కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి ఆఫర్ | revanth reddy slams cm kcr | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి ఆఫర్

Published Wed, Jun 1 2016 9:20 PM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM

కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి ఆఫర్ - Sakshi

కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి ఆఫర్

మెదక్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఫాంహౌస్ భూములను ఎకరానికి రూ.10 లక్షల చొప్పున ఇస్తే తీసుకోవటానికి సిద్ధంగా ఉన్నానని టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఆ స్థలంలో మల్లన్నసాగర్ ముంపు బాధితులకు మంచి కాలనీ నిర్మిస్తామని తెలిపారు. కేసీఆర్, హరీశ్‌రావు తమ భూములను ముంపు బాధితులకు పంచి ఆదర్శంగా నిలవాలన్నారు. మెదక్ జిల్లా తొగుట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్ సర్పంచ్ సునందబాయి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలకు బుధవారం ఆయన సంఘీభావం ప్రకటించారు.

మల్లన్నసాగర్‌లో భూములు పోతే బాధిత రైతులు అడుక్కు తినాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. బలవంతపు భూసేకరణ సరికాదని, బాధితులకు ఎకరాకు రూ. 25 లక్షల చొప్పున చెల్లించాలని డిమాండ్ చేశారు. బంగారు తెలంగాణ తీసుకొస్తామని ప్రజల బతుకులు బండలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రాజెక్టుల రీ డిజైనింగ్ పేరిట కేసీఆర్ కుటుంబం రూ.10 వేల కోట్లు దండుకుందని ఆరోపించారు. బంగారు తెలంగాణ అంటూ.. సంబరాలకు సిద్ధమవుతున్న పాలకులు.. ఈ గడ్డను బొందలగడ్డగా మార్చారని విమర్శించారు. .
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement