీవ్రంగా ప్రభావితులయ్యారు. వారికి ఉపశమనంగా కరువు పింఛన్ల పంపిణీ కోసం రూ. 916.47 కోట్లు అవసరం. కొన్నేళ్లుగా కరువు మండలాలు.. సంవత్సరం కరువు మండలాలు 1995-96 15 1996-97 17 1997-98 433 1998-99 - 1999-00 245 2000-01 30 2001-02 406 2002-03 446 2003-04 151 2004-05 399 2005-06 - 2006-07 103 2007-08 - 2008-09 - 2009-10 442 2010-11 6 2011-12 418 2012-13 16 2013-14 - 2014-15 - 2015-16 231 -
వరద బాధితులకు వైఎస్ జగన్ పరామర్శ
నెల్లూరు : ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి వరద బాధిత ప్రాంతాల్లో మంగళవారం రెండవ రోజు పర్యటిస్తున్నారు. ముందుగా ఆయన ఇవాళ ఉదయం వెంకటగిరిలోని శ్రీపోలేరమ్మ ఆలయంను సందర్శించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత వెంకటగిరిలో చేనేత కార్మికులను పరామర్శించేందుకు వైఎస్ జగన్ బయలుదేరి వెళ్లారు. రెండు వారాలుగా భారీ వర్షాలు, వరదల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులను వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. వరద బాధితులకు అండగా ఉంటామని, అధైర్య పడొద్దని వారికి భరోసా కల్పించనున్నారు. నిన్న చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లో వరద బాధిత ప్రాంతాల్లో ఆయన పర్యటించిన సంగతి తెలిసిందే. నేడు నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి, వాకాడు, గూడూరు, సూళ్లురుపేటలో వైఎస్ జగన్ పర్యటన కొనసాగనుంది. -
ఆ మూడు జిల్లాలకు పెను తుపాన్ల తాకిడి!
విశాఖపట్నం: రాష్ట్రంలోని మూడు జిల్లాలు పెనుతుపాన్ల తాకిడికి గురయ్యే ప్రాంతాల జాబితాలో ఉన్నట్లు భారత వాతావరణ విభాగం(ఐఎండీ) గుర్తించింది. తూర్పుగోదావరి, కృష్ణా, నెల్లూరు జిల్లాలకు పెను తుపాన్ల ముప్పు ఎక్కువగా ఉందని ఐఎండీ ఓ నివేదికలో తెలిపింది. దేశవ్యాప్తంగా 13 తీరప్రాంత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో తుపాన్ల తాకిడి తీవ్రంగా ఉండే జిల్లాలపై ఐఎండీ శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల్లోని 12 జిల్లాలు ఈ జాబితాలో ఉన్నట్టు శాస్త్రవేత్తలు తేల్చారు. వాటిలో మన రాష్ట్రంలోని మూడు జిల్లాలతో పాటు తూర్పుగోదావరికి ఆనుకుని ఉన్న యానాం కూడా ఉన్నట్టు ప్రకటించారు. మిగిలిన వాటిలో ఒడిశాలోని బాలాసోర్, భద్రక్, కేంద్రపారా, జగ్జిత్సింగ్పూర్, పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ, ఉత్తర 24 పరగణ, మిడ్నాపూర్, కోల్‌కతా జిల్లాలు ఉన్నాయి. 1891 నుంచి 2010 వరకు సంభవించిన తుపాన్లు ఎక్కువ సార్లు తీరాన్ని తాకడాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ అంచనాకు వచ్చినట్లు పేర్కొన్నారు.