
సూర్యాపేట అర్బన్/కోదాడ అర్బన్: రాష్ట్రంలో ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. గురువారం సూర్యాపేటలో, కోదాడలలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలతో విసిగివేసారిన ప్రజలు.. టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఉన్న తమవైపు ఆకర్షితులవుతున్నారన్నారు.
పంటలు దెబ్బతిని రైతులు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్యం ఎలాంటి సహాయం అందజేయడం లేదని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా నాసిరకం విత్తనాలు సరఫరా అయితే చిన్న స్థాయి ఉద్యోగుల మీద చర్యలు తీసుకొని చేతులు దులుపుకున్నారని విమర్శించారు రైతులకు ఎకరానికి రూ.8 వేలు ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం మోసపూరితమని, అది భూస్వాములకు లబ్ధి చేకూర్చే విధంగా ఉందన్నారు. దీనివల్ల కౌలు రైతులకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment