పదవుల కోసం పరుగు
→ త్వరలో ముగియనున్న పదవీకాలం
→ జేఎన్‌టీయూలో రాజకీయ పెత్తనం
→ పైరవీల జోరు
జేఎన్‌టీయూ : రెండు సంవత్సరాలుగా జేఎన్‌టీయూ అనంతపురంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయ పెత్తనం అధికమయింది. పదవుల కోసం కొందరు ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు తమ స్థాయిని మరచి రాజకీయనాయకులు, మంత్రులు చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సమాజంలో గౌరవమైన బోధనను పక్కనబెట్టి పదవే పరమావధిగా ఉన్నత స్థాయిలో సిఫార్సులు చేయించుకొంటున్నారు. బోధన, పరిశోధనకు లక్షలాది రూపాయలు జీతాలు తీసుకుంటూ తమ పూర్తి కాలాన్ని అదనపు పదవులకే వినియోగిస్తూ విద్యార్థులకు తీరని నష్టం కలిగిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
పదవే పరమావధి
బోధన పోస్టులు భర్తీ కాకపోవడంతో అసలే బోధన సిబ్బంది కొరతగా ఉంది. దీనికితోడు పదవులపై ఆసక్తి చూపే వారి సంఖ్య అధికంగా ఉంది. దీంతో బోధన, పరిశోధన పడకేసింది. పూర్తి సామర్థ్యాలు బోధన, పరిశోధన వైపు అసిస్టెంట్ ప్రొఫెసర్లు దష్టిసారించాల్సి ఉంది. బోధన, పరిశోధన నైపుణ్యాలు పెంపొందించుకోవడానికి అవకాశం కల్పించాలి. కానీ అదనపు పదవుల్లో నియామకాలు చేస్తుండడంతో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
సంప్రదాయాన్ని పాటిస్తారా..
రెండేళ్ల పదవి కాలం పూర్తి కాగానే కొత్తవారిని నియమించే సంప్రదాయం జేఎన్‌టీయూలో పాటిస్తున్నారు. ఓఎస్డీగా ఉన్న ఆచార్య కేఎస్‌ఆర్ ఆంజనేయులు మతి చెందడంతో ఆ పదవి ఖాళీ ఏర్పడింది. నెలాఖరుకు జేఎన్‌టీయూ రెక్టార్ ఆచార్య పాండురంగడు పదవీ విరమణ చేయనున్నారు. నవంబర్ మూడో వారానికి పలు కీలక పదవులకు రెండు సంవత్సరాల గడువు ముగియనుంది. దీంతో ఆశావహులు ఎవరి ప్రయత్నాలో ్ల వారున్నారు. భర్తీ చేయబోయే పదవుల్లో అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వాలనే డిమాండ్లు అధికమయ్యాయి.