వరద కాలువకు తగ్గిన నీటి విడుదల
వరద కాలువకు తగ్గిన నీటి విడుదల
Published Sat, Aug 13 2016 10:46 PM | Last Updated on Mon, Sep 4 2017 9:08 AM
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌నుంచి ఆయకట్టు కోసం కాలువల ద్వార నీటి విడుదల కొనసాగుతోంది. ప్రాజెక్ట్ నుంచి ఎల్‌ఎండీకి వరద కాలువ ద్వార సరఫరా అవుతున్న నీటిని 6,076 క్యూసెక్కుల నుంచి 5,500 క్యూసెక్కులకు తగ్గించారు. ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువ ద్వార 6,125 క్యూసెక్కులు, లక్ష్మీ కాలువ ద్వార 50 క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వార 488 క్యూసెక్కుల నీటి విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్ట్‌లోకి వరద నీరు నిలిచి పోయింది. దీంతో ప్రాజెక్ట్ నీటి మట్టం వేగంగ తగ్గుతోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1091(90టీఎంసీలు) అడుగులు కాగా శనివారం సాయంత్రానికి ప్రాజెక్టులో 1076.00(42.5 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని ప్రాజెక్ట్ అధికారులు పేర్కొన్నారు. కాకతీయ కాలువ ద్వార నీటి విడుదల కొనసాగుతుండటంతో స్థానిక జల విద్యుదుత్పత్తి కేంద్రంలో మూడు టర్బయిన్ల ద్వార 18 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతోందని జెన్‌కో అధికారులు తెలిపారు.
Advertisement