రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
* బాధ్యతలు స్వీకరించిన చేవెళ్ల డీఎస్పీ శృతకీర్తి
* వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
చేవెళ్లరూరల్: చేవెళ్ల డీఎస్పీగా సీహెచ్ శృతకీర్తి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. చేవెళ్ల మండల కేంద్రంలోని శ్రీవెంకటేశ్వర ఆలయంలో మొదట ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆమె నేరుగా తన కుటుంబసభ్యులతో కలిసి మండల కేంద్రంలోని వేంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం డీఎస్పీ కార్యాలయానికి వెళ్లి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా విధులు స్వీకరించిన డీఎస్పీకి చేవెళ్ల, పరిగి సర్కిల్ సీఐలు ఉపేందర్, ప్రసాద్, ఎస్‌ఐలు స్వాగతం పలికారు.
ఆమెకు బొకేలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. పోలీస్‌శాఖలో రెండురోజుల కిత్రం జరిగిన డీఎస్పీల బదిలీల్లో భాగంగా నల్లగొండ జిల్లా ఎస్‌బీలో డీఎస్పీగా పనిచేస్తున్న శృతకీర్తి బదిలీపై చేవెళ్లకు వచ్చారు. సీఐలతో మాట్లాడి చేవెళ్ల, పరిగి సర్కిల్ పరిధిలోని విషయాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా డీఎస్పీ శృతకీర్తి మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. డివిజన్ పరిధిలోని సమస్యలపై అవగాహన కల్పించుకొని ముందుకు సాగుతానని అన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు తనవంతు కృషి చేస్తానని చెప్పారు.