అనంతపురం : ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకపోవడం వల్లే పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు తెలిపారు. మంగళవారం అనంతపురంలో ఎస్ఐల పాసింగ్ ఔట్ పరేడ్లో చంద్రబాబు పాల్గొన్నారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ... ఏపీకి పెట్టుబడులు రావాలంటే శాంతిభద్రతలు బాగుండాలన్నారు. అందుకోసం నీతి, నిజాయితీతో పనిచేయాలని పోలీసులకు సూచించారు. అలాగే ఐటీపై అవగాహన పెంచుకోవాలని పోలీసులకు చంద్రబాబు కోరారు.