రేపల్లె సబ్‌జైలు నుంచి ఖైదీ పరారీ
Published Thu, Aug 11 2016 12:24 PM | Last Updated on Mon, Sep 4 2017 8:52 AM
రేపల్లె: గుంటూరు జిల్లా రేపల్లె సబ్‌జైలు నుంచి ఓ ఖైదీ పరారైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కళ్లుగప్పి కుంచాల నాగరాజు(26) అనే ఖైదీ బుధవారం సాయంత్రం తప్పించుకున్నాడు. నాగరాజు స్వస్థలం సత్తెనపల్లి మండలం బడుగుబండ గ్రామం. దొంగతనం కేసుల్లో 5 నెలల నుంచి రేపల్లె సబ్‌జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. పరారైన ఖైదీ ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Advertisement
Advertisement