చంద్రబాబు సభకు రాలేదో..
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ మఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతి పర్యటన నేపథ్యంలో అధికారులు, పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఆదివారం చంద్రబాబు పర్యటన దృష్ట్యా జనసమీకరణకు అధికారులు నానా పాట్లు పడుతున్నారు. తిరుపతి, శ్రీకాళహస్తిలో డ్వాక్రా మహిళలను చంద్రబాబు సభకు హాజరుకావాల్సిందిగా అధికారులు బెదిరింపులకు దిగుతున్నారు. చంద్రబాబు సభకు రాకపోతే డ్వాక్రా సంఘాలను రద్దు చేస్తామని హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం.
మరోవైపు చంద్రబాబు పర్యటనను దృష్టిలో ఉంచుకొని పోలీసులు ఏస్వీయూలో విద్యార్థి నేతలను అరెస్ట్ చేశారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ విద్యార్థులు తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.