రైలు ఢీకొని ఓ యువకుడు మృతిచెందిన సంఘటన నగరంలోని రాజేంద్రనగర్ సర్కిల్ మైలార్ దేవుపల్లి రైల్వే గేట్ సమీపంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది.
రైలు ఢీకొని ఓ యువకుడు మృతిచెందిన సంఘటన నగరంలోని రాజేంద్రనగర్ సర్కిల్ మైలార్ దేవుపల్లి రైల్వే గేట్ సమీపంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా.. యువకుడు ఆత్మహత్య చేసుకోవడానికి రైలు కిందపడ్డాడా లేక ప్రమాదవశాత్తు రైలు ఢీకొని మృతిచెందాడా అనే కోణంలో పోలీసులు దృష్టి సారిస్తున్నారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.