జాతీయస్థాయి జూడో పోటీల అబ్జర్వర్‌గా ప్రకాష్
Published Thu, Sep 8 2016 1:03 AM | Last Updated on Mon, Sep 4 2017 12:33 PM
వరంగల్ స్పోర్ట్స్ : జూడో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యం లో బుధవారం నుంచి ఈనెల 11 వరకు కేరళలోని కొచ్చి రాజీవ్‌గాంధీ ఇండోర్‌స్టేడియం లో జరుగనున్న 17వ ఏషియన్ జూనియర్ జూడో చాంపియన్ పోటీలకు అబ్జర్వర్‌గా జూడో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బండా ప్రకాష్ వెళ్లనున్నా రు. ఈ మేరకు ఫెడరేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ముఖేష్‌కుమార్, మన్‌మోహన్ జైస్వాల్ ఆహ్వానాన్ని పంపిం చినట్లు బండా ప్రకాష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఏషియన్ దేశాల నుంచి సుమారు 400 మంది క్రీడాకారులు పాల్గొనే పోటీలకు అబ్జర్వర్ గా తెలంగాణ నుంచి తన కు ఆహ్వానం అందడం సం తోషంగా ఉందన్నారు.
Advertisement
Advertisement