ఓ ప్రయాణీకుడు రైల్లో పోగొట్టుకున్న పర్సును తిరిగి అతనికి అప్పగించి కాచిగూడ రైల్వే పోలీసులు తమ నిజాయితిని చాటుకుని పది మందికి ఆదర్శంగా నిలిచారు. రైల్వే హెడ్‌కానిస్టేబుల్ ఆర్.లాలియానాయక్ తెలిపిన వివరాల ప్రకారం... వరంగల్ జిల్లా గిర్మాజిపేటకు చెందిన టీచర్ కె.రాజేశ్వర్‌రావు (48) యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైల్లో బోగినెంబర్ బి1 సీట్ నెంబర్ 18,19 బెర్త్‌లలో తన తమ్ముడు కూచన వినోద్‌కుమార్‌తో కలిసి ఈ నెల 21వ తేదీన యశ్వంత్‌పూర్ నుంచి కాచిగూడకు ప్రయాణం చేసిన సందర్భంలో మని పర్సు పోగోట్టుకున్నాడు.
రైలు దిగి కూకట్‌పల్లిలోని తమ్ముని ఇంటికి వెళ్లిపోయాడు. రైల్వే పోలీసులు యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలును తనిఖీ చేస్తుండగా పర్స్ దొరికింది. పర్స్‌లో ఉన్న ఐడి కార్డు, ఏటిఎం కార్డుల ఆధారంగా బాధితుడు రాజేశ్వర్‌రావుకు పోన్ చేసి పర్స్ దొరికిన విషయాన్ని రైల్వే పోలీసులు తెలియజేశారు. పర్సులో రూ.5,280 నగదు, ఏటిఎం కార్డు, డ్రై వింగ్ లెసైన్స్ తదితర వస్తువులు ఉన్నవి. రాజేశ్వర్‌రావు రైల్వే పోలీస్ స్టేషన్‌కు వచ్చి పర్సులో అన్ని వస్తువులు ఉన్నవని లిఖిత పూర్వకంగా వ్రాసి పోలీస్‌స్టేషన్‌లో ఇచ్చి పర్సును తీసుకుని వెళ్లాడు. తన పర్సుతో పాటు విలువైన వస్తువులను తనకు అప్పగించినిజాయితీ చాటుకున్న రైల్వే పోలీసులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు.