పెద్దముడియం: డి.కల్వటాల గ్రామంలో పొలం రస్తా విషయంపై ఇరు వర్గాల రైతులు గొడవ పడటంతో ఇద్దరు తీవ్ర గాయాల పాలయ్యారు. శనివారం సాయంత్రం జి.వెంకటసుబ్బయ్య, జి.వెంకటేశ్వర్లు.. ప్రత్యర్థి వర్గమైన వాగు పెద్దబాల సుబ్బు, చిన్నబాల సుబ్బు ఇంటి వద్ద గొడవ పడ్డారు. వారి మధ్య మాటకుమాట పెరిగి రార్లు, కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో జి.వెంకటేశ్వర్లు, వెంకటసుబ్బయ్య తీవ్ర గాయాల పాలు కావడంతో చికిత్స నిమిత్తం జమ్మలమడుగు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ బాల ఓబన్న తెలిపారు.