tenure close
-
పాక్ ఆపద్ధర్మ ప్రధానిగా ఇషాఖ్ దార్!
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా ఆర్థిక మంత్రి ఇషాఖ్ దార్ (73) పేరు తెరపైకి వచి్చంది. షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వ పదవీ కాలం ఆగస్టు 14న ముగియనుంది. కానీ 8వ తేదీనే జాతీయ అసెంబ్లీని రద్దు చేయాలని ప్రధాని నిర్ణయించుకున్నట్లు పాక్ మీడియా ఆదివారం వెల్లడించింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యేదాకా ఇషాఖ్ దార్‌ను ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా కొనసాగిస్తారని తెలియజేసింది. ఆయన పేరును అధికార పాకిస్తాన్ ముస్లిం లీగ్–నవాజ్ పార్టీ ప్రతిపాదించింది. పాక్ ఇప్పుడు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. అంతర్జాతీయ సంస్థల నుంచి అప్పుల కోసం, విదేశాల నుంచి పెట్టుబడుల కోసం ప్రయతి్నస్తోంది. రుణాలు, పెట్టుబడులతో ఆర్థికంగా కుదురుకోవడానికి చాలా సమయం పట్టనుంది. ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించేందుకు షరీఫ్ ప్రభుత్వం ఇష్టపడడంలేదు. అందుకే ఆపద్ధర్మ ప్రభుత్వంతో నెట్టుకురావాలని భావిస్తోంది. పాకిస్తాన్ రాజ్యాంగం ప్రకారం.. జాతీయ అసెంబ్లీ పదవీ కాలం పూర్తయితే 60 రోజుల్లోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ, జాతీయ అసెంబ్లీని పదవీ కాలం ముగియక ముందే రద్దు చేస్తే 90 రోజుల్లోగా ఎన్నికలు నిర్వహించవచ్చు. కొత్త ప్రభుత్వం కొలువుదీరే దాకా ఆపద్ధర్మ ప్రధానమంత్రి పరిపాలన సాగిస్తారు. ఆపద్ధర్మ ప్రధానిగా ఇషాఖ్ దార్ నియామకంపై పాకిస్తాన్ ప్రభుత్వం వచ్చేవారం తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. -
అనుకున్నదానికంటే ఎక్కువే సాధించాను!
లండన్: భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా రవిశాస్త్రి పదవీకాలం వచ్చే టి20 ప్రపంచకప్‌తో ముగియనుంది. ఆ తర్వాత కొనసాగించేందుకు అతను ఆసక్తి చూపించడం లేదు. కోచ్‌గా ఎంతో సాధించానని, గడువు పూర్తయిన తర్వాత ఆగిపోయే మనస్తత్వం తనది కాదని రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు. ‘ఇప్పటికే కోచ్‌గా నేను అనుకున్నదానికంటే ఎక్కువే సాధించాను. టెస్టుల్లో ఐదేళ్లు నంబర్‌వన్‌గా ఉండటం, ఆ్రస్టేలియాలో రెండుసార్లు సిరీస్ సాధించడం, కరోనా సమయంలో ఇంగ్లండ్ గడ్డపై టెస్టులు గెలిచి సిరీస్‌లో ఆధిక్యంలో నిలవడంలాంటివి అద్భుతం. నా నాలుగు దశాబ్దాల క్రికెట్లో ఇది ఎంతో సంతృప్తికర క్షణం. వీటికి తోడు టి20 ప్రపంచకప్ కూడా గెలిస్తే అది అదనపు ఆనందాన్నిస్తుంది. గెలవగల సత్తా మా టీమ్‌కు ఉంది కూడా. మనకు ఇచ్చిన సమయంకంటే అదనంగా ఒక్క క్షణం కూడా ఆగవద్దని నేను నమ్ముతాను. అందుకే సరైన సమయంలోనే తప్పుకుంటున్నాను’ అని రవిశాస్త్రి వివరించాడు. -
ఉత్కంఠకు తెర!
ఒంగోలు టూటౌన్: ప్రభుత్వం నిర్ణయం పంచాయతీ పాలకవర్గాలకు నిరాశే మిగిల్చింది. సర్పంచులను పర్సన్ ఇన్చార్జులుగా నియమిస్తారన్న ఆశలు ఆడియాశలయ్యాయి. సర్పంచుల సంఘం హైకోర్టుకెళ్లి పోరాడిన ఫలితం లేకుండా పోయింది. చివరకు ప్రత్యేక అధికారుల నియామకానికే సర్కారు మొగ్గు చూపింది. అనుకున్నదే తడవుగా వెంటనే గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించాలని బుధవారం జీవో 269 కూడా జారీ చేసింది. దీంతో గురువారం నుంచి గ్రామ పంచాయతీలు ప్రత్యేక అధికారుల పాలనలోకి వెళ్లనున్నాయి. ప్రత్యేక అధికారుల నియామకంపై జిల్లా అధికారులు వెంటనే కసరత్తు మొదలు పెట్టినట్లు సమాచారం. ఏపీ ప్రభుత్వానికి కంటే ముందే రెండు రోజుల క్రితమే తెలంగాణ ప్రత్యేక అధికారుల నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం నిర్ణయంతో స్థానిక సంస్థల్లో ఇన్నాళ్లూ నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. జిల్లాలోని 1028 గ్రామ పంచాయతీల్లో సకాలంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం ఓటర్ల జాబితాను సిద్ధం చేసింది. సిద్ధం చేసిన ఓటర్ల జాబితాను వార్డుల వారీగా ఓటర్ల జాబితాను ఆయా గ్రామ పంచాయతీలలో ఏర్పాటు చేయించింది. అయినా సకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ముందుకు రాలేదు. ప్రభుత్వంపై ప్రజల్లోతీవ్ర వ్యతిరేకత ఉండటంతో ఎన్నికలు నిర్వహించేందుకు వెనుకంజ వేసింది. దీంతో ప్రస్తుత పాలకవర్గాల గడువు ముగిసే వరకు ఎన్నికల నిర్వహణపై కాలయాపన చేసింది. పాలక వర్గాల గుడువు ముగిసే రోజున ప్రత్యేక అధికారుల నియామకానికే మొగ్గు చూపింది. రూ.150 కోట్ల నిధులకు గండి... ప్రభుత్వం నిర్ణయంతో గ్రామ పంచాయతీలు ఆర్థిక కష్టాల్లో పడే పరిస్థితి రానుంది. పంచాయతీ పాలకవర్గాలు ఉంటేనే కేంద్రం 14వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తుంది. కాని ప్రస్తుత పాలకవర్గాల గడువు పూర్తవడంతో ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించడానికే మొగ్గు చూపింది. దీంతో ఏటా గ్రామ పంచాయతీలకు వచ్చే ఆర్థిక సంఘం నిధులు ఇక నిలిచిపోనున్నాయి. దాదాపు ఏటా రూ.150 కోట్లకు పైగా నిధులు గ్రామ పంచాయతీలకు వచ్చేవి. ఆ నిధుల ద్వారానే పంచాయతీలు మనుగడ సాగిస్తూవస్తున్నాయి. ప్రస్తుతం అవి కూడా లేకుండా పోయాయి. ఇంటిపన్నులే దిక్కు.. 14వ ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోతే.. పంచాయతీలకు ఇంటిపన్నులే దిక్కు అవుతాయి. ఇప్పటికే చాలా గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ కంప్యూటర్ ఆపరేటర్లకు జీతాలు, తాగునీటి పథకాల నిర్వహణకు ఇబ్బందులు పడుతున్నాయి. తగినన్ని నిధులు లేక ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నాయి. మేజర్ పంచాయతీలలో ఇంటిపన్నుల వసూళ్ల వలన కొంత నెట్టుకు వచ్చే అవకాశం ఉంటుంది. మైనర్ పంచాయతీలకు మాత్రం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. -
పల్లె పాలన..ఇక ప్రత్యేకం
నెల్లూరు(అర్బన్): పల్లె పాలన..ఇక ప్రత్యేకం. గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారులు కొలువుదీరన్నారు. జిల్లాలో 940 మంది సర్పంచ్ల పదవీ కాలం ముగియడంతో ముందుగా ఊహించినట్టుగానే ప్రభుత్వం పంచాయతీలకు ప్రత్యేకాధికారులను నియమిస్తూ బుధవారం జీఓ నంబర్ 269ను విడుదల చేసింది. ప్రత్యేకాధికారులను నియమించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో సర్పంచ్‌లు మాజీలయ్యారు. పల్లెపాలన సాగేందుకు తహసీల్దారు, డిప్యూటీ తహసీల్దారు, ఎంపీడీఓ, ఈఓపీఆర్డీ తదితర క్యాడర్ కలిగిన అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించాలని నిబంధనలు ఉండటంతో ఆ దిశగా కలెక్టర్, డీపీఓ చర్యలు చేపట్టారు. బుధవారం ‘సాక్షి’లో ఇక ప్రత్యేక పాలనే అంటూ కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. ఈ కథనంలో పేర్కొన్నట్టుగానే ప్రభుత్వం విధి, విధానాలు రూపొందించింది. ఈ విధివిధానాల ప్రకారమే అధికారులు పారిశుద్ధ్యం, కార్మికుల జీతభత్యాలు, తాగునీటి సరఫరా, పైపులైను మరమ్మతులు తదితర వాటికి ఖర్చు చేయాల్సి ఉంది. రోడ్లు, పబ్లిక్ స్థలాలు ఎవరైనా ఆక్రమిస్తే జరిమానా సైతం విధించవచ్చు. పంచాయతీ కార్యదర్శి, ప్రత్యేక అధికారి కలిసి సమన్వయంతో పని చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు గ్రామ సభల తీర్మానాల ద్వారా అభివృద్ధి పనులు జరిగేవి. ఇప్పుడు గ్రామ సభల తీర్మానాలు అవసరం లేదు. ప్రత్యేకాధికారులే అభివృద్ధి పనుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలకు ఇవ్వాల్సిన పర్ కాపిటా(తలసరి నిధులు), ఎస్డీఎఫ్ (రాష్ట్రాభివృద్ధి నిధులు) వంటి నిధులను సైతం కొన్నేళ్లుగా విడుదల చేయకపోవడంతో కేంద్రం ఇచ్చే నిధులపైనే పాలన నడుస్తోంది. ప్రజలు ఎన్నుకున్న పాలకులు లేకపోవడంతో కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సంఘం నిధులు ఆగిపోనున్నాయి. దీంతో అభివృద్ధి పనులకు నిధుల గండం పొంచి ఉంది. దీంతో అభివృద్ధి కుంటుపడనుంది. ప్రత్యేక అధికారుల నియామకంపై జిల్లా పంచాయతీ అ«ధికారి సత్యనారాయణను వివరణ కోరగా గురువారమే నియమిస్తామని తె లిపారు. పాలన యథావిధిగా జరుగుతుందన్నారు. -
కొత్త పాలన
కరీంనగర్: పల్లెల్లో కొత్త పండుగకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. గ్రామ పంచాయతీల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలన బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఇదివరకు సర్పంచులు, వార్డు మెంబర్ల పాలనలో సాగిన గ్రామాలు గురువారం నుంచి కొత్త అధికారులు పాలించనున్నారు. పల్లెల్లో పండుగ వాతావరణం కల్పించేందుకు స్పెషల్ ఆఫీసర్లు సమాయత్తమవుతున్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 276 పాత గ్రామ పంచాయతీలతోపాటు కొత్తగా మరో 53 పంచాయతీలు ఏర్పడ్డాయి. కాగా.. కరీంనగర్ నగర పాలక సంస్థ, హుజూరాబాద్ మున్సి పాలిటీ, జమ్మికుంట నగర పంచాయతీలలో 15 పంచాయతీలను విలీనం చేశారు. కొత్తపల్లి, చొప్పదండి మండల కేంద్రాలను మున్సిపాలిటీగా గుర్తించడం, కరీంనగర్ నగర పాలక సంస్థలో విలీనంపై హైకోర్టుకు వెళ్లిన 8 గ్రామాలను తిరిగి పంచాయతీలుగా కొనసాగించాలని తీర్పు వచ్చింది. దీంతో జిల్లాలో ఉన్న మొత్తం 329 పంచాయతీల్లో స్పెషల్ అధికారుల పాలన కొనసాగనుంది. పల్లెల ప్రగతే ప్రధాన లక్ష్యంగా స్థానిక సంస్థల్లో ప్రత్యేక అధికారుల పాలనకు విధులు ఖరారయ్యాయి. ఈ మేరకు మార్గదర్శకాలను అధికారులు జారీ చేశారు. నిధులను ఏయే అంశాలకు ఎంత మేరకు ఖర్చు చేయాలనేది నిర్దేశించారు. గ్రామాల పాలకవర్గం పదవీకాలం మంగళవారంతో ముగిసిపోనుంది. 5 సంవత్సరాలపాటు అధికారంలో ఉన్న సర్పంచులు, వార్డు మెంబర్లు తమ విధులకు వీడ్కోలు చెప్పనున్నారు. ఆగష్టు 2 నుంచి ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభం కానుంది. గడువు ముగిసిపోతున్న పంచాయతీల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైనా రిజర్వేషన్ల అంశాలను తేల్చేవరకు ఎన్నికలు నిర్వహించరాదంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రత్యేక అధికారుల నియామకం అనివార్యమైంది. మంగళవారం వారికి గ్రామాల బాధ్యతలను అప్పగిస్తూ ఉత్తర్వులు వెలువడే అవకాశాలు ఉన్నాయి. జిల్లా స్థాయిలో కలెక్టర్లు, మండలస్థాయిలో ఎంపీడీవోలు ప్రత్యేక అధికారుల పాలనను అమలు చేస్తూ ప్రొసీడింగ్స్ వెలువరించనున్నారు. ప్రత్యేక అధికారుల విధులను ఖరారు చేస్తూ మార్గదర్శకాలను సైతం జారీ చేశారు. గ్రామ పంచాయతీల నిధులను వినియోగించడంపై మార్గదర్శకాల్లో స్పష్టంగా పేర్కొన్నారు. నిధుల వినియోగాన్ని ఆరు విభాగాలుగా వర్గీకరించారు. 2 నుంచి కొత్త పండుగే... ఆగష్టు 2 నుంచి గ్రామాల్లో ప్రత్యేక అధి కారుల పాలన ప్రారంభం కానున్న నేపథ్యం లో గ్రామాల్లో పండుగ వాతావరణం కనిపిం చేలా.. కొత్త పాలనను ప్రారంభించాలని ప్రభుత్వం పూనుకుంది. దీంతో అన్ని జిల్లాల కలెక్టర్లకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కొత్త పాలన ఎలా చేయాలి.. గ్రామాల్లో తొలి రోజు ఎలాంటి కార్యక్రమాలు చేయాలి.. తదితర విషయాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లను ఆదేశించారు. పెద్దఎత్తున కార్యక్రమాలు చేపట్టాలని ప్రజలు, ప్రజాప్రతినిధుల సహకారంతో సంబురంగా తొలి రోజు ప్రారంభం అయ్యేలా చూడాలన్నారు. గ్రామ పంచాయతీల కార్యాలయాలకు రంగులు వేసి అలంకరించాలని ఆదేశించారు. కొత్త కార్యాలయాల ప్రారంభోత్సవం సందర్భంగా కూడా పెద్దఎత్తున టపాసులు కాల్చి స్వీట్లు పంచి పెట్టాలని ఆదేశించారు. -
పల్లె పాలనపై పంచాయితీ!
కర్నూలు(అర్బన్): పల్లె పాలనపై సందిగ్ధం నెలకొంది. సర్పంచుల పదవీ కాలం ఆగస్టు 1వ తేదీతో పూర్తి కానుండడం...ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధంగా లేకపోవడంతో సమస్య ఎదురవుతోంది. ప్రస్తుత సర్పంచులనే పర్సన్ ఇన్‌చార్జీలుగా కొనసాగిస్తారా..లేదంటే ప్రత్యేకాధికారులను నియమిస్తారా అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. జిల్లాలో 889 పంచాయతీలకు 2013 జూలై 24, 26, 31వ తేదీల్లో మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించారు. అదే ఏడాది ఆగస్టు 2వ తేదీన పల్లెల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. వీటి పదవీకాలం 2018 ఆగస్టు 1వ తేదీతో పూర్తి కానుంది. సకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఐదారు నెలల క్రితమే పోలింగ్ కేంద్రాల గుర్తింపు, ఓటర్ల జాబితా తదితర ప్రక్రియను పూర్తి చేసింది. ఎన్నికల వ్యయం ఎంతవుతుందనే విషయంపై సమావేశాలు నిర్వహించారు. అయితే ప్రభుత్వం వెనకడగు వేయడంతో ఎన్నికల ఏర్పాట్లను మానుకున్నారు. ఇదిలా ఉండగా.. తమనే పర్సన్ ఇన్‌చార్జ్‌లుగా కొనసాగించాలని పలు జిల్లాలకు చెందిన సర్పంచులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ మేరకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు కోరినట్లు తెలుస్తోంది. 1996 మార్చి4న అప్పటి ప్రభుత్వం పర్సన్ ఇన్చార్జీల నియామకానికి సంబంధించి జీఓ నం113ను విడుదల చేసింది. 2011లో బీసీ రిజర్వేషన్లపై ఏర్పడిన సందిగ్ధ కారణంగా రెండేళ్ల పాటు ప్రత్యేకాధికారులతో పల్లె పాలనను అప్పగించారు. అయితే 1994 పంచాయతీరాజ్ యాక్ట్ సెక్షన్ 143 ప్రకారం గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగించాలన్నా.. పర్సన్ ఇన్చార్జీలను నియమించాలన్నా అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉంది. ఇదిలా ఉండగా..ఈ నెల మొదటి వారంలో 14వ ఆర్థిక సంఘం నిధులు జిల్లాకు రూ.69 కోట్లు విడుదలయ్యాయి. పలు సాంకేతిక కారణాలతో ఆయా నిధులు సర్పంచుల ఖాతాల్లో జమ కాలేదు. పంచాయతీల్లో చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు వస్తాయోరావోనని సర్పంచులు ఆందోళన చెందుతున్నారు. ‘ప్రత్యేక’ సమస్యలివీ.. ప్రత్యేకాధికారుల పాలనతో గ్రామీణపాలన అస్తవ్యస్తంగా తయారవుతుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. మండల స్థాయి అధికారులు ప్రత్యేకాధికారులుగా వ్యవహరించాల్సి రావడంతో వారికున్న పనిఒత్తిడి కారణంగా గ్రామీణ పాలనపై దృష్టి సారించలేరనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అత్యవసర సమయాల్లో డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తే వారు వెనకడుగు వేసే అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం జిల్లాలో 520 మంది పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు. వీరికి బాధ్యతలను అప్పగించినా పాలన కష్టమవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పాలకవర్గాలు ఉంటేనే గ్రామాలాభివృద్ధి పాలకవర్గాలు ఉంటేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. ప్రత్యేకాధికారుల పాలనలో ప్రజలు నేరుగా ఇబ్బందులు చెప్పుకునే అవకాశాలు చాలా తక్కువ. ప్రభుత్వ కుట్రతోనే 14వ ఆర్థిక సంఘం నిధులు సర్పంచుల ఖాతాల్లో జమ కావడం లేదు. వై. కోటేశ్వరరెడ్డి, సర్పంచ్, ఎం. కృష్ణాపురం, గోస్పాడు మండలం -
పదవుల కోసం పరుగు
→ త్వరలో ముగియనున్న పదవీకాలం → జేఎన్టీయూలో రాజకీయ పెత్తనం → పైరవీల జోరు జేఎన్టీయూ : రెండు సంవత్సరాలుగా జేఎన్టీయూ అనంతపురంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయ పెత్తనం అధికమయింది. పదవుల కోసం కొందరు ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు తమ స్థాయిని మరచి రాజకీయనాయకులు, మంత్రులు చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సమాజంలో గౌరవమైన బోధనను పక్కనబెట్టి పదవే పరమావధిగా ఉన్నత స్థాయిలో సిఫార్సులు చేయించుకొంటున్నారు. బోధన, పరిశోధనకు లక్షలాది రూపాయలు జీతాలు తీసుకుంటూ తమ పూర్తి కాలాన్ని అదనపు పదవులకే వినియోగిస్తూ విద్యార్థులకు తీరని నష్టం కలిగిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. పదవే పరమావధి బోధన పోస్టులు భర్తీ కాకపోవడంతో అసలే బోధన సిబ్బంది కొరతగా ఉంది. దీనికితోడు పదవులపై ఆసక్తి చూపే వారి సంఖ్య అధికంగా ఉంది. దీంతో బోధన, పరిశోధన పడకేసింది. పూర్తి సామర్థ్యాలు బోధన, పరిశోధన వైపు అసిస్టెంట్ ప్రొఫెసర్లు దష్టిసారించాల్సి ఉంది. బోధన, పరిశోధన నైపుణ్యాలు పెంపొందించుకోవడానికి అవకాశం కల్పించాలి. కానీ అదనపు పదవుల్లో నియామకాలు చేస్తుండడంతో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సంప్రదాయాన్ని పాటిస్తారా.. రెండేళ్ల పదవి కాలం పూర్తి కాగానే కొత్తవారిని నియమించే సంప్రదాయం జేఎన్టీయూలో పాటిస్తున్నారు. ఓఎస్డీగా ఉన్న ఆచార్య కేఎస్ఆర్ ఆంజనేయులు మతి చెందడంతో ఆ పదవి ఖాళీ ఏర్పడింది. నెలాఖరుకు జేఎన్టీయూ రెక్టార్ ఆచార్య పాండురంగడు పదవీ విరమణ చేయనున్నారు. నవంబర్ మూడో వారానికి పలు కీలక పదవులకు రెండు సంవత్సరాల గడువు ముగియనుంది. దీంతో ఆశావహులు ఎవరి ప్రయత్నాలో ్ల వారున్నారు. భర్తీ చేయబోయే పదవుల్లో అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వాలనే డిమాండ్లు అధికమయ్యాయి.