Duplicate seeds
-
నకిలీ విత్తన మాఫియాను వదలొద్దు
సాక్షి, హైదరాబాద్: రైతులకు నకిలీ విత్తనాలు అంటగడుతున్న మాఫియాను ఉపేక్షించవద్దని, వారిపై పీడీ యాక్ట్లాంటి కేసులతో ఉక్కుపాదం మోపాలని డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశించారు. నకిలీ విత్తన మాఫియాను అరికట్టేందుకు వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీసు కమిషనర్లు, జిల్లా వ్యవసాయశాఖ అధికారులతో కలిసి గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డీజీపీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ సమావేశంలో డీజీపీ మాట్లాడుతూ, నకిలీ విత్తనాల మాఫియాపై ఉక్కుపాదం మోపాలని అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీసు కమిషనర్లను ఆదేశించారు. నకిలీ విత్తనాల తయారీదారులు, అక్రమంగా రవాణా చేసేవారిని, విక్రయదారులను ఏమాత్రం ఉపేక్షించకూడదని, వారికి కఠిన శిక్షలు పడేలా కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో నకిలీ విత్తనాల కేసుల్లో 13 పీడీ యాక్ట్ కేసులు పెట్టామన్నారు. నకిలీ విత్తనాల ఉత్పత్తి, రవాణాను గుర్తించేందుకు క్షేత్రస్థాయి అధికారులు నిరంతర నిఘా ఉంచాలని, ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని సూచించారు. నకిలీ విత్తన కార్యకలాపాల్లో పాలుపంచుకున్న నిందితులపై పోలీసు ఠాణాల వారీగా రౌడీషీట్ తెరవాలని ఆదేశించారు. అంతేకాకుండా ఇలాంటి కార్యకలాపాలకు ఊతమిస్తోన్న వ్యక్తులను, తయారీదారులను, రవాణా చేసేవారిని, డిస్ట్రిబ్యూటర్లను, విక్రయదారులపైనా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. నిందితులందరి డేటాబేస్లను ప్రత్యేకంగా నిర్వహించాలని సూచించారు. వ్యవసాయ శాఖతో కలిసి పోలీసులు చేస్తోన్న దాడులపై ఏరోజుకారోజు ఎస్పీలు/ కమిషనర్లు పంపిన నివేదికను తాను స్వయం గా సమీక్షిస్తానని డీజీపీ వెల్లడించారు. నకిలీ విత్తన మాఫియాపై జరుగుతున్న పోరులో వ్యవసాయశాఖ అధికారులంతా పోలీసుల సాయం తీసుకోవాలని సూచించారు. అసలైన, నకిలీ విత్తనాల మధ్య వ్యత్యాసాన్ని గుర్తించడం లో పోలీసులకు అవగాహన కల్పించామన్నా రు. కార్యక్రమంలో ఏడీజీ జితేందర్ (లాఅండ్ఆర్డర్), ఇంటెలిజెన్స్ ఐజీ నవీన్ చంద్, ఐజీలు నాగిరెడ్డి, స్టీఫెన్ రవీంద్ర, ఎస్పీలు/కమిషనర్లు అన్ని ఠాణాల ఎస్‌హెచ్‌వోలు పాల్గొన్నారు. -
అధికారులే నకి‘లీలలు’ చేస్తుంటే..
సాక్షి, కర్నూలు : రైతుల నిరక్షరాస్యత, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వారికి నకిలీ, నాసిరకం విత్తనాలు అంటే ప్రయత్నం చేశారు. అదృష్టం కొద్దీ ఓ రైతు వాటిని గుర్తించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో అధికారులు నాలుక కర్చుకుని ఆ విత్తనాలు వెనక్కి తీసుకుని మరో కంపెనీతో చర్చించి విత్తనాలు తెప్పించే పనిలో పడ్డారు. జిల్లాలో 2300కు పైగా రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఉన్నాయి. వీటికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు కూడా ఉన్నారు. ఈ సంఘాలతో వెలుగు ప్రాజెక్టుకు అనుసంధానం చేసి ఇటీవల పత్తి విత్తనాలు కొనుగోలు చేశారు. ఈ మేరకు జిల్లాలో పత్తి పండించే మండలాలు హొళగుంద, ఆలూరు, కోసిగి, ఆస్పరి, నందవరం, పెద్దకడుబూరు మండలాల్లోని రైతులకు డీఆర్డీఏలోని అగ్రికల్చర్ కన్సల్టెంటివ్ సలహాతో గౌతమి సీడ్స్ సంస్థ కావేరి జాదూ కంపెనీ పత్తివిత్తనాలు 11 క్వింటాళ్లను రూ.10 లక్షల దాకా వెచ్చించి కొనుగోలు చేశారు. ఇందులో భాగంగా వారం రోజుల క్రితం హొళగుంద మండలానికి 200 ప్యాకెట్ల కావేరి జాదూ పత్తి విత్తనాలు ఒక్కొక్కటి రూ.640 ప్రకారం సంఘంలోని రైతులకు విక్రయించారు. అయితే భీమప్ప అనే రైతు తన వద్ద ఉన్న కావేరి జాదూ విత్తనాలను, వెలుగు ద్వారా వచ్చిన విత్తనాలను సరిపోల్చి చూశారు. రెండింటి మధ్యా తేడా ఉండటంతో వెంటనే మండల ఏవో నరేంద్రకుమార్‌కు ఫిర్యాదు చేశాడు. ఆ విత్తనాలను కావేరి జాదూ వారికి వాట్సాప్ ద్వారా పంపించగా అవి నకిలీగా నిర్దారించారు. ఈ విషయాన్ని వెలుగు ఏపీఎం దృష్టికి తీసుకెళ్లగా, మిగిలిన 175 ప్యాకెట్లను వెనక్కి తెప్పించి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు జిల్లా అధికారులు ఈ విషయమై విచారణ నిర్వహించారు. మొత్తంగా వచ్చిన విత్తనాలన్నింటినీ వెనక్కి తెప్పించి సదరు గౌతమ్ సీడ్స్‌కు వెనక్కి ఇచ్చారు. ఈ మేరకు ఆ సంస్థకు చెల్లించిన మొత్తాన్ని సైతం వెనక్కి తీసుకున్నారు. తాజాగా కోరమాండల్ కంపెనీ విత్తనాలు తెప్పించేందుకు డీఆర్డీఏ అధికారులు చర్చలు జరుపుతున్నారు. ఉద్యోగుల పాత్రపై అనుమానాలు విత్తన పంపిణీ పారదర్శకంగా నిర్వహించడంతో పాటు, రైతులకు నాణ్యమైన విత్తనాలు సరఫరా చేసేందుకు వెలుగు ప్రాజెక్టులో ఆయా శాఖల నుంచి ఒక్కొక్కరిని డిప్యుటేషన్‌పై నియమిస్తారు. అయితే వ్యవసాయ శాఖ నుంచి వచ్చిన ఉద్యోగి ఈ విత్తనాలను గుర్తించలేకపోయారంటే అనుమానాలకు తావిస్తోంది. తమకు విత్తనాలు మంచివే చూపించారని, రైతులకు మాత్రం నకిలీవి సరఫరా చేసి ఉంటారని ఉద్యోగులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా ఈ విత్తనాలను రైతులకు ఉచితంగా ఏమీ ఇవ్వడం లేదు. మార్కెట్‌రేటు కంటే కాస్త తక్కువగా అందజేస్తున్నారు. అయితే ఇందులోనూ కంపెనీలు కక్కుర్తి పడుతూ రైతులను నిలువునా మోసం చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో పాటు సదరు కంపెనీపై అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోకుండా విత్తనాలు వెనక్కి ఇచ్చేసి చేతులు దులుపుకోవడంపై అనుమానాలకు తావిస్తోంది. అదృష్టవశాత్తూ ఓ రైతు నకిలీ విత్తనాలను సకాలంలో గుర్తించాడు. లేకపోతే ఆ విత్తనాలతో సాగు చేసి తీవ్రంగా నష్టపోతే తమ పరిస్థితి ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం గాకుండా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. -
నకిలీ@ ఇచ్చోడ
సాక్షి, ఇచ్చోడ(బోథ్): జిల్లాలో నకిలీ విత్తనాల దందాకు కెరాఫ్ అడ్రస్ ఇచ్చోడ అయింది. గుజరాత్లో తయారవుతున్న నిషేధిత బీజీ–3 విత్తనాలు అక్కడి నుంచి ఇచ్చోడకు వయా నిజామాబాద్ మీదుగా తరలించి రైతులకు అంటగడుతున్నట్లు తెలుస్తోంది. బీజీ–3 పత్తి విత్తనాలపై నిషేధం విధించడంతో ఇక్కడి వ్యాపారులకు కలిసొచ్చినట్లయింది. బీజీ–3 విత్తనాలు విత్తుకోవడం ద్వారా పెట్టుబడులు తగ్గడమే కాకుండా కలుపు నివారణకు ఉపయోగించే గ్లైఫోసెట్ మందుల వాడకంతో అధిక దిగుబడులు పొందవచ్చని రెండేళ్లుగా వ్యాపారులు భారీగా ప్రచారం చేశారు. ఇది నమ్మిన రైతులు విత్తనాలకోసం వ్యాపారులను ఆశ్రయించడం మొదలుపెట్టారు. ఇదే అదనుగా భావించిన వ్యాపారులు గుజరాత్ నుంచి నిషేధిత బీజీ–3 విత్తనాలు దిగుమతి చేసుకుని భారీగా సొమ్ముచేసుకున్నారు. రూ.5 కోట్ల వ్యాపారం ఈఏడాది ఖరీఫ్ సీజన్లో ఇచ్చోడ కేంద్రంగా రూ.5 కోట్ల నిషేధిత బీజీ–3 విత్తనాల వ్యాపారం కొనసాగినట్లు తెలుస్తోంది. ఇచ్చోడ కేంద్రంగా జిల్లాలోని నార్నూర్, ఇంద్రవెల్లి, జైనూర్, సిరికొండ, తలమడుగు, తాంసి, భీంపూర్, నేరడిగొండ, గుడిహత్నూర్, జైనాథ్, నిర్మల్ జిల్లాలోని పెంబి, మామడ, మహారాష్ట్రలోని చికిలి, మహోర్, కిన్వట్, బొదిడి ప్రాంతాల్లో భారీగా విక్రయించినట్లు తెలుస్తోంది. 450 గ్రాములున్న ఒక్క ప్యాకెట్ రూ.వెయ్యి నుంచి 12వందల వరకు డిమాండ్‌ను బట్టి విక్రయాలు జరిపినట్లు సమాచారం. రూ.40 లక్షల నకిలీ విత్తనాలు పట్టివేత ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ 16 వరకు ఇచ్చోడ, గుడిహత్నూర్, నేరడిగొండ ప్రాంతాల్లో రూ.40 లక్షల విలువైన నకిలీ విత్తనాలను సరఫరా చేస్తుండగా పట్టుకున్న సంఘటనలున్నాయి. నేరడిగొండ టోల్ ప్లాజా వద్ద ఇచ్చోడ మండల కేంద్రానికి చెందిన పత్తి విత్తనాల దుకాణం యజమాని ముర్కుటే అంగద్ నకిలీ విత్తనాలు నింపడానికి ఉపయోగించే రూ.5లక్షల విలువైన 5 వేల ఖాళీ ప్యాకెట్లు, కెమికల్‌ను కారులో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అతన్ని రిమాండ్‌కు తరలించి దుకాణం లైసెన్సు రద్దుచేశారు. ఈ నెల 2న ఇచ్చోడ మండల కేంద్రానికి చెందిన ప్రగతి ఏజెన్సీ యజమాని ముర్కుటే ముక్తిరాంకు చెందిన మ్యాక్స్ ఫికప్ వాహనంలో రూ.6 లక్షల విలువైన నకిలీ విత్తనాలు తరలిస్తుండగా ఇచ్చోడ వద్ద వ్యవసాయశాఖ అధికారులు పట్టుకుని పోలీసులు సమాచారం అందించారు. పోలీసులు వాహనంతో పాటు విత్తనాలను సీజ్‌చేసి ముక్తిరాంపై కేసు నమోదు చేశారు. కాగా పదిహేను రోజుల నుంచి ముక్తిరాం పరారీలో ఉన్నాడు. అతని షాపు లైసెన్సు రద్దు చేయడానికి వ్యవసాయశాఖ జిల్లా అధికారులకు సిఫార్సు చేశారు. ఐదురోజుల కిత్రం సాయికృప ట్రేడర్స్‌కు చెందిన అడవ్ గంగాధర్‌కు చెందిన రూ.25 లక్షల విలువైన నకిలీ విత్తనాలు తరలిస్తుండగా వ్యవసాయ శాఖ, విజిలెన్స్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు సంయక్తంగా పట్టుకున్నారు. గంగాధర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నార్నూర్ మండల కేంద్రంలోని గంగాధర్‌కు చెందిన సాయినాథ్ ట్రేడర్స్ లైసెన్స్ రద్దుకు ఆధికారులు నివేదిక అందజేశారు. ఈ సంఘటనలో గంగాధర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించగా అడవ్ రవికాంత్, అడవ్ సాయినాథ్, సుధాకర్ నాలుగు రోజుల నుంచి పరారీలో ఉన్నారు. గుడిహత్నూర్ మండలంలోని మాన్నూర్ వద్ద రెండురోజుల క్రితం రూ.2 లక్షల నకిలీ పత్తి విత్తనాలను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. తీగా లాగితె డొంకంతా కదిలింది.. నకిలీ విత్తనాల దందాపై ‘సాక్షి’వరుస కథనలు ప్రచురించడంతో వ్యవసాయశాఖ, విజిలెన్స్ ఎన్ఫోర్స్ మెంట్ ఆధికారులు రంగంలోకి దిగారు. ఇచ్చోడ కేంద్రంగా సాగుతున్న నకిలీ పత్తి విత్తనాల దందాపై ఆరా తీశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ట్రాన్స్‌పోర్టులపై విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. శ్రీకాంత్ అండ్ కంపనీ పేరుతో మూడు నెలలుగా గుజరాత్ నుంచి పార్శిల్ వస్తున్నట్లు తెలుసుకున్నారు. దానిపై ఆరా తీశారు. ఇచ్చోడ మండల కేంద్రానికి చెందిన సాయికృప ట్రేడర్స్‌కు చెందిన కంపనీగా గుర్తించారు. ట్రాన్స్‌పోర్టుకు సంబంధించిన ఎల్లార్ను వెతికి పట్టుకున్న అధికారులు గుజరాత్ నుంచి నేరుగా నిజామాబాద్‌కు వచ్చే ట్రాన్స్‌పోర్టులో తనిఖీలు నిర్వహించారు. తనిఖీలు నిర్వహించిన రోజే శ్రీకాంత్ అండ్ కంపనీకి చెందిన 12 సంచులలో 1250 ప్యాకెట్ల నకిలీ విత్తనాలు ట్రాన్స్‌పోర్టులో దొరికాయి. ఇప్పటి వరకు గుజరాత్ నుంచి ఈ కంపనీ పేరుపై రూ.కోటి 12 లక్షల విలువ చేసే విత్తనాలు సరఫరా అయినట్లు అధికారులు గుర్తించారు. ఏజెంట్ల అరెస్టుకు రంగం సిద్ధం.. ఇచ్చోడ కేంద్రంగా భారీగా నకిలీ పత్తి విత్తనాల వ్యాపారులు గ్రామీణ ప్రాంతాల్లో సబ్‌డీలర్లను ఉపయోగించుకున్నారు. వారి ద్వారా రైతులకు అంటగట్టారు. నకిలీ విత్తనాల కేసుల్లో అరెస్టయిన వ్యాపారులు నుంచి పోలీసులు సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. ఈ సమాచారం ఆధారంగా ఏజెంట్ల అరెస్టుకు పోలీసులు సర్వం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. వరుసగా ఇచ్చోడకు చెందిన వ్యాపారులు నకిలీ విత్తనాల కేసులో పట్టుబడడంతో జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. -
నకిలీ.. విచ్చలవిడి!
అధికారులు వద్దన్నా రైతులు ఈ ఏడాది కూడా పత్తివైపే మొగ్గు చూపారు. ఈ ప్రాంతంలో ప్రధాన వాణిజ్య పంటగా పత్తిని సాగుచేయడం అనాదిగా వస్తోంది. దీన్ని ఆసరాగా చేసుకున్న కొందరు విత్తన వ్యాపారులుకాలం చెల్లిన, నకిలీ, నాసిరకం విత్తనాలను రైతులను అంటగట్టి రూ.లక్షలు దండుకుంటున్నారు. జడ్చర్ల : కొన్నేళ్లుగా జడ్చర్ల కేంద్రంగా పత్తి విత్తనాల విక్రయాలు జోరుగా.. వివాదాస్పదంగా కొనసాగుతున్నాయి. వివిధ కంపెనీల పేరుతో బీటీ–2 పత్తి విత్తనాలను వ్యాపారులు లెక్కకు మించి విక్రయిస్తున్నారు. అనుమతి ఉన్న విత్తనాల చాటునే అనుమతి లేని, కాలం తీరిన విత్తనాలను సైతం రైతులకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. స్థానికంగా తయారు చేసిన పత్తి విత్తనాలను వివిధ కంపెనీల పేరుతో ముద్రించిన కవర్లలో ప్యాక్ చేసి విక్రయానికి పెడుతున్నారు. ప్రతీసారి అధికారులు దాడులు చేసిన సమయంలో లూజ్ విత్తనాలు, ఖాళీ కవర్ ప్యాకెట్లు లభిస్తుండడంతో రైతులనుంచి వచ్చే ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు విత్తన విక్రయాలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలుగా నిర్వహిస్తున్నారు. ఎక్కడా పారదర్శకంగా విత్తన విక్రయాలు జరగడం లేదన్నది నగ్నసత్యం. విత్తనాల తయారీ సంస్థల పూర్తి వివరాలు, ఆయా కంపెనీల అనుభవం, రిమార్కులు కూడా ఆన్లైన్లో సంబంధిత అధికారుల వద్ద ఉంచాల్సి ఉన్నా కంపెనీలు పెద్దగా పట్టించుకోవడం లేదు. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న విత్తన కంపెనీలు ఎంతమేరకు పారదర్శకంగా వ్యవహరిస్తున్నాయో తెలియని పరిస్థితి ఉంది. సమాచారాన్ని రైతు ముంగిట్లోకి తీసుకువచ్చినప్పుడే రైతులు తమకు కావలసిన విత్తనాలను ఎంపిక చేసుకునే పరిస్థితి ఉంటుంది. కానీ ఇవేమి రైతు దరికి చేరకపోవడంతో వ్యాపారి చెప్పిన మాటలే రైతుకు శిరోదార్యమవుతున్నాయి. జాడలేని సమాచారం విత్తన కంపెనీల వివరాలు, ప్రభుత్వం నిర్ణయించిన ధరలు, స్టాక్ వివరాలు తదితర సమాచారం రైతులకు అందుబాటులో ఉంచాలన్న నిబంధనలను వ్యాపారులు బేఖాతరు చేస్తున్నారు. కొనుగోలు సమయంలో రైతులకు సరైన బిల్లులు ఇవ్వాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. ఒక వేల బిల్లులు ఇచ్చానా వాటిపై అందుకు సంబంధించిన బ్యాచ్, లాట్ నంబర్లు వంటి పూర్తి వివరాలు పొందుపరచడం లేదు. సరఫరా అయిన బీటీ–3 విత్తనాలు ప్రభుత్వం నిషేధించిన బీటీ–3 విత్తనాలను కొందరు వ్యాపారులు ఇప్పటికే రైతులకు రహస్యంగా అంటగట్టేశారు. గత ఏడాది కూడా ఈ తంతు గోప్యంగా సాగింది. ఈ ఏడాది కూడా బీటీ–3 విత్తనాలను తమకు అనుకూలంగా ఉ న్న రైతులకు వ్యాపారులు విక్రయించే పనిలో నిమగ్నమయ్యారు. గత ఏడాది బీటీ–2 విత్తనాలకు గులాబీ రంగు పురుగు, ఇతర తెగుళ్లు ఆశించడాన్ని ఆసరగా చేసుకున్న వ్యాపారులు ఈసా రి బీటీ–3 విత్తనాలను పెద్ద మొత్తంలో రైతులకు అంటగట్టేందుకు కుట్రపన్నారు. బీటీ–3 విత్తనాలకు సంబం ధించి కలుపు నివారణ మందులు వినియోగించే పరిస్థితి ఉండడంతో పాటుగా తెగుళ్లు, ఇతర కీటకాలను తట్టుకునే పరిస్థితి ఉందని ప్రచారాన్ని చేస్తున్నారు. దీంతో రైతులు బీజీ–3 విత్తనాల వైపు మొగ్గు చూపుతున్నారు. భూత్పూర్ అడ్డాగా విక్రయాలు భూత్పూర్ కేంద్రంగా అనుమతి లేని, నకిలీ పత్తి విత్తనాలను మార్కెట్లోకి భారీగా విక్రయిస్తుంటారు. గత కొన్ని సంవత్సరాలుగా మిగిలిన విత్తనాలను ప్యాక్ మార్చి అంటగడుతున్నా రు. అంతేగాక జిన్నింగ్ చేసిన విత్తనాలకు రంగులేసి బీటీ విత్తనాలుగా ప్యాకెట్లలో నింపి విక్రయిస్తున్నారు. తక్కువ ధరల ముసుగుతో పాటు వ్యాపారులకు పెద్ద ఎత్తున కమీషన్లు, బంపర్ ఆఫర్లు ప్రకటించడంతో వ్యాపారులు పనికి రాని విత్తనాలను రైతులకు అంటగడుతున్నారు. వ్యాపారులేమో సింగపూర్, బ్యాంకాక్ వంటి దేశాల్లో చక్కర్లు కొడుతుండగా రైతులు నాసిరకం పంటలు సాగుచేసి దిగుబడులు రాక అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నారు. అధికారులు దృష్టి సారించాలి నాణ్యమైన విత్తనాలు మాత్రమే రైతులకు అందే విధంగా అధికారులు ముం దస్తు చర్యలు చేపట్టాలి. మరో రెండు నెలల్లో సీజన్ ప్రారంభం అవుతుంది. ముందుగానే చర్యలు చేపట్టి అప్రమత్తం చేస్తే మార్పు కనిపిస్తుంది. అదేవిధంగా బీజీ–3 విత్తనాలను మార్కెట్లోకి రా కుండా అడ్డుకోవాల్సిన అవసరముంది. వ్యాపారులు పారదర్శకంగా వ్యవహరించేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. గ్రామాల్లో రైతులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టి సూచనలు చేయాల్సిన అవసరముంది. రైతులు అప్రమత్తంగా ఉండాలి రైతులు అధికారులు సూచించిన నాణ్యమైన విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలి. లైసెన్స్ ఉన్న వ్యాపారి దగ్గరే కొనుగోలు చేసి తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలి. బీటీ–3 పత్తి విత్తనాలను ఎట్టి పరిస్థితుల్లో సాగు చేయవద్దు. ఎవరైనా అమ్మితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. – నిర్మల, ఏడీఏ, జడ్చర్ల -
నట్టేట ముంచిన ‘నకిలీ’లు
కొణిజర్ల : పంట వేయడానికి విత్తనాలు మేమే ఇస్తాం.. కొంత పెట్టుబడి మేమే పెడతాం.. మీరు పండించిన పంటను తిరిగి మేమే కొనుగోలు చేస్తాం.. మీరు చేసేదల్లా జాగ్రత్తగా పంటను పండించడమే.. ఇక మీకు లాభాలే లాభాలు.. ఎకరానికి రూ.40 వేల నుంచి రూ. 50 వేలు మిగులుతాయి.. కొత్త రకం పంట ఇది.. విదేశాల్లో ఔషదాల తయారీలో ఉపయోగించే కాయలు ఇవి.. మీరు పండించండి.. లాభాలు గడించండి.. అని కంపెనీ ప్రతినిధులు నమ్మబలికారు. నిజమే కాబోలు అని అక్కడి వారు నమ్మేశారు. కాయలు కాశాయి.. దిగుబడి వచ్చింది.. విక్రయించే సమయానికి ఆశించిన రీతిలో పరిస్థితులు లేవు. మీ ప్రాంత వాతావరణం పంటకు సరిపోలేదు.. ఈ కాయలకు మార్కెట్లో రేటు ఉండదు అని కొనకుండా వెనుదిరిగి పోయారు. దీంతో తామంతా మోసపోయామని రైతులు లబోదిబోమంటున్నారు. ఈ ఘటన మండలంలోని తుమ్మలపల్లిలో జరిగింది. తుమ్మలపల్లికి చెందిన కుంచపు సీతారాములు, దండు ఆదినారాయణ, చల్లా ఆదినారాయణ, ఉప్పతల వీరయ్య, జోగు సత్యనారాయణ, బండారు వెంకన్న, మరికొంత మంది రైతులు ఓ ప్రైవేట్ కంపెనీ చెప్పిన మాయమాటలు నమ్మి గిర్ కీని అనే రకం పంట విత్తనాలు పెట్టారు. కీరా దోస రకం లాగానే ఉండే ఈ కాయలు ఔషదాల తయారీలో వినియోగిస్తారని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. రెండు రకాల కాయలను గ్రేడింగ్ చేసి కిలో రూ.18, రూ.14 చొప్పున కొనుగోలు చేస్తామని చెప్పడంతో రైతులు నమ్మారు. తలా ఎకరం, రెండు ఎకరాల్లో విత్తనాలు పెట్టారు. 14 మంది రైతులు సుమారు 20 ఎకరాల్లో సాగు చేశారు. కంపెనీ ప్రతినిధులే పెట్టుబడి పెట్టారు. పై మందులు, కూలీల ఖర్చు, ఇతర రసాయన ఎరువులు అంతా కలిపి రైతులకు ఎకరానికి రూ. 20 వేలు వరకు ఖర్చు వచ్చింది. అంతవరకు బాగానే ఉంది. పంట చేతికి వచ్చిన తర్వాత కంపెనీ ప్రతినిధులు కొనుగోలుకు వచ్చారు. వారి రెండు రకాల జల్లెడలు తెచ్చారు. గిర్కీని కాయలను ఆ జల్లెడలో వేసి పట్టారు. తమకు కావాల్సిన సైజ్ కాయలు మాత్రమే కొనుగోలు చేసుకుని వెళ్లి పోతున్నారు. మిగిలిన కాయలను రూ. 3, రూ. 4లకు కొనుగోలు చేస్తామని చెప్పారు. రోజుకు ఒక్కో కూలీ 10 కిలోల కాయలు కూడా కోయడం లేదు. దీంతో పంటకు వచ్చే రేటు కూలీలకు ఇచ్చే కూలికి కూడా సరిపోవడం లేదు. గత రెండు రోజుల క్రితం వచ్చిన కంపెనీ ప్రతినిధులు.. మీ ప్రాంతం ఈ పంటకు అనుకూలంగా లేదని, పంట కొనుగోలు చేయలేమని, ఈ పంట మార్కెట్లో అమ్ముడు పోవడంలేదని చెప్పారని రైతులు తెలిపారు. దీంతో చేసేది లేక పశువులను మేపుతున్నారు. కొనకపోతే పారబోశా.. గిర్కీనీ కీరా దోసకాయలను సాగు చేశా. దొండకాయల సైజ్ కాగానే కోయాలి. అలా కాకుండా ఒక్క రోజు ఆగినా అవి భారీగా పెరిగిపోతున్నాయి. సైజ్ పెరిగిన కాయలను తీసుకోవడం లేదు. 11 బస్తాల కాయలను ఖమ్మం మార్కెట్‌కు తీసుకువెళితే కొనలేదు. దీంతో అక్కడే పారబోసి వచ్చా. – కుంచపు సీతారాములు, తుమ్మలపల్లి రూ. 40 వేలు నష్టపొయా.. రెండు ఎకరాలలో సాగు చేశా. ఒక్కసారి మాత్రమే పంట కోయించా. రెండు క్వింటాల కాయలు వస్తే రూ. 15 చొప్పున కొనుగోలు చేశారు. మిగిలివి వాటిని రూ. 3 చొప్పున కొనుగోలు చేశారు. కూలీలకు పెట్టిన డబ్బులు కూడా రాలేదు. రూ. 40 వేల వరకు నష్టపోయా. కంపెనీ వారే ఆలోచించాలి. – దండు ఆదినారాయణ, తుమ్మలపల్లి -
ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు: కె. లక్ష్మణ్
సూర్యాపేట అర్బన్/కోదాడ అర్బన్: రాష్ట్రంలో ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. గురువారం సూర్యాపేటలో, కోదాడలలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలతో విసిగివేసారిన ప్రజలు.. టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా ఉన్న తమవైపు ఆకర్షితులవుతున్నారన్నారు. పంటలు దెబ్బతిని రైతులు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్యం ఎలాంటి సహాయం అందజేయడం లేదని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా నాసిరకం విత్తనాలు సరఫరా అయితే చిన్న స్థాయి ఉద్యోగుల మీద చర్యలు తీసుకొని చేతులు దులుపుకున్నారని విమర్శించారు రైతులకు ఎకరానికి రూ.8 వేలు ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం మోసపూరితమని, అది భూస్వాములకు లబ్ధి చేకూర్చే విధంగా ఉందన్నారు. దీనివల్ల కౌలు రైతులకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. -
‘తెల్ల’ బంగారం.. విత్తు కలవరం!
నకిలీ పత్తి విత్తనాల అడ్డా కర్నూలు - బీటీ విత్తనాలపై లోపించిన నిఘా - ఇతర జిల్లాలకు ఇక్కడి నుంచే రవాణా - ఖరీఫ్ సీజన్ మొదలవుతుండటంతో జోరుగా విక్రయాలు - గ్రామాల్లో కిలోల చొప్పున దందా - మౌనం వీడని వ్యవసాయ శాఖ గత ఏడాది ఏప్రిల్ నెలలో కర్నూలు ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో వ్యవసాయ, విజిలెన్స్ అధికారులు దాడులు చేసి ప్రాసెసింగ్ చేసి గ్రామాలకు తరలించేందుకు సిద్ధం చేసిన 268 కిలోల నకిలీ బీటీ పత్తి విత్తనాలు సీజ్ చేశారు. హొళగుంద మండలంలో గత ఏడాది మేలో వ్యవసాయ, పోలీసు అధికారులు తనిఖీలు నిర్వహించి 148 కిలోల బీటీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. గత ఏడాది ఏప్రిల్ నుంచి జూలై వరకు వ్యవసాయాధికారులు జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించి దాదాపు రూ.కోటి విలువ చేసే బీటీ పత్తి విత్తనాలపై స్టాప్ సేల్ విధించారు. ఈ సీజన్లో మొదటిసారి ఎమ్మిగనూరులో 60 నకిలీ బీటీ విత్తన ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు. వాస్తవానికి గ్రామాల్లో ఇప్పటికే నకిలీ బీటీ పత్తి విత్తన ప్యాకెట్ల విక్రయం జోరుగా సాగుతున్నా అధికారులు తనిఖీలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. కర్నూలు(అగ్రికల్చర్): ఖరీఫ్ ముంచుకొస్తున్న తరుణంలో నకిలీ పత్తి విత్తనాల బెడద రైతులను కలవరపరుస్తోంది. గత ఏడాది జిల్లాలో 1.76 లక్షల హెక్టార్లలో పత్తి సాగయింది. నకిలీల కారణంగా మొక్కలు ఏపుగా పెరిగినా పూత, కాయ రాకపోవడంతో రైతులు పంట నష్టపోయారు. పత్తికొండ, ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, కర్నూలు నియోజకవర్గాల్లో దాదాపు 5వేల హెక్టార్లలో పంటలు దెబ్బతినడం గమనార్హం. ఈ నకిలీ వ్యాపారంలో కొందరు టీడీపీ నేతలు క్రియాశీలకంగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆదోని రెవెన్యూ డివిజన్లో దాదాపు 80 శాతం గ్రామాల్లో టీడీపీ వర్గీయులు ఈ వ్యాపారం సాగిస్తున్నట్లు సమాచారం. అందువల్లే వ్యవసాయాధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. గత ఏడాది మొత్తం మీద పంట దిగుబడులు ఆశాజనకంగా ఉండటం, గులాబి రంగు పురుగు బెడద తగ్గడం.. ధరలు కూడా మెరుగ్గా ఉండటంతో ఈ ఏడాది పత్తి భారీగా సాగయ్యే అవకాశం ఉంది. జిల్లా యంత్రాంగం 2.05 లక్షల హెక్టార్లలో పత్తి సాగు కావచ్చని అంచనా వేసింది. ప్రభుత్వం జిల్లాకు వివిధ కంపెనీలకు చెందిన 10.15 లక్షల బీటీ విత్తన ప్యాకెట్లు కేటాయించింది. అయితే ఇంతవరకు బీటీ విత్తన ప్యాకెట్లు పొజిషన్ కాలేదు. ఖరీఫ్ సీజన్ ముంచుకొస్తుండటంతో నకిలీ బీటీ పత్తి విత్తనాల బెడద అధికమైంది. ఇటీవల ఎమ్మిగనూరు మండలంలో 60 ప్యాకెట్ల నకిలీ విత్తన ప్యాకెట్లు పట్టుబడ్డాయి. తాజాగా పత్తికొండ మండలం కనకదిన్నెలో నాలుగు క్వింటాళ్ల నకిలీ విత్తనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోనే కాకుండా.. గుంటూరు, ఒంగోలు జిల్లాలకూ ఈ నకిలీలు తరలివెళ్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఆకర్షణీయమైన ప్యాకింగ్ నకిలీ విత్తనాలపై రైతులకు అనుమానం రాకుండా పేరొందిన కంపెనీలు, వాటి విత్తన రకాల పేర్లతో ఆకర్షణీయమైన ప్యాకింగ్‌లో విక్రయిస్తుండటం గమనార్హం. కర్నూలు సబ్ డివిజన్‌తో పాటు ఆదోని డివిజన్లోని దాదాపు ప్రతి గ్రామంలో నకిలీ విత్తన వ్యాపారులు ఉన్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతులు సొంతంగా విత్తనోత్పత్తి చేసుకుని విక్రయించుకోవచ్చు. కానీ కొందరు అక్రమార్కులు పత్తి జిన్నింగ్ మిల్లుల నుంచి విత్తనాలు సేకరించి ప్రాసెసింగ్ చేసే రంగులు అద్ది, అందగా ప్యాక్ చేసి బీటీ–2 పేర్లతో మార్కెట్లోకి సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. ట్రాన్స్‌పోర్టు కంపెనీల ద్వారా కూడా నకిలీ బీటీ విత్తనాలు ఇతర జిల్లాలకు తరలుతున్నట్లు సమాచారం. కొరవడిన తనిఖీలు ఖరీఫ్ సీజన్ ముంచుకొస్తున్నా నకిలీ విత్తనాలపై ఇటు వ్యవసాయ శాఖ, అటు విజిలెన్స్ అధికారులు దృష్టి సారించడం లేదు. గత ఏడాది జనవరి నెల నుంచే నకిలీ బీటీ విత్తనాలపై దాడులు చేసి నకిలీ విత్తనాలను సీజ్ చేశారు. ఈసారి తనిఖీలు కొరవడ్డాయి. నిఘా లేకపోవడంతో అక్రమార్కులు గుట్టుచప్పుడు కాకుండా నకిలీ విత్తనాలను తరలిస్తున్నట్లు తెలుస్తోంది. అనధికార విత్తనాలు కొనొద్దు రైతులు గ్రామాల్లో విక్రయించే అనధికార విత్తనాలు కొనుగోలు చేయరాదు. లైసెన్స్ కలిగిన డీలర్ వద్దనే విత్తనాలు కొనుగోలు చేసి బిల్లు తీసుకోవాలి. నకిలీ విత్తనాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నాం. అనధికారికంగా ఎవరైనా విత్తనాలు విక్రయిస్తున్నట్లు తెలిస్తే వ్యవసాయాధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు. - ఉమామహేశ్వరమ్మ, జేడీఏ -
‘బయో’త్పాతం
రైతులను నిండాముంచిన ఆర్పీ బయో –226 నకిలీ విత్తనం ఆలస్యంగా విచారణ చేపట్టిన అధికారులు వందలాది ఎకరాల్లో దెబ్బతిన్న వరి పంట పెద్దాపురం : రైతన్నకు బాసటగా నిలుస్తామన్న ప్రభుత్వం నట్టేట ముంచింది. ప్రభుత్వం సబ్సిడీపై ఇచ్చిన ఆర్పీ బయో–226 వరి విత్తనమే వారి పాలిట శాపమైంది. రూ.లక్షలు ఖర్చు చేసి సాగు చేస్తున్న పంట ఎదుగుదల లేకపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నా పట్టించుకోని ప్రభుత్వ, అధికార యంత్రాంగంపై పెద్దాపురం మండలం గోరింట రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్దాపురం మండల పరిధిలో సుమారు 8 వేల హెక్టార్లలో వరి పండిస్తున్నారు. గతంలో ప్రభుత్వం సరఫరా చేసిన ఇదే రకం వరి వంగడం వల్ల మండలంలోని జె.తిమ్మాపురం, వడ్లమూరు, చినబ్రహ్మదేవం గ్రామాలో వందల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినా అధికారులు ఆలస్యంగా స్పందించారు. మళ్లీ అదే పరిస్థితి గోరింటలో ఆలస్యంగా వెలుగుచూసింది. అధికార యంత్రాంగం గోరింట పొలాలను పరిశీలించి రైతులు విత్తనాన్ని కొనుగోలు చేసిన దివిలి లక్ష్మి ఏజెన్సీస్ నుంచి స్టాక్ వివరాలు, విత్తన సరఫరాపై ఆరా తీశారు. ప్రధానంగా ఆర్పీ బయో 226 విత్తనంలో కేళీ సమస్య ఏర్పడడంతో ఎకరాకు రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది.ఈ విత్తనాన్ని మండలంలో సుమారు 220 ఎకరాల్లో సాగు చేయడంతో సుమారు 150 మంది రైతులు నష్ట పోతున్నారు. ఏజెన్సీ, దళారుల చేతిలో అమాయక రైతులు ప్రభుత్వం సబ్సిడీపై సరఫరా చేసిన విత్తనం ఎరువుల ఏజెన్సీలు, దళారులకు వరంలా మారింది. చాలా ఏజెన్సీలు రైతుల పేరిట సబ్సిడీపై విత్తనాన్ని కొనుగోలు చేసి ఒక్కో బస్తా రూ.1050కు విక్రయించి లాభాలు ఆర్జిస్తున్నారు. ఇదే సమస్యపై గతంలో రైతులు డీలర్లు, అధికారులను నిలదీస్తే సెటిల్మెంట్లతో తప్పించుకున్న వైనాలున్నాయి. కానీ దివిలి లక్ష్మి ఏజెన్సీస్ డీలర్ పోలారావుపై శుక్రవారం రైతుమండిపడ్డారు. డీలర్ అధికారుల దృష్టికి తీసుకువెళితే ఈ విత్తనాన్ని విక్రయించవవద్దని చెప్పినా విక్రయించడంపై అధికారులు నిలదీశారు. అధికారులు రైతులతో మాట్లాడారు. జరిగిన దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకుంటామనడంతో రైతులు ఆందోళన విరమించారు. -
'మంత్రి ప్రోద్భలంతోనే నకిలీ విత్తనాల విక్రయం'
-
'మంత్రి ప్రోద్భలంతోనే నకిలీ విత్తనాల విక్రయం'
గుంటూరు : తుపాను, వరద, కరువు, పుష్కరాలు ఇలా ప్రతి అంశాన్ని అవకాశంగా మలుచుకుని ముఖ్యమంత్రి నుంచి టీడీపీ కార్యకర్తల వరకు ప్రజా ధనాన్ని దోచుకుతింటున్నారని వైఎస్సార్ సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. గుంటూరులోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రెయిన్ గన్స్, సీసీఐ పత్తి కుంభకోణం, నకిలీ విత్తనాల వ్యవహారంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సిట్ ఏర్పాటు చేసి సమగ్రంగా దర్యాప్తు చేయించాలన్నారు. కేబినెట్ సమావేశం తర్వాత ముఖ్యమంత్రి నకిలీ విత్తన కంపెనీలపై కఠిన చర్యలు తీసుకుని పీడీ యాక్టు పెడుతున్నామని హడావుడి చేశారన్నారు. వారం రోజులు గడిచింది.. ఎంతమందిపై చర్యలు తీసుకున్నారో చెప్పాలని బొత్స డిమాండ్ చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి భాగస్వామ్యం, ప్రోద్బలంతోనే నకిలీ విత్తనాల వ్యాపారం జరిగిందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. కల్తీ విత్తనాలతో నష్టపోయిన రైతులకు పరిహారం ఎప్పటిలోగా ఇస్తారో చెప్పాలన్నారు. రాష్ట్రంలోని రెండు కోట్ల మంది రైతుల సమస్య అని, వారిని ఆదుకుని సమస్య పరిష్కరించాలనేది ప్రతిపక్ష నేత వైఎస్ జగమోహన్‌రెడ్డి డిమాండ్ అని పేర్కొన్నారు. అలసత్వం వహిస్తే రైతుల తరఫున పోరాటం చేస్తామని హెచ్చరించారు. అలాగే కర్నూలు జిల్లాలో ఉల్లి రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెలకొందన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంగా కృష్ణమూర్తి, రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, పొన్నూరు, పెదకూరపాడు, తాడికొండ నియోజకవర్గాల సమన్వయకర్తలు రావి వెంకటరమణ, కావటి మనోహర్‌నాయుడు, కత్తెర హెని క్రిస్టినా, కిలారి రోశయ్య పాల్గొన్నారు. -
‘బయో’త్పాతం
ఆర్పీ బయో 226 వరి వంగడం సాగుతో 30 శాతానికిపైగా దిగుబడి నష్టం ఏపీ సీడ్ విత్తనాల్లో సగం వరకూ కల్తీ ఈనిక దశలో కేళీలు ప్రత్యక్షం లబోదిబోమంటున్న రైతులు వరమివ్వాల్సిన వారే శపించిన చందంగా వ్యవసాయ శాఖ అధికారులు చేతుల మీదుగా పంపిణీ చేసిన విత్తనాలే నష్టాల బాటలోకి నెట్టేశాయి. అన్నీ పరిశోధించి ... పరిశీలించి ఇచ్చిన విత్తనాలన్న ధీమాతో సాగు చేస్తే కేళీగా మారి రైతన్న బతుకులను ఎగతాళి చేశాయి. నష్టాల్లో ఉన్న కర్షకులను మరింత కష్టాల్లోకి నెట్టేశాయి. ఎకరాకు సగం పంట కూడా రాకపోవడంతో ఏం చేయాలో తెలియక అన్నదాతలు అయోమయంలో పడ్డారు. రాజమహేంద్రవరం రూరల్/జగ్గంపేట : వ్యవసాయశాఖ రాయితీపై సరఫరా చేసిన వరి విత్తనాలు రైతులను నట్టేటా ముం చాయి. బీపీటీ 5204 (బొండాలు)కు ప్రత్యామ్నాయంగా రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ (ఏపీ సీడ్స్) సొసైటీల ద్వారా సరఫరా చేసిన ఆర్పీబయో 226 వరి రకానికి కేళీల సమస్య ఉత్పన్నమైంది. ఇది దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలే చెబుతున్నారు. ఈ రకానికి సుమారు ఐదు నుంచి ఆరు రకాల సంకర జాతి విత్తనాలు తోడవడంతో ఈనిక దశలో వెన్నులు కాక కేళీలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వ్యవసాయ అధికారుల సూచనలతోనే... చంద్రన్న వ్యవసాయ ప్రదర్శన క్షేత్రాలు ద్వారా రైతులకు బీపీటీ 5204కు బదులుగా ఆర్పీ బయో 226 వరి రకాన్ని వేయాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారులు సూచించారు. ఏపీ సీడ్స్ ద్వారా 1044.90 క్వింటాళ్ల విత్తనాలను జిల్లాలోని రైతులకు సరఫరా చేశారు. జగ్గంపేట, రంగంపేట, యు.కొత్తపల్లి, గొల్లప్రోలు, పిఠాపురం, రాజమహేంద్రవరం రూరల్, జగ్గంపేట మండలాల్లో రైతులు ఈ విత్తనాలతో సాగు చేపట్టారు. ప్రస్తుతం ఈనిక దశలో ఉన్న పంటలో వెన్నులు కాక కేళీలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కేళీలు 20 నుంచి 25 శాతం ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నా రైతులు మాత్రం 50 శాతంపైనే ఉంటుందన్నారు. పంట చేతికి వచ్చినా కేళీలు ఎక్కువగా ఉండడంతో ధాన్యాన్ని కొనేవారు ఉండరన్నారు. రాజమహేంద్రవరం రూరల్, యు.కొత్తపల్లి, గొల్లప్రోలు, రంగంపేట, జగ్గంపేట, గండేపల్లి, ప్రత్తిపాడు, ఏలేశ్వరం మండలాల్లో ఇవి అధికంగా ఉన్నాయి. కేజీకి రూ.5 సబ్సిడీ చొప్పున రైతులకు రాయితీగా ఈ రకాన్ని జగ్గంపేట మండలంలోని మెట్టప్రాంతంలో తదితర ప్రాంతాల రైతులకు అందజేశారు. ఒక్క జగ్గంపేట వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో 167 ఎకరాల్లో ఈ విత్తనంతో సాగు చేశారు. పండిన పంటలో సగం వరకు కేళి ఉండడంతో తాము మోసపోయామని రైతులు ఆందోళన చెందుతున్నారు. అసలైన ఆర్పీ బయో చేను మాత్రం ప్లవరింగ్ దశలోనే ఉన్నాయని, నకిలీలతో మోసపోయామని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలి వ్యవసాయాధికారుల సూచనల మేరకు ఆర్పీబయో 226 వరి రకాన్ని మూడు ఎకరాల్లో సాగుచేశాను. పొలంలో 50 శాతానికి పైగా కే ళీలు ఉన్నాయి. ప్రభుత్వమే రైతులకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలి. – సుంకవల్లి అప్పారావు, రైతు, తొర్రేడు ఎకరాకు రూ.15వేలు వరకు నష్టం... వ్యవసాయ శాఖ అధికారుల ప్రోత్సహంతో ఏపీ సీడ్ నుంచి ఆర్పీ బయో 226 వరకు వరి వంగడం విత్తనాలను తీసుకునే సాగు చేశాం. కేళి సగం వరకు ఉంది. ఇది పనికిరాదు. ఇప్పటికే రూ.15వేలు వరకు ఎకరాకు పెట్టుబడులు పెట్టాం. కోతలు పూర్తయ్యేందుకు మరో రూ.10 వేలు అవసరమవుతాయి. కల్తీ విత్తనాలు కాకుండా రూ.15 వేల నుంచి 20 వేల వరకు నష్టపోయే అవకాశం ఉంది. ప్రభుత్వం ఆదుకోవాలి. – జాస్తి వీరభద్రరావు, రైతు, కాట్రావులపల్లి. దిగుబడి తగ్గే అవకాశం... ఆరు ఎకరాల్లో ఆర్పీ బయో వరిరకాన్ని సాగుచేశాం. ఎకరానికి రూ.37 వేలు ఖర్చు అయ్యింది. కేళీల కారణంగా దిగుబడి బాగా తగ్గే అవకాశం ఉంది. వ్యవసాయాధికారులే రైతులకు నష్టపరిహారం అందించాలి. – కొత్తపల్లి రామకృష్ణ, కౌలురైతు, తొర్రేడు రైతులు చెప్పింది నిజమే ఆర్పీ బయో 226 రకం వరి విత్తనాలను ఏపీ సీడ్ ద్వారా రైతులకు అందజేశాం. ప్రస్తుతం చేను బాగుంది. కల్తీ ఎక్కువగా ఉండడంతో కేళి కనిపిస్తుంది. దీనిపై మార్టేరు శాస్త్రవేత్తల బృందం పరిశీలించారు. 30 శాతానికిపైగా కేళీ ఉన్నట్టు వారు తెలిపారు. రైతులను ఆదుకునేందుకు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు చేస్తున్నాం. – ఎల్.రాంబాబు, వ్యవసాయాధికారి, జగ్గంపేట -
నకిలీ విత్తన విక్రేతలపై చర్యలు
కలెక్టర్ ఆర్ ముత్యాలరాజు నెల్లూరు(పొగతోట): నకిలీ విత్తనాలు, ఎరువుల విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆర్ ముత్యాలరాజు సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ తన చాంబర్లో వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నకిలీ విత్తనాలు, ఎరువులు మార్కెట్లోకి రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతుల అవసరాల మేరకు ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. విత్తనాలు, ఎరువులు బ్లాక్‌లో విక్రయించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఏ మహమ్మద్‌ఇంతియాజ్, వ్యవసాయ శాఖ జేడీ హేమమహేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. దోమలపై దండయాత్ర పుస్తకావిష్కరణ దోమలపై దండయాత్ర–పరిసరాల పరిశుభ్రతపై ముద్రించిన పుస్తకాన్ని కలెక్టర్ ఆర్ ముత్యాలరాజు తన చాంబర్లో ఆవిష్కరించారు. పుస్తకాలను ఆశ వర్కర్లు, ఆరోగ్యకార్యకర్తలకు పంపిణీ చేసి దోమల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించేలా చూడాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జే సీ–2 రాజ్‌కుమార్, డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ వరసుందరం పాల్గొన్నారు. స్మార్ట్ విలేజ్, వార్డు లక్ష్యాలను పూర్తి చేయండి స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డు లక్ష్యాలను వంద శాతం సాధించేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆర్ ముత్యాలరాజు సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ తన చాంబర్లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు దత్తత తీసుకున్న గ్రామాల్లో ప్రభుత్వ పరంగా చేయాల్సిన కార్యక్రమాలను పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో మరుగుదొడ్లు నిర్మించి పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈఓ రామిరెడ్డి, సీపీఓ మూర్తి పాల్గొన్నారు. -
నకిలీ విత్తనాలతో నట్టేట మునిగాం
శ్రీ ఇందిరా సీడ్స్ ఎదుట రైతుల అందోళన పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు సిద్ధపడిన రైతు నెల్లూరు(పొగతోట): నకిలీ విత్తనాలతో నట్టేట మునిగామని, తమకు నష్టపరిహారం మంజూరు చేయాలని బుధవారం బోసుబొమ్మ సెంటర్ వద్ద ఉన్న శ్రీ ఇందిరా సీడ్స్ ఎదుట రైతులు అందోళనకు దిగారు. ముత్తుకూరుకు చెందిన వివేకానందరెడ్డి అనే రైతు పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. రైతులు అడ్డుకోవడంతో విరమించుకున్నాడు. ఈ సందర్భంగా వివేకానందరెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, శరత్‌బాబు, పెంచలనాయుడు తదితర రైతులు ఇందిరా సీడ్స్ వద్ద విత్తనాలు కొనుగోలు చేసి వరి పంటలు సాగు చేశామని, మీనాక్షి, 555 రకాలు సాగు చేశారు. పంట వేసి నాలుగు నెలలైనా వెన్నుతీయలేదన్నారు. ఎకరాకు రూ.30 వేలు పెట్టుబడి పెట్టామని, పంట ఏపుగా పెరిగినా వెన్నుతీయలేదన్నారు. ఎకరాకు రూ.20 నుంచి రూ.25 వేల వరకు నష్టపరిహారం మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పరిహారం చెల్లించకపోతే నిరాహారదీక్ష చేపడతామని హెచ్చరించారు. ఇందిరా సీడ్స్ యాజమాని రైతులతో చర్చించి పంటలను పరిశీలించారు. నాలుగు రోజుల్లో సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం. -
నకిలీ విత్తనాలను అరికట్టాలి
నెల్లూరు(వేదాయపాళెం) : నకిలీ విత్తనాలు అరికట్టాలని వైఎస్సార్ రైతు విభాగం జిల్లా కార్యదర్శి కే మురళీనాయుడు డిమాండ్‌చేశారు. ఆదివారం నగర శివారు ప్రాంతమైన అక్కచెరువుపాడు వరి పొలాల వద్ద విభాగం ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేపట్టారు. మురళీనాయుడు మాట్లాడుతూ నాలుగు నెలల వ్యవధిలో పంట కోతకు వస్తుందని, పెట్టుబడి స్వల్పమని ఇందిరా సీడ్స్ ద్వారా 555 రకం వరి విత్తనాలను అక్కచెరువుపాడు రైతులకు అంటగట్టారన్నారు. విత్తనాలు నకిలీవి కావడంతో పంట వేసి ఐదునెలల పదిరోజులవుతున్నా చివరి దశకు రాలేదన్నారు. వెన్ను సక్రమంగా తీయడం లేదని, కొన్నిచోట్ల పైరుకు వెన్నే రాలేదన్నారు. అధికారులు విచారణ జరిపి రైతులను ఆదుకోవాలని కోరారు. వైఎస్సార్సీపీ నగర కార్యదర్శి బత్తల కృష్ణ, నాయకులు కూకాటి హరిబాబు, రాజ పలువురురైతులు పాల్గొన్నారు. -
నకి‘లీలలు’ తెలుసుకో.. రైతన్నా మేలుకో..
- ఖరీఫ్ సాగుపై జాగ్రత్తలు అవసరం - నకిలీ విత్తనాలు, ఎరువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి - వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటించాలి ఆరుగాలం శ్రమకు ఫలితం దక్కాలంటే.. ఆది నుంచే అన్నదాత అప్రమత్తంగా ఉండాలి. దుక్కి దున్నింది మొదలు.. పంట చేతికొచ్చే వరకు సాగుకు సంబంధించి జాగ్రత్తలు పాటించాలి. సాగుకు అవసరమయ్యే ప్రతి వస్తువు కొనుగోలులో, చేసే ప్రతి పనిలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యంగా విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల కొనుగోళ్లలో అత్యంత జాగ్రత్తలు అవసరం. వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తల సలహాలు, సూచనలతో ముందుకు సాగాలి. విత్తన ఎంపిక నుంచి, పంట దిగుబడి పొందే వరకు శాస్త్రీయంగా సేద్యపు పద్ధతులు అవలంభించడంతో పాటు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటేనే అన్నదాత పడ్డ ఆరుగాలం శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. రైతన్న మోమున ఆనందం వెల్లివిరుస్తుంది. అందుకే ఆ దిశగా అడుగులు వేయాలి. - నిజామాబాద్ వ్యవసాయం విత్తనాలు కొనే ముందే - వ్యవసాయ శాఖ లెసైన్సు పొందిన అధీకృత డీలర్ల నుంచే విత్తనాలు కొనుగోలు చేయాలి. - సరిగా సీల్ చేసి ఉన్న బస్తాలు, ధ్రువీకరణ పత్రం ఉన్న విత్తనాలనే ఎంపిక చేసుకోవాలి. - బస్తాపై రకం పేరు, లాట్ నంబరు, గడువు తేదీ తదితర వివరాలు గమనించాలి. - కొనుగోలు బిల్లుతో పాటు నంబరు, విత్తన రకం, గడువు తేదీ పేర్కొనేలా డీలర్ సంతకం తీసుకోవాలి. రైతు సంతకం కూడా బిల్లుపై ఉండేలా చూసుకోవాలి. - పైవేటు విత్తన సంస్థలు పెద్ద ఎత్తున చేసే ప్రచారానికి ఆకర్షితులై విత్తనాలు కొనుగోలు చేయకూడదు. - విత్తనాన్ని ఎన్నుకొనే ముందు వ్యవసాయ శాఖ అధికారి, శాస్త్రవేత్తల సూచనలు తీసుకోవడం ఎంతో మంచిది. - మార్కెట్లో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా ధ్రువీకరించన విత్తనాలు విక్రయిస్తారు. వీటిని కొనుగోలు చేసే సమయంలో బస్తాపై నీలి వర్ణం(బ్లూ) ట్యూగు ఉందో లేదో గమనించాలి. ఈ ట్యాగు బస్తాకు కుట్టి సీల్ చేసి ఉంటుంది. దీనిపై వివరాలు పూర్తిగా తెలుసుకొని కొనుగోలు చేయాలి. - ఫుల్ సీడ్ (లేబుల్ విత్తనం) కూడా మార్కెట్లో లభ్యమవుతోంది. వీటిని కొనుగోలు చేసే ముందు విత్తన సంచిపై లేత ఆకుపచ్చ ట్యాగ్ కుట్టి ఉంటుంది. - దీనిపై విత్తన ప్రమాణాలు ముద్రించి విక్రయిస్తారు. ఈ విత్తనాలను రైతులు కేవలం ఆయా కంపనీల నమ్మకం మీదే కొనుగోలు చేయాలి. ట్యాగుపైన వివరాలు పూర్తిగా తెలుసుకొని వ్యాపారి నుంచి సరైన బిల్లు తీసుకొని కొనుగోలు చేయాలి. - ఎలాంటి విత్తనం కొనుగోలు చేసినా తప్పక బిల్లు తీసుకోవాలి. బిల్లుపై పేరు, విత్తన రకం, తేదీ తదితర వివరాలు ఉన్నవో లేదో రైతులు సరి చూసుకోవాలి. - పంటసాగు పూర్తయ్యే వరకు తప్పని సరిగా బిల్లును దాచి ఉంచాలి. - బిడిల్ విత్తనం కొనుగోలు చేసేటప్పుడు విత్తన సంచికి పసుపు రంగు ట్యాగు ఉందో లేదో చూడాలి. ఈ ట్యాగుపై విత్తనం భౌతిక స్వచ్ఛత, మొలకెత్తే శాతం, జన్యు నాణ్యత వంటి వివరాలు ఉంటాయి. - గడువు దాటిపోయిన విత్తనాలు కొనుగోలు చేయకూడదు. - పంట మొలకెత్తే దశలో కానీ, పూత దశలో కానీ లోపం కనిపిస్తే వెంటనే మండల వ్యవసాయాధికారికి తెలియజేయాలి. - పత్తి విత్తనాల్లో జిన్నింగ్ చేసి ప్యాకింగ్ చేసిన వాటిని కొనుగోలు చేయరాదు. ఎరువుల విషయంలో.. - నాణ్యమైన ఎరువులనే వాడాలి. పంటల అధిక దిగుబడికి రసాయన ఎరువులు ఎంతో మేలు చేస్తాయి. అక్కడక్కడ కొందరు దళారులు, వ్యాపారులు నాసిరకం ఎరువులు విక్రయిస్తూ రైతులను మోసం చేస్తున్నారు. ఫలితంగా అమాయక రైతులు పెట్టుబడులు సైతం నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని మెలకువలు పాటిస్తే నకిలీలను నివారించే ఆస్కారం ఉంది. - లెసైన్సు దుకాణంలోనే ఎరువులు కొనుగోలు చేయాలి. - కొనుగోలు చేసిన ఎరువుకు సరైన బిల్లు పొందాలి. బిల్లును జాగ్రత్తగా దాచాలి. - డీలర్ బుక్కులో విధిగా రైతు సంతకం చేయాలి. మిషను కుట్టు ఉన్న ఎరువు సంచులను మాత్రమే కొనాలి. చేతితో కుట్టినట్లయితే దానిపై సీసంతో సీల్ ఉందో లేదో చూడాలి. బస్తాపై ప్రామాణిక పోషకాలు, ఉత్పత్తిదారుని వివరాలు ఉండాలి. - రైతు తప్పని సరిగా బస్తాను తూకం వేయించి తీసుకోవాలి. చిరిగిన, రంధ్రాలున్న బస్తాలను తీసుకోవద్దు. ఎరువు వినియోగం అనంతరం ఖాళీ సంచులను పడేయడం, అమ్మివేయడం చేయకూడదు. - ఇటీవల రైతులు సూక్ష్మ పోషకాలపై ఆసక్తి చూపుతున్నారు. అందమైన ప్యాకింగ్‌కు ఆకర్షితులు కాకుండా అధికారుల సిఫారసు మేరకు కొనాలి. - కొనుగోలు చేసిన ఎరువు విషయంలో అనుమానం వస్తే వెంటనే వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం అందించాలి. అనుమానం ఉన్న ఎరువుల నమూనాలను రూ.10 డీడీ జత చేసి పరీక్షలకు పంపించాలి. కల్తీని ఇలా గుర్తించవచ్చు.. - చెమ్మగిల్లి ఉన్న ఎరువుల్లో ప్రామాణికం, నాణ్యత లోపిస్తుంది. కొన్ని సందర్భాల్లో తప్ప ఒక ఎరువులోని గుళికలన్నీ ఒకే రంగులో ఉంటాయి. - అన్య పదార్థం ఎరువులో కనిపిస్తే దాన్ని కల్తీ ఎరువుగా గుర్తించాలి. - సాధారంగా యూరియా, సంకీర్ణ ఎరువులు, కాల్షియం, అమ్మోనియం నైట్రేట్ గుళికల రూపంలో ఉంటాయి. 15:15:15 లేదా 20:20:0 రేణువుల రూపంలోనూ మ్యూరేట్ ఆఫ్ పొటాషియం సల్ఫేట్, సూపర్ ఫాస్పేట్ పొడి రూపంలో ఉంటాయి. - 5 మి.లీ. పరిశుభ్రమైన నీరు (డిస్టిల్డ్ వాటర్) ఒక చెంచా ఎరువును బాగా కలిపిన తర్వాత అడుగున ఏమీ మిగలక స్వచ్ఛమైన ద్రావణం తయారవ్వాలి. ఈ ద్రావణం పరీక్ష యూరియా, అమ్మోనియం సల్ఫేట్, జింక్ సల్ఫేట్లకు వర్తిస్తుంది. మ్యూరేట్ ఆఫ్ పొటాషియం, అమ్మోనియం క్లోరైడ్ క్లోరైడ్ ఎరువులకు 10 మి.లీ. పరిశుభ్రమైన నీరు వాడాలి. - 15:15:15, 28:28:0, 19:19:19, 17:17:17, 14:28:14, యూరియా 24:24:0 ఎరువులను పరీక్షించడానికి 5 మి.లీ. పరిశుభ్రమైన నీటిలో ఒక చెంచా ఎరువును బాగా కలిపితే ఆ ద్రావణం మడ్డీగా ఉంటుంది. - కాంప్లెక్స్ ఎరువుల తయారీదారులు ఎరువుల తయారీలో మూల పదార్థ ఎరువుల పూత చుట్టేందుకు ఇసుక రేణువులను ఉపయోగిస్తారు. అందులో ముఖ్యంగా డీఏపీ 17:17:17, 15:15:15: మొదలైన ఎరువులకు వాడతారు. ఈ ఎరువులు నీటిలో కరిగిన తర్వాత కనబడే ఇసుకను చూసి దీనిని కల్తీగా గుర్తించి ఉపయోగించకూడదు. పురుగుల మందుల్లో... - చీడపీడల నివారణలో వాడే క్రిమి సంహారక మందుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వ్యవసాయ శాఖ సూచించే మందులనే కొనాలి. - లెసైన్సు లేని దుకాణాల నుంచి కొనరాదు. అవసరానికి మించి కొని నిల్వ చేసుకుంటే మందులు చెడిపోతాయి. - లేబుల్ లేని మందు సీసా, డబ్బా, ప్యాకెట్ సంచులను కొనరాదు. మందు లేబుల్ మీద ప్రకటించిన మందు పేరు, రూపం, మందు శాతం, పరిమాణం, విష ప్రభావం తెలిపే గుర్తులు, వాడకంలో సూచనలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విరుగుడు మందులు, బ్యాచ్ నంబర్లు, వాడాల్సిన గడువు, తయారు చేసిన సంస్థ పేరు, రిజిస్ట్రేషను విషయాలు పరిశీలించాలి. - తప్పనిసరిగా అన్ని వివరాలతో బిల్లు పొందాలి. - ఎరువుల మందుల్లో విషపూరిత పదార్థం స్థాయిని తెలిపేందుకు డైమండ్ ఆకారంలో తెలుపుతో మరో రంగు వినియోగిస్తారు. వాటి వర్గీకరణ ఇలా ఉంటుంది. అత్యంత విషపూరితం ఎరుపు రంగు, అతి విషపూరితం పసుపు రంగు, విషపూరితం నీలరంగు, స్వల్ప విషపూరితం ఆకుపచ్చ రంగు. - మందుల నిల్వలోనూ కొన్ని సూచనలు పాటించాలి. - వాడిన మందు సీసా,డబ్బా, ప్యాకెట్ సంచులను విధిగా ధ్వంసం చేసి లోతైన గుంటలో పూడ్చేయాలి. మందులు కలిపిన వాడిన పాత్రలను ఇతర అవసరాలకు వాడకూడదు. సస్యరక్షణ మందులు - విచక్షణ రహితంగా సస్యరక్షణ మందులు వాడరాదు. - గడువు దాటిపోయిన సస్య రక్షణ మందులను కొనుగోలు చేయరాదు. - కారుతున్న, సీళ్లు సరిగా లేని మందులను కొనరాదు. - లెసైన్సు లేని డీలర్లు సస్యరక్షణ మందులు విక్రయిస్తుంటే వెంటనే సమీప వ్యవసాయాధికారికి తెలియజేయాలి. బిల్లులు పొందాలి రైతులు విత్తనాలు, ఎరువులకు సంబంధించి ఏది కొనుగోలు చేసినా సంబంధిత దుకాణదారు నుంచి పూర్తి వివరాలతో తప్పకుండా బిల్లు పొందాలి. నకిలీదని తేలినప్పుడు ఈ బిల్లు ఆధారంగానే చర్యలు తీసుకోవచ్చు. కనుక విత్తనాలు, ఎరువుల కొనే ముందు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎమ్మార్పీ కంటే అధిక ధరకు అమ్మితే అధికారుల దృష్టికి తీసుకురావాలి. ఎలాంటి అనుమానం కలిగినా సమాచారం అందించాలి. - నర్సింహా, జేడీఏ, నిజామాబాద్ -
సబ్సిడీ తగ్గించిన వ్యవసాయ శాఖ
కర్నూలు(అగ్రికల్చర్), న్యూస్‌లైన్: ఖరీఫ్ సాగుకు విత్తనాలను సమకూర్చుకోవడం రైతన్నకు భారమవుతోంది. సబ్సిడీ విత్తనాల ధరను మార్కెట్ కంటే ఎక్కువకు నిర్ణయించడం పట్ల వ్యవసాయ శాఖపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రధానంగా వేరుశనగ విషయంలో రైతులు ముందుగా పూర్తి ధర చెల్లించాలనే షరతు విధించడం రైతుల ఆగ్రహానికి కారణమవుతోంది. వచ్చే ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి జిల్లాకు 40 వేల క్వింటాళ్ల వేరుశనగ.. 12 క్వింటాళ్ల మొక్కజొన్న.. 500 క్వింటాళ్ల మినుములు.. 100 క్వింటాళ్ల పెసలు.. 50 క్వింటాళ్ల సద్దలు.. 50 క్వింటాళ్ల ఆముదం.. 4,500 క్వింటాళ్ల దయంచ.. 300 క్వింటాళ్ల పిల్లి పెసరను సబ్సిడీపై పంపిణీ చేసేందుకు మంజూరయ్యాయి. గతంలో వేరుశనగకు 30 శాతం సబ్సిడీ ఉండగా.. మిగిలిన విత్తనాలకు 50 శాతం సబ్సిడీ ఇచ్చేవారు. జిల్లాలో కందులు, మినుములు, పెసలు సాగు భారీగా ఉంటోంది. ఈ విత్తనాలకు ఇచ్చే సబ్సిడీని విపత్తు ప్రస్తుతం 33 శాతానికి తగ్గించడం పట్ల రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కంది ధర కిలో రూ.59గా ప్రభుత్వం నిర్ణయించింది. గత ఏడాది కంటే ఈసారి కంది విత్తనాలు కిలోపై ధర రూపాయి పెరిగింది. అయితే 50 శాతం ఉన్న సబ్సిడీని 33.05 శాతానికి తగ్గించడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. మినుములు కిలో ధర గత ఏడాది రూ.58 కాగా.. రూ.74కు పెరిగింది. దీనిపై సబ్సిడీని మాత్రం 50 నుంచి 33.11 శాతానికి తగ్గించడం గమనార్హం. పెసర ధరను కూడా అడ్డగోలుగా పెంచేశారు. గత ఏడాది కిలో పెసర విత్తనాల ధర రూ.68 కాగా.. ఈసారి ధర ఏకంగా రూ.88కు చేరింది. ఇక వేరుశనగ విషయానికొస్తే.. ఖరీఫ్ సీజన్లో దాదాపు 1.50 లక్షల హెక్టార్లలో సాగవుతోంది. జిల్లాకు కె6 రకం వేరుశనగ 40 వేల క్వింటాళ్లు మంజూరైంది. మార్కెట్లో నాణ్యమైన వేరుశనగ క్వింటాలు ధర రూ.4 వేలలోపే. గత ఏడాది ఖరీఫ్‌లో వేరుశనగ పండించిన రైతుల్లో 80 శాతం మంది రూ.3 వేల లోపు ధరకే అమ్ముకున్నారు. సబ్సిడీపై పంపిణీ చేసే వేరుశనగకు మాత్రం పూర్తి ధర రూ.4,600గా నిర్ణయించడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో సబ్సిడీ 32.61 శాతానికే పరిమితం చేశారు. సబ్సిడీ పోను వేరుశనగ క్వింటాలుకు రూ.3,100 చెల్లించాల్సి ఉంది. సబ్సిడీ పోను మిగిలిన ధరకే మార్కెట్లో వేరుశనగ లభిస్తుండటం గమనార్హం. వేరుశనగకు పూర్తి ధర చెల్లించాల్సిందే... సబ్సిడీపై వేరుశనగ తీసుకోవాలనుకునే రైతులు ముందుగా పూర్తి ధర అంటే కిలోకు రూ.46 చెల్లించాల్సి ఉంది. ఈ మేరకు వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేయడం విమర్శలకు తావిస్తోంది. గత రబీలో పప్పుశనగకు కూడా ముందు పూర్తి ధర చెల్లించాలని ప్రకటించడంతో విత్తనాలు తీసుకునేందుకు రైతు లు వెనుకంజ వేశారు. ఖరీఫ్‌కు సంబంధించి వేరుశనగకు ముందు పూర్తి ధర చెల్లించాలని వ్యవసాయ శాఖ నిర్ణయించడంపై రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. కొనుగోలుకు ఆసక్తి చూపకపోవచ్చని భావిస్తున్నారు. అప్పుడే నకిలీలు: జిల్లాలో నకిలీ విత్తనాలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా బీటీ పత్తిలో నకిలీల బెడద గత ఏడాదికంటే ఈసారి రెట్టింపయింది. సాధారణ పత్తి విత్తనాలను ప్రాసెసింగ్ చేసి కలర్ అద్ది ప్యాకింగ్ చేసి బీటీ పేరు 450 గ్రాముల ప్యాకెట్‌ను రూ.830 ప్రకారం అమ్ముతున్నారు. సి.బెళగల్, గూడూరు, కోడుమూరు, దేవనకొండ, ఆస్పరి, ఎమ్మిగనూరు, ఆదోని, హాలహర్వి తదితర మండలాల్లోని గ్రామాల్లో నకిలీ బీటీ విత్తనాల వ్యాపారం జోరుగా జరుగుతోంది. జిల్లాకు 8.30 లక్షల బీటీ విత్తన ప్యాకెట్లు మంజూరైనా సంబంధిత కంపెనీలు వీటిని సిద్ధం చేయని పరిస్థితి. ఈ కారణంగా రైతులు నకిలీ విత్తనాల బారిన పడుతున్నారు. నకిలీ విత్తనాలపై నియంత్రణ లేకపోవడం వల్ల ఇప్పటికే కోట్లాది రూపాయల విలువ చేసే నకిలీ బీటీ విత్తనాలు రైతులకు అంటగట్టినట్లు తెలుస్తోంది.