సిటీ ఆర్టీసీలో ఆపరేషన్ స్టార్ట్ | police plan will be control accidents in city busses | Sakshi
Sakshi News home page

సిటీ ఆర్టీసీలో ఆపరేషన్ స్టార్ట్

Published Sun, Jul 24 2016 8:31 PM | Last Updated on Mon, Sep 4 2017 6:04 AM

సిటీ ఆర్టీసీలో ఆపరేషన్ స్టార్ట్

సిటీ ఆర్టీసీలో ఆపరేషన్ స్టార్ట్

♦  భద్రత వైపు ఆర్టీసీ బస్సు పయనం
♦  రోడ్డు ప్రమాదాల నియంత్రణపై స్పెషల్‌ డ్రైవ్‌
♦  అన్ని డిపోల్లో ప్రమాదరహిత వారోత్సవాలు
♦  ఉత్తమ సేవలకు పురస్కారాలు

సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ఆర్టీసీ బస్సుల వల్ల అటు ప్రయాణికులకు... ఇటు ఇతర వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన భద్రతా చర్య లు చేపట్టాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. బస్సు ప్రయాణం సాఫీగా సాగేలా చూడాలని భావిస్తోంది. వాస్తవంగా నగరంలో ఆర్టీసీ బస్సుల వల్ల నిత్యం ఎక్కడో ఒక చోట సమస్య ఏర్పడుతోంది. రోడ్డు ప్రమాదాలు, నిర్లక్ష్యపు డ్రైవింగ్, ఇష్టారాజ్యంగా సిగ్నల్‌ జంపింగ్, రోడ్డుమధ్యలోనే బస్సుల నిలిపివేత, హడలెత్తించే  వేగం వంటి సంఘటనలు ఉంటూనే ఉన్నాయి.

వీటికి చెక్‌పెట్టేందుకు ఆర్టీసీ ఉపక్రమించింది. తప్పిదాలకు పాల్పడే డ్రైవర్లలో  రోడ్డు భద్రతపై అవగాహన పెంచేందుకు, ప్రమాదాల నియంత్రణ చర్యలపై దృష్టి సారించింది. ఈ నెల 25 నుంచి 31 వరకు ప్రమాదరహిత వారోత్సవాలకు శ్రీకారం చుట్టింది. నగరంలోని  28 డిపోల్లో రోడ్డు భద్రతపై డ్రైవర్లకు అవగాహన కల్పిస్తారు. రోడ్డు భద్రతా నిపుణులు, పోలీసులు, అధికారులు ఈ కృషిలో భాగస్వాములవుతారు. అదేసమయంలో ఉత్తమ సేవలు అందజేసిన వారికి  పురస్కారాలను కూడా అందజేస్తారు.

ప్రతిష్టకు విఘాతం...
లారీ డ్రైవర్ల కంటే ఎక్కువ దూకుడు ప్రదర్శిస్తున్న కొందరు ఆర్టీసీ డ్రైవర్ల వల్ల ప్రమాదాలు జరగడమే కాకుండా ఆర్టీసీ ప్రతిష్టకు సైతం విఘాతం కలుగుతోం ది. 2014–15 సంవత్సరంలో సిటీ బస్సుల వల్ల నగరంలో 280 ప్రమాదాల్లో  95 మంది మృత్యువాత పడ్డారు.78 మంది తీవ్రంగాను, 106 మంది స్వల్పంగాను గాయపడ్డారు. అలాగే  2015–16లో 219 ప్రమాదాలు జరిగాయి. 85 మంది చనిపోయారు. 49 మంది తీవ్రంగా, 85 మంది స్వల్పంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే ‘ప్రమాదరహితమైన బస్సు ప్రయాణం’ అనే లక్ష్యంతో  సిటీలో ఈ వారోత్సవాలు చేపట్టారు.

ఈ వారం ఏంచేస్తారంటే ...

► మొదటి రోజు రవాణాశాఖ అధికారులు, నిపుణులు రోడ్డు భద్రతపై ప్రసంగిస్తారు. ఇది ప్రారంభోత్సవ కార్యక్రమం.
►   రెండవ రోజులో అన్ని డిపోల్లోను బస్సులను క్షు ణ్ణం గా తనిఖీ చేస్తారు. భద్రతా ప్రమాణాలకు అనుగుణం గా ఉన్నాయా లేదా అనే అంశంపైన సమగ్రంగా  దృష్టి సారిస్తారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలందజేసిన మె కానిక్‌లను ప్రశంసించి పురస్కారాలను అందజేస్తారు.
►   మూడవ రోజు అన్ని డిపోల్లో డ్రైవర్లకు పూర్తిగా వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అవసరమైన వైద్య సేవలను అందజేస్తారు.
►   4వ రోజు ప్రమాదాలకు పాల్పడిన డ్రైవర్లకు కౌన్సెలింగ్‌ ఉంటుంది. వారి కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. ప్రమాదకరమైన డ్రైవింగ్‌ వల్ల తాము నష్టపోవడమే కాకుండా ఇతరులకు సైతం నష్టం కలుగుతుందనే విషయం పట్ల అవగాహన కల్పిస్తారు.   ► 5వ రోజు ప్రమాదాలకు పాల్పడిన డ్రైవర్లకు హకీంపేట్‌ ట్రాన్స్‌పోర్టు అకాడమీలో ఒక రోజు శిక్షణనిస్తారు.
►    6వ రోజు డ్రైవర్స్‌ డే. ఉత్తమ సేవలందజేసిన వారికి నగదు పురస్కారాలు, సన్మాన కార్యక్రమాలు ఉంటాయి.
►   7వ రోజు రీజనల్‌ కార్యాలయాల్లో, జోనల్‌ కార్యాలయాల్లో రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తారు.

రోడ్డు భద్రతలో భాగంగా...

►   బస్సు ఎక్కే ముందు ప్రతి డ్రైవర్‌ ప్రతి రోజు  విధిగా భద్రతా సూక్తులను గుర్తు చేసుకొనే విధంగా ప్రోత్సహిస్తారు.
►    అన్ని డిపోల్లోనూ గేట్‌ మీటింగ్‌లు ఏర్పాటు చేసి ఉత్తమ డ్రైవింగ్‌ అలవాట్లపైన అవగాహన కల్పిస్తారు.
►   అన్ని డిపోల్లో బ్రీత్‌ ఎనలైజర్లను వినియోగించి మద్యం సేవించి విధులకు హాజరయ్యే వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటారు.
►   ప్రతి డ్రైవర్‌లో అవగాహన కల్పించే విధంగా రూపొందించిన లఘుచిత్రం ‘భద్రత’ను అన్ని డిపోల్లో ప్రదర్శిస్తారు.
►   నిపుణుల ప్రసంగాలు, అవగాహన కార్యక్రమాలు ప్రతి రోజు ఉంటాయి.

మూడేళ్లలో ఆర్టీసీ బస్సుల కారణంగా ప్రమాదాలు ఇలా..

సంవత్సరం    ప్రమాదాలు    మృతులు        తీవ్రంగా      స్వల్పంగా    గాయపడ్డవాళ్లు శాతం

2013–14       287               112           92              89                 0.09
2014–15       280               95             78             106               0.09
2015–16       219               85             49              85                 0.07

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement