కేటీఆర్ తీరుపై నిరసన
Published Sat, Oct 1 2016 12:08 AM | Last Updated on Tue, Oct 2 2018 6:46 PM
సిరిసిల్ల టౌన్ : సిరిసిల్ల జిల్లా సాధన విషయంలో మంత్రి కేటీఆర్ తీరుకు టీఆర్‌ఎస్ కార్యకర్తల నుంచి అనుకూలంగా సంబురాలు.. ఉద్యమ కారుల నుంచి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. స్థానిక గాంధీచౌక్‌లో టీఆర్‌ఎస్ యూత్, టీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో శుక్రవారం కేటీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అయితే, సిరిసిల్లను అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చినా కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు సుంకపాక మనోజ్, గజ్జెల దేవరాజు, మెట్ట రాజు, కూర శ్రీధర్, సబ్బని హరీశ్ తదితరులు పాల్గొన్నారు. కాగా.. స్థానిక సాయినగర్‌లోని మానేరువాగు సమీప ఒర్రెలో గుర్తుతెలియని వ్యక్తులు సీఎంకేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎంపీ వినోద్‌రావు, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు చిత్రపటాలకు పిండప్రదానం చేసి నిరసన తెలిపారు.
దాడి చేసిన వారిని సస్పెండ్ చేయాలి
మంత్రి కేటీఆర్‌కు పద్మశాలిలపై ఏమాత్రం ప్రేమ ఉన్నా కౌన్సిలర్ బూట్ల రుక్కుంబాయి ఇంటికెల్లి ఆమె భర్త సుదర్శన్‌పై దాడి చేసిన టీఆర్‌ఎస్ యూత్ విభాగం కార్యకర్తలను వెంటనే సస్పెండ్ చేయాలని పద్మశాలి ప్రముఖులు డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక వస్త్రవ్యాపార సంఘంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నాయకులు గౌడ సురేశ్, గుండ్లపల్లి పూర్ణచందర్, గోనె ఎల్లప్ప, బూట్ల సుదర్శన్, బూట్ల నవీన్, గోనె ఎల్లప్ప, పంతం రవి, ఆడెపు రవీందర్, గడ్డం బాస్కర్, కాముని వనిత తదితరులు పాల్గొన్నారు.
Advertisement