అప్పు ఇవ్వడమే శాపమైంది..
అప్పు ఇవ్వడమే శాపమైంది..
Published Wed, Nov 23 2016 11:20 PM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM
- అప్పు తీర్చాలని నోటీస్ పంపినందుకు వేటకొడవలితో దాడి
పాణ్యం: అవసరానికి అప్పు ఇచ్చి ఆదుకోవడమే ఆయనకు శాపమైంది. తిరిగి అప్పు చెల్లించాలని కోరడంతో తీసుకున్న వ్యక్తి వేటకొడవలితో అతి కిరాతకంగా దాడి చేసి హత్య చేసిన సంఘటన పాణ్యం మండలం కౌలూరు గ్రామంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. పాణ్యం ఎస్‌ఐ మురళీమోహన్‌రావు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన రేషన్ డీలర్ మన్నే ఏసేపు(55) ఇదే గ్రామానికి చెందిన చెట్ల గోపాల్‌కు రూ.6లక్షలు అప్పు ఇచ్చాడు. కొంతకాలంగా అప్పు తీర్చమని కోరినా స్పందించకపోవడంతో నాలుగు రోజులక్రితం న్యాయవాది ద్వారా గోపాల్‌కు నోటీస్ పంపించారు. దీన్ని మనసులో పెట్టుకొని బుధవారం సాయంత్రం గ్రామంలోని శివాలయం వైపు వెళ్తున్న ఏసేపును పిలిచి మరీ వేటకొడవలితో అతి కిరాతకంగా నరికి పరారయ్యాడు. గ్రామస్తుల సమాచారంతో పాణ్యం సీఐ పార్థసారధిరెడ్డి, పోలీసు సిబ్బంది అక్కడకు చేరుకొని హత్యతీరును పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతుడికి భార్య ఎలిజబెత్తమ్మ, కుమారుడు రాజీవ్(మద్దికెర పోలీస్‌స్టేషలో కానిస్టేబుల్), ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
దళితులుపైదాడి అమానుషం
దళితులపైదాడి అమానుషమని మాలమహనాడు మండల అ«ధ్యక్షుడు దేవదత్తు అన్నారు. దళితుల ఎదుగుదల చూసి ఓర్వలేక ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారన్నారు. నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్‌చేశారు.
Advertisement