మూడు జిల్లాల పరిధిలో ‘మాడా’ | Three districts within the 'Madame' | Sakshi
Sakshi News home page

మూడు జిల్లాల పరిధిలో ‘మాడా’

Published Thu, Sep 1 2016 11:58 PM | Last Updated on Mon, Sep 4 2017 11:52 AM

మూడు జిల్లాల పరిధిలో ‘మాడా’

మూడు జిల్లాల పరిధిలో ‘మాడా’

  • 46 గ్రామాలకే పరిమితమైన మానుకోట మైదాన ప్రాంత గిరిజన అభివృద్ధి సంస్థ
  • ఐటీడీఏ ఏర్పాటు చేయాలని గిరిజనుల విజ్ఞప్తి
  • మహబూబాబాద్‌ : మానుకోట జిల్లాగా ఏర్పడుతున్న నేపథ్యంలో మానుకోటలోని మాడా (మైదాన ప్రాంత గిరిజన అభివృద్ధి సంస్థ) మూడు జిల్లాల పరిధిలోకి వెళ్లనుంది.
     
    మానుకోట పట్టణంలోని మాడా సహాయ ప్రాజెక్టు అధికారి కార్యాలయం పరిధిలో ప్రస్తుతం 15 మండలాలు ఉన్నాయి. చెన్నారావుపేట, దేవరుప్పుల, డోర్నకల్, గూడూరు, కేసముద్రం, కొడకండ్ల, కురవి, మహబూబాబాద్, మరిపెడ, నర్సింహులపేట, నెక్కొండ, నెల్లికుదురు, పాలకుర్తి, పర్వతగిరి, రాయపర్తి మండలాల్లోని 68 గ్రామాలు ఇందులో ఉన్నాయి. 
    ఇతర జిల్లాల పరిధిలోకి Ðð ళ్లిన గ్రామాలు..
    కొడకండ్ల మండలంలోని రెండు గ్రామాలు, పాలకుర్తిలోని ఒక గ్రామం, దేవరుప్పల మండలంలోని రెండు గ్రామాలు మొత్తం 5 గ్రామాలు హన్మకొండ జిల్లాలో చేర్చనున్నారు. పర్వతగిరి మండలంలోని మూడు గ్రామాలు, రాయపర్తిలోని మూడు గ్రామాలు, చెన్నారావుపేట మండలంలోని మూడు గ్రామాలు, నెక్కొండ మండలంలోని 8 గ్రామాలు వరంగల్‌ జిల్లాలోకి వెళ్లనున్నాయి. 
    కార్యాలయం పరిధిలో 68 గ్రామాలు ఉండగా 22 గ్రామాలు ఇతర జిల్లాల పరిధిలోకి వెళ్లాయి. ప్రస్తుతం 46 గ్రామాలు మాత్రమే మిగిలాయి. కొత్తగూడ, గార్ల, బయ్యారం మండలాలను మాడా పరిధిలో చేర్చారు. గతంలో కార్యాలయం పరిధిలో ఉన్న గూడూరు మండలం, మానుకోట మండలంలోని రెడ్యాల గ్రామం ఏజెన్సీ పరిధిలోనే ఉన్నాయి. మాడా కార్యాలయంలో అసిస్టెంట్‌ ప్రాజెక్ట్‌ ఆఫీసర్, మేనేజర్, ఒక సీనియర్‌ అసిస్టెంట్, ఒక జూనియర్‌ అసిస్టెంట్, టైపిస్ట్, వాచ్‌మెన్, అటెండర్‌ పోస్టులున్నాయి. 50 శాతం గిరిజన జనాభా ఉంటే 1977వ సంవత్సరంలో మాడా ఏర్పాటు చేశారు. 
    మాడా కార్యక్రమాలు..
    మాడా పరిధిలో ప్రధానంగా వ్యవసాయం, పశుసంవర్థక శాఖ, ఇరిగేషన్, చిన్న తరహా పరిశ్రమలకు సంబంధించిన సెల్ఫ్‌ డెవల ప్‌మెంట్‌ స్కీంలు, రుణాలు ఇవ్వడం జరిగింది. గత సంవత్సరం మానుకోట మాడా పరిధిలో 10 కోట్ల రుణాలు ఇచ్చారు. రూ. లక్షకు 80 వేల సబ్సిడీ, రూ.2 లక్షలకు 70 వేలు, రూ. 5 లక్షలకు 60 వేలు, రూ.10 లక్షలకు 50 వేల సబ్సిడీ చొప్పున రుణాలను అందజేశారు. మానుకోట పరిధి నుంచి విడిపోయిన గ్రామాలకు రుణాలు, ఇతర విషయాల్లో ఇబ్బందులు తలెత్తే పరిస్థితి ఉంది. 
    ఐటీడీఏగా అప్‌గ్రేడ్‌ చేస్తేనే అభివృద్ధి..
    మానుకోట మాడా పరిధిలో ఏజెన్సీ మండలాలు ఎక్కువగా ఉన్నాయి. కొత్తగూడ, గార్ల, బయ్యారం మాడా పరిధిలోకి వచ్చాయి. ఇల్లందు మండలాన్ని కూడా మానుకోట జిల్లాలోకి చేర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం బయ్యారంలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తే దాని నుంచి వచ్చే ఆదాయంలో 20 శాతం గిరిజనుల అభివృద్ధి కోసం కేటాయించాల్సి ఉంటుంది. అది ఐటీడీఏ ఏర్పాటు అయితేనే సాధ్యమవుతుందని సంబంధిత అధికారులు అంటున్నారు. మాడాను అప్‌గ్రేడ్‌ చేసి అసిస్టెంట్‌ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌కు డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌గా (డీఓగా) పదోన్నతి కల్పించి ఐటీడీఏ పీఓ ఆధీనంలో పనిచేసే విధంగా అధికార యంత్రాంగం చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా మానుకోట మాడాను ఐటీడీఏగా మారిస్తేనే ఈ ప్రాంతం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని గిరిజనులు అభిప్రాయపడుతున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement