రామాపురం : వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ కువైట్ కమిటీ సోషల్ మీడియా ఇన్‌చార్జ్‌గా జి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన శుక్రవారం కువైట్ నుంచి మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. వైఎస్‌ఆర్‌సీపీ కువైట్ కమిటీ కన్వీనర్ ఎం.బాలిరెడ్డి తనకు నియామకపు పత్రం అందజేశారన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి, ప్రధానకార్యదర్శి విజయసాయిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మేడపాటి వెంకట్, గల్ఫ్ కన్వీనర్ ఇలియాస్‌ల సహకారంతో తనకు ఈ పదవి దక్కిందన్నారు. అంతేకాక కువైట్ కమిటీ కోకన్వీనర్లు, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులకు, కమిటీ సభ్యులకు కృతజ్ఞతలను తెలియజేశారు.