ఎస్కేయూ : వర్సిటీ ఎంఫిల్, పీహెచ్‌డీ ప్రవేశాలకు నిర్వహించిన రీసెట్–2016 ఆదివారం ముగిసింది. తొలిసారిగా ఆన్‌లైన్ ప్రవేశ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 64 శాతం మంది విద్యార్థులు ఆన్‌లైన్ పరీక్షలకు హాజరైనట్లు రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ డీన్ చింతా సుధాకర్ తెలిపారు. ఆదివారం పరీక్ష కేంద్రాన్ని వీసీ కె.రాజగోపాల్ పర్యవేక్షించారు. రీసెట్ సబ్జెక్టులకు సంబంధించి సోమవారం ‘కీ’ని పరిశీలిస్తారు.