నకిలీ విత్తనాలను అరికట్టాలి
నెల్లూరు(వేదాయపాళెం) : నకిలీ విత్తనాలు అరికట్టాలని వైఎస్సార్ రైతు విభాగం జిల్లా కార్యదర్శి కే మురళీనాయుడు డిమాండ్‌చేశారు. ఆదివారం నగర శివారు ప్రాంతమైన అక్కచెరువుపాడు వరి పొలాల వద్ద విభాగం ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేపట్టారు. మురళీనాయుడు మాట్లాడుతూ నాలుగు నెలల వ్యవధిలో పంట కోతకు వస్తుందని, పెట్టుబడి స్వల్పమని ఇందిరా సీడ్స్ ద్వారా 555 రకం వరి విత్తనాలను అక్కచెరువుపాడు రైతులకు అంటగట్టారన్నారు. విత్తనాలు నకిలీవి కావడంతో పంట వేసి ఐదునెలల పదిరోజులవుతున్నా చివరి దశకు రాలేదన్నారు. వెన్ను సక్రమంగా తీయడం లేదని, కొన్నిచోట్ల పైరుకు వెన్నే రాలేదన్నారు. అధికారులు విచారణ జరిపి రైతులను ఆదుకోవాలని కోరారు. వైఎస్సార్‌సీపీ నగర కార్యదర్శి బత్తల కృష్ణ, నాయకులు కూకాటి హరిబాబు, రాజ పలువురురైతులు పాల్గొన్నారు.